ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీకి మరో గట్టి దెబ్బ తగిలింది. క్యూ3 ఆదాయ విషయంలో సమీప ప్రత్యర్థి కంపెనీల నుంచి గట్టి పోటీతో పాటుగా చిప్స్ కొరత షావోమీ కొంపముంచింది.
చిప్స్ కొరతతో షావోమీకి గట్టి దెబ్బ..!
ప్రపంచవ్యాప్తంగా పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు, ఆటోమొబైల్ కంపెనీలను సెమికండక్టర్స్ (చిప్స్) కొరత తీవ్రంగా వేధిస్తోంది. చిప్స్ కొరతతో సతమతమవుతున్న కంపెనీల జాబితాలో షావోమీ కూడా నిలిచింది. చిప్స్ కొరత కారణంగా క్యూ3లో కంపెనీ వృద్ధి రేటు నెమ్మదించింది. చిప్ కొరత ఉన్నప్పటికీ, షావోమీ 2021లో దాదాపు 190 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 29 శాతం పెరిగిన కూడా యాపిల్ లాంటి కంపెనీలు షావోమీకు భారీ దెబ్బను వేశాయి. క్యూ3లో దాదాపు రూ. 90,910 కోట్ల విక్రయాలను జరిపిన షావోమీ అంచనాలను చేరుకోలేకపోయింది.
రెండో స్థానం నుంచి ..!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చిప్స్ కొరత, చైనాలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల తగ్గుదల కారణంగా...ప్రపంచంలోని టాప్ స్మార్ట్‌ఫోన్స్ జాబితాలో షావోమీ రెండోస్ధానం నుంచి మూడో స్ధానానికి పడిపోయింది. తాజాగా యాపిల్ రెండోస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ఐఫోన్-13 రాకతో షావోమీ అమ్మకాలు ఒక్కింతా పడిపోయాయి. ఐఫోన్-13ను రిలీజ్ కావడంతో ఇతర ఐఫోన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ రేట్లు అమాంతం తగ్గాయి. దీంతో షావోమీ అంచనాలు తారుమారు అయ్యాయి.
చదవండి: ఈవీ ఛార్జింగ్ సదుపాయాల కల్పన కోసం మెజెంటా భారీ పెట్టుబడులు
Comments
Please login to add a commentAdd a comment