బోధనలేక..బోధపడక
బోధనలేక..బోధపడక
Published Thu, Dec 29 2016 12:05 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
విలీన మండలాల్లో 318 మంది ఉపాధ్యాయుల కొరత ∙
ఏడాదిగా భర్తీ చేయని ప్రభుత్వం
పదో తరగతి విద్యార్థులు 860 మంది ∙
భావి భావిత పౌరుల భవితతోనా రాజకీయాలు!?
భవిత పాడై పక్కదారిపడితే బాధ్యులెవరు...? ∙
ఉత్తీర్ణతపై విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రశ్నలు
సీఎం సారూ... పోలవరం శరవేగంగా దూసుకుపోడానికి నాలుగు మండలాలను ఖమ్మం జిల్లా నుంచి విడగొట్టి మరీ తూర్పు గోదావరి జిల్లాలో కలిపారు. ఇటు తెలంగాణ అసెంబ్లీలో అటు ఏపీ అసెంబ్లీలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు గగ్గోలు పెడుతున్నా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టుగానే తయారవుతోంది. మాటలు కోటలు దాటుతున్నా ఆచరణ మాత్రం గుమ్మం దాటడం లేదు. ఎవరి బాధలు ఎలా ఉన్నా భావి, భారత పౌరులైన విద్యార్థుల భవిత అడ కత్తెరలో పోక చెక్కలా తయారైంది. చదువులోవాలన్న సూక్తులు మాత్రం చెబుతారు... ఇన్ని అసౌకర్యాల మధ్య ఎలా చదివేది బాబూ...
సాక్షి, రాజమహేంద్రవరం : 2014 జూన్ రెండో తేదీన తెలంగాణా నుంచి నాలుగు మండలాలు జిల్లాలో విలీనమయ్యాయి. అప్పటి వరకు ఆయా పాఠశాలలో పని చేస్తున్న తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఉపాధ్యాయులు రిలీవై తెలంగాణలోని పాఠశాలల్లో చేరిపోయారు. అప్పటి నుంచి విలీన మండలాల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. విలీన మండలాల్లో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు 267 ఉన్నాయి. వీటిల్లో 16,982 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో పలు సబ్జెక్టులకు ఉపాధ్యాయులే లేరు. 2014 నుంచి హిందీ ఉపాధ్యాయుడి లేని పాఠశాలలూ ఉన్నాయి. 10వ తరగతి వరకూ ఇదే తంతు..
విలీన మండలాల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యాబోధన కుంటుపడింది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన ఏడు మండలాల్లో కూనవరం, ఎటపాక, చింతూరు, వరరామచంద్రాపురం మండలాలను రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నుంచి జిల్లాలో కలిపారు. 2014 జూ¯ŒS రెండవ తేదీన ఈ నాలుగు మండలాలు జిల్లాలో విలీనమయ్యాయి. అప్పటి వరకు ఆయా పాఠశాలలో పనిచేస్తున్న తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఉపాధ్యాయులు తమకు తాముగా రిలీవ్ అయ్యారు. వారందరూ తెలంగాణలోని పాఠశాలల్లో చేరిపోయారు. అప్పటి నుంచి విలీన మండలాల పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. మూడు విద్యా సంవత్సరాలుగా ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. అయినా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఉపాధ్యాయులను నియమించకపోవడంతో బోధన ’వానాకాలం చదువుల్లా’ సాగుతోంది. విలీన మండలాల్లో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు 267 ఉన్నాయి. వీటిల్లో 16,982 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. చింతూరు మండలంలో 59 పాఠశాలలల్లో 7,396 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలల్లో 93 మంది ఉపాధ్యాయులు తెలంగాణకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాత్కాలికంగా డీఈవో పూల్ నుంచి 48 మంది ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తున్నారు. అయినా ఇంకా 43 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వరరామచంద్రాపురంలో 52 పాఠశాలల్లో 4.039 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ మండలంలో 66 మంది ఉపాధ్యాయ పోస్టులు 2014 నుంచీ ఖాళీగానే ఉన్నాయి. కూనవరం మండలంలో 61 స్కూళ్లలో 2,352 మంది విద్యార్థులున్నారు. ఈ పాఠశాలల్లో 74 ఉపాధ్యాయపోస్టులు ఖాళీగా ఉన్నాయి. డీఈవో పూల్ నుంచి 40 మంది పనిచేస్తుండగా ఇంకా 34 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఎటపాక మండలంలో 95 సూళ్ల పరిధిలో 5,195 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలల్లో 85 మంది ఉపాధ్యాయ పోస్టులు 2014 నుంచి ఖాళీగా ఉండగా ఈ ఏడాది 72 మంది డీఈవో పూల్ నుంచి నియమించారు. మిగిలిన 13 పోస్టులు అలాగే ఉండిపోయాయి. ఇక చింతూ రు ఆశ్రమపాఠశాలలో 40, జీపీఎస్ పాఠశాలలో 30 పోస్టులు 2014 నుంచి ఖాళీగా ఉన్నాయి.
పదో తరగతి విద్యార్థుల్లో ఆందోళన...
ఏదైనా ఓ తరగతిలో ఒక సబ్జెక్టుపై ఒక ఏడాది విద్యార్థి పట్టు సాధించకపోతే దాని ప్రభావం తరువాత తరగతులపై నిరంతరం ప్రభావం చూపుతుంది. అలాంటి పరిస్థితినే ఇప్పడు విలీన మండలాల విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. 2014 నుంచి ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది.
ఉపాధ్యాయులు లేకుండా ఎలా చదివేది...
2014లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థి ప్రస్తుతం పదో తరగతిలో ఉన్నాడు. ఉదాహరణకు ఎటపాక మండలం గౌరిదేవిపేటకు చెందిన ఇర్ఫా కృష్ణవేణి పదో తరగతి చదువుతోంది. ఆ స్కూల్లో 2014 జూ¯ŒS నుంచి హిందీ పండిట్ లేరు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతుండడంతో గత నెల నుంచి వేరే పాఠశాల నుంచి ఓ ఉపాధ్యాయుడు వచ్చి బోధిస్తున్నాడు. కృష్ణవేణికి 8, 9 తరగతుల్లో హిందీ పాఠం అంటే ఏమిటో తెలియదు. 10వ తరగతిలో కూడా అక్టోబర్ వరకు హిందీ బోధన జరగలేదు. చివరి నాలుగు నెలల్లో ఏడాది సిలబస్ అంతా పూర్తి చేయడం కూడా కష్టసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో హిందీ సబ్జెక్టులో పాస్ మార్కులు తెచ్చుకోవాలన్నా... విద్యార్థులకు గగనమే.
ఒక్క సబ్జక్టు తప్పినా ఏడాదంతా వృధాయే...
పదో తరగతిలో ఒక్క సబ్జెక్టు తప్పినా ఏడాది చదువు, సమయం రెండూ వృథా అవుతాయి. నాలుగు మండలాల్లో 860 మంది 10వ తరగతి విద్యార్థులు ఉన్నారు. కూనవరంలో 38 మంది విద్యార్థులుండగా ఇక్కడ తెలుగు, ఇంగ్లిషు, హిందీ సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేరు. లెక్కలు, సామాజిక శాస్త్రం, సై¯Œ్స ఉపాధ్యాయులే ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో డీఎస్సీ ద్వారా దాదాపు 8000 మంది ఉపాధ్యాయులను తీసుకున్నారు. వీరికి పోస్టింగ్‌లు ఇచ్చి ఈ ఖాళీలను భర్తీ చేయవచ్చు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ పని చేయలేదు. విద్యతోనే పేదరికాన్ని దూరం చేయవచ్చునని పాలకులు స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పాఠశాలల్లో ఉపన్యాసాలు దంచేస్తారు. ఇక విద్యార్థులతో ముచ్చటిస్తూ ఇదే విషయం చెబుతారు. అయితే విద్యార్థులను ఇలా నిర్లక్ష్యం చేయడం మాటలకు చేతలకు పొంతన ఉండదన్న నానుడి పాలకుల అతికినట్లు సరిపోతుంది.
Advertisement
Advertisement