bionic eye
-
ప్రపంచంలోనే తొలి 'బయోనిక్ ఐ': అంధుల పాలిట వరం ఈ ఆవిష్కరణ!
సాంకేతికతో కూడిన వైద్య విధానం సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతోంది. బాధితులకు కొత్త ఆశను అందించేలా ఆధునిక వైద్య విధానం కొత్త పుంతలు తొక్కుతోంది. అందులో భాగంగానే తాజాగా పరిశోధకులు 'బయోనిక్ ఐ'ని అభివృద్ధి చేశారు. జెన్నారిస్ బయోనిక్ విజన్ సిస్టమ్ అని పిలిచే ఈ ఆవిష్కరణ అంధత్వంతో బాధపడుతున్న లక్షలాదిమందికి కొత్త ఆశను అందిస్తోంది. అసలేంటీ ఆవిష్కరణ? ఎలా అంధులకు ఉపయోగపడుతుంది..?సాంకేతిక పుణ్యమా అని.. వైద్య విధానంలోని ప్రతి సమస్యకు పరిష్కారం క్షణాల్లో దొరుకుతుంది. ఆ దిశగానే చేసిన అధ్యయనంలో అంధత్వ చికిత్సకు సంబంధించిన కొంగొత్త ఆవిష్కరణకు నాంది పలికారు ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. వారంతా ప్రపంచంలోనే తొలి బయోనిక్ కంటిని అభివృద్ధి చేశారు. దీన్ని 'జెన్నారిస్ బయోనిక్ విజన్ సిస్టమ్' అని పిలుస్తారు. అంధత్వంతో బాధపడుతున్న వారికి కంటి చూపుని ప్రసాదించేలా కొత్త ఆశను రేకెత్తిస్తుంది. సాంకేతికతో కూడిన ఈ అత్యాధునిక చికిత్స విధానం అంధత్వ చికిత్సలో విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది. ఈ జెన్నారిస్ వ్యవస్థ అనేది వందేళ్లుగా చేస్తున్న పరిశోధనలకు నిలువెత్తు నిదర్శనం. నిజానికి పుట్టుకతో అంధత్వంతో బాధపడుతున్నవారికి కంటి చూపుని ఇవ్వడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే..? మనం కళ్లతో నేరుగా చూడలేం. మన కంటిలోని ఆప్టిక్ నరాలు మెదడుతో కనెక్ట్ అయ్యి ఉంటేనే ఇది సాధ్యం. ఇంతవరకు మన వైద్య విధానంలో ఈ దిశగా చికిత్స అభివృద్ధి చెందలేదు. ఎన్నాళ్లుగానో అపరిషృతంగా ఉన్నా ఆ సమస్యకు పరిశోధకులు ఈ సరికొత్త ఆవిష్కరణతో పరిష్కరించారు. ఈ జెన్నారిస్ సిస్టమ్ ఆప్టిక్ నరాలకు బదులుగా నేరుగా మెదడుకి దృష్టి సంకేతాలను పంపుతుంది. ముందున్న చిత్రాన్ని గ్రహించేలా అనుమతిస్తుంది. అయితే దీన్ని జంతువులపై ట్రయల్స్ నిర్వహించి.. సత్ఫలితాలు వస్తే గనుక మానవులపై ట్రయల్స్‌ని విజయవంతంగా నిర్వహించేలా సన్నద్ధమవతామని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం గొర్రెలపై ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సాంకేతికత ప్రధాన భాగం మెదడు నమునాకు విద్యుత్ ప్రేరణ అందించేలా వైర్లెస్ ఇంప్లాట్‌ను కలిగి ఉంటుంది. ఇది మెదడు ఉపరితలానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇది చిన్న పాటి విద్యుత్ పల్స్‌తో మెదడు కణాలను ఉత్తేజపరిచేలా