బడిలో పాఠాలు చెప్పాల్సిన టీచర్లు... అనంతపురంలోని సైన్స్ సెంటర్‌లో ఇలా చెట్లకింద కాలం గడిపేస్తున్నారు. బదిలీల్లో పాయింట్లకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే సంబంధిత హెచ్‌ఎంల ద్వారానే పంపాలని విద్యాశాఖ చెబుతున్నా...క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కావడం లేదు. ఉపాధ్యాయులకు వస్తున్న సందేహాలపై చాలామంది హెచ్‌ఎంలు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దీంతో హెచ్‌ఎంలతో పాటు టీచర్లూ అ«ధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. రోజూ ఇలా వందలాదిమంది టీచర్లు సైన్స్ సెంటర్‌లో చెట్ల కింద పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు పాఠాలు చెప్పే వారు లేక ఆయా స్కూళ్లలోని విద్యార్థులంతా తరగతి గదుల్లో కాలక్షేపం చేస్తున్నారు.