పల్లె ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాల్సిన 104 వాహనాలు మర మ్మతుకు నోచుకోవడం లేదు. ఫలితంగా జిల్లా వాసులకు సేవలు అందించడం లేదు.
ఆపదలో 104
Published Wed, Jan 27 2016 7:15 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
పల్లె ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాల్సిన 104 వాహనాలు మర మ్మతుకు నోచుకోవడం లేదు. ఫలితంగా జిల్లా వాసులకు సేవలు అందించడం లేదు. క్లస్టర్ కేంద్రాల్లోనే తుప్పు పడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో గ్రామీణులకు వైద్యం అందడం లేదు.
మోర్తాడ్ : పల్లె ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే దృఢ సంకల్పంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 104 వైద్య సేవలకు ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. 104 వాహనాలకు మరమ్మతులు చేయించాలి. అయితే వాటి ని పట్టించుకోలేకపోతున్నారు. దీంతో మూడు నెలలుగా వాహనాలు క్లస్టర్ కేంద్రాలకే పరిమితమయ్యాయి. పీహెచ్‌సీకి మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని గ్రామాలకు నెలకోసారి 104 వాహనంతోపాటు సిబ్బంది వెళ్లి రోగులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేస్తారు. గర్భిణీలు, చిన్నారులతోపాటు ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 104 వైద్య సేవలు వరంగా మారాయి. ప్రధానంగా బ్లడ్‌ఫ్రెషర్, మధుమేహం వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేస్తారు. జిల్లాలో మోర్తాడ్, బాల్కొండ, ఆర్మూర్, డిచ్‌పల్లి, వర్ని, నవీపేట్, కోటగిరి, దోమకొండ, ఎల్లారెడ్డి, మద్నూర్, బిచ్కుంద, ధర్పల్లి, గాంధారి, పిట్లంలలో ఉన్న పీహెచ్‌సీలను క్లస్టర్ కేంద్రాలుగా మార్చారు. వీటి పరిధిలోనే పీహెచ్‌సీలు కొనసాగుతున్నా యి. అయితే పీహెచ్‌సీలకు వచ్చి వైద్యం చేయిం చుకోలేని వారి కోసం 104 సేవలను తీసుకువచ్చారు.
దీనిలో పెలైట్, ఫార్మాసిస్ట్, ఏఎన్‌ఎం, ల్యాబ్ టెక్నిషియన్ ఉంటారు. వీరు ఏ గ్రామానికి వెళితే అక్కడ ఉన్న సిబ్బందితో వైద్య సేవలు అందిస్తుంటారు. ఎనిమిదేళ్ల కింద కొనుగోలు చేసిన వాహనాలు తుప్పపట్టిపోతున్నా యి. వాహనాల ఇంజిన్ లైఫ్‌టైం అయిపోవడంతో వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒకవేళ కొత్తవాటిని ఏర్పాటు చేయని పక్షంలో ఉన్న వాటికి బాగు చేయించా లి. అయితే వాహనాలకు మరమ్మతులు చేయి ంచేందుకు ప్రభుత్వం నిధులను కేటాయించలేదు. దీంతో వాహనాలు కదలలేని స్థితిలో ఉన్నాయి. జిల్లాలోని 14 క్లస్టర్‌లకు బిచ్కుంద మినహా మిగిలిన అన్నింటిలో వాహనాలను మూలనపడ్డాయి. గతంలో డీజిల్ కు నిధులు ఇవ్వకనే సుమారు రెండు నెలల పాటు 104 వాహనాలు కదలలేవు. ఇప్పుడు వాహనాలు పూర్తిగా చెడిపోవడంతో వాటిని మరమ్మతులు చేయించే పరిస్థితి కనిపించడం లేదు. క్లస్టర్‌లకు నిధులు ఇచ్చినా వాటిని 104 వాహనాలకు ఖర్చు పెట్టే వీలు లేదు.
బైకులు, ఆటోలే దిక్కు...
104 వైద్య సిబ్బంది రోజు షెడ్యూల్ ప్రకారం తమకు కేటాయించిన గ్రామంలో రోగులకు వైద్య పరీక్షలను నిర్వహించేందకు బైకులు, ఆటోల్లో వెళుతున్నారు. అయితే 104 వాహనంలో ఉన్న సౌకర్యాలు అనేకం ఉన్నాయి. అది లేకుండా సిబ్బంది గ్రామాలకు వెళ్లి వైద్య సేవలను అందిస్తున్నా వాహన లోటు ఏర్పడుతోంది. 104లో వెళ్లితే రోగులకు మెరుగైన సేవలు అందుతాయి. వాహనం లేకుండా సిబ్బంది వెళ్లడంతో కేవలం మందులు మాత్రమే అందిస్తున్నారు.
పది రోజుల్లో బాగు చేయిస్తాం..
104 వాహనాల మరమ్మతులకు నిధులు లేవు. నిధుల కోసం ఉన్నతాధికారులకు లేఖ రాశాం. నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. వారం, పది రోజుల్లో అన్ని 104 వాహనాలను బాగు చేయిస్తాం. అనంతరం వైద్య సేవలు నిరంతరం కొనసాగుతాయి.
- డాక్టర్ వెంకట్, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో
Advertisement
Advertisement