చికిత్స పొందుతున్న అన్విక
దేవరపల్లి: కాలిన గాయాలతో విజయవాడలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక అన్వికను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లికి చెందిన గొల్లపల్లి రాకేష్ నాలుగేళ్ల కుమార్తె ఇంటి వద్ద ఆటలాడుకుంటూ వేడి సాంబారు గిన్నెలో పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం విజయవాడలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.
వైద్యానికి రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఎమ్మెల్యే తలారి వెంకట్రావును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సాయం చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎమ్మెల్యే వెంకట్రావు కోరారు. ఈ మేరకు సీఎం సహాయనిధి నుంచి రూ.15 లక్షలు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంకు, ఎమ్మెల్యేకు బాలిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. దేవరపల్లి మండలం గొల్లగూడెం దివ్యాంగుల, వృద్ధుల ఆశ్రమం వ్యవస్థాపక అధ్యక్షుడు కాగిత భాస్కరరావు బాలిక వైద్యఖర్చులకు రూ.5,116 సాయం అందజేశారు.
చదవండి: (గోరంట్ల వెర్సెస్ ఆదిరెడ్డి.. సిటీ సీట్ హాట్ గురూ..!)
Comments
Please login to add a commentAdd a comment