వైర్‌లెస్‌గా ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. ఇది కస్టమ్ డిజైన్ హెడ్కేర్ ధరించే సూక్ష్మ కెమెరాను పోలి ఉంటుంది. కెమెరా ద్వారా క్యాప్చర్ చేసిన హై రిజల్యుషన్ ఇమేజ్‌లు విజన్ ప్రాసెసర్ యూనిట్ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. ఆ తర్వాత ఈ సంకేతాలు 11 పరికరాలకు వైర్‌లెస్‌గా ప్రసారమవుతాయి. ఇవి మెదడులో శస్త్రచికిత్స ద్వారా అమర్చిన టైల్స్ అనే పరికరానికి రిసీవ్ అవుతాయి. అవి విజువల్ కార్టెక్స్‌లోని న్యూరాన్లను ఉత్తేజపరిచి దృశ్యం కనిపించేలా చేస్తుంది. ఇది దాదాపు 100 డిగ్రీల వీక్షణ క్షేత్రాన్ని అందిస్తుంది. అంటే ఇది మానవ కన్ను పరిధితో పోలిస్తే కొంచెం తక్కువే అయిన్పటికీ.. గణనీయమైన సెన్సార్ సాంకేతికత గలిగిన ఈ పరికరం మంచి విజన్‌ని అందించడం విశేషం . (చదవండి: మానసిక ఆరోగ్యంపై శృతి హాసన్ హెల్త్ టిప్స్!) -
కళ్లు మూసుకున్నా కనిపిస్తుంది
లండన్: పోయిన కంటిచూపును తెప్పించడంలో బ్రిటన్ శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేశారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారు మాంచెస్టర్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు రే ఫ్లిన్కు చూపు తెప్పించారు. ఎనిమిదేళ్ల క్రితం కంటిచూపు పోయి కష్టపడుతున్న ఫ్లిన్కు కృత్రిమ రెటినాను అమర్చి, దానికి కంప్యూటర్, వీడియో కెమెరాను అనుసంధానించి సరికొత్త పద్ధతిలో కంటిచూపు తెప్పించారు. అందుకోసం వీడియో కెమెరాతో కూడిన ప్రత్యేక కళ్లజోడు తయారు చేయించారు. అది ఎలా పనిచేస్తుందంటే... కళ్లజోడు మధ్యనున్న ఓ చిన్న వీడియో కెమెరా మన ముందున్న దృశ్యాలను చిత్రీకరించి వాటిని వెంట వెంటనే మెడలో వేలాడే చిన్న కంప్యూటర్‌కు పంపిస్తుంది. ఆ కంప్యూటర్ వాటిని విద్యుత్ ప్రచోదనాలు (ఎలక్ట్రికల్ ఇంపల్సెస్)గా మార్చి వాటిని కనుగుడ్డు పక్కన అమర్చిన చిన్న యాంటెన్నాకు కేబుల్ అక్కర్లేకుండానే పంపుతుంది. అక్కడి నుంచి చిన్న కేబుల్ ద్వారా ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ కాస్తా ఎలక్ట్రోడ్స్గా మారి, కంటి రెటినా ఉపరితలం పైకి వెళ్లి, అక్కడ వీడియో దృశ్యాలను ప్రతిబింబిస్తాయి. అలాగే, ఎలక్ట్రోడ్స్ రెటీనా కణాలను ప్రేరేపిస్తాయి. తద్వారా మెదడు వీడియో గ్రాహక చిత్రాలను గుర్తిస్తుంది. రెటీనా దెబ్బతిన్న ఓ వృద్ధుడికి ఇలా చూపు తెప్పించడం ప్రపంచంలో ఇదే మొదటి సారని, ఇలాంటి ప్రయోగం చేయడం కూడా మొదటిసారేనని మాంచెస్టర్ రాయల్ ఐ హాస్పటల్ సర్జన్స్ తెలియజేస్తున్నారు. మొన్నటివరకు ఎవరