జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో ఆదివారం ఆక్సిజన్ లేక పలువురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిసింది.
నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో ఆదివారం ఆక్సిజన్ లేక పలువురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. పట్టణంలోని మాన్యంచెల్కకు చెందిన వెయ్యి గ్రాముల బాలికను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చడానికి తీసుకురాగా ఆక్సిజన్ సరఫరా లేక సదరు బాలికను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ అధికారుల సమన్వయలోపంతో సరైన వైద్య సేవలు అందటం లేదని పలువురు విమర్శిస్తున్నారు.