
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో కీలక విభాగమైన భారత నావికాదళంలో సిబ్బంది కొరత భారీస్థాయిలో ఉంది. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్రం తెలిపిన వివరాల ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. అక్టోబర్ 31వ తేదీ నాటికి నౌకాదళంలో మొత్తంగా 10,896 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఆఫీసర్ ర్యాంక్ పోస్టులే 1,777 దాకా ఉన్నాయని లోక్‌సభలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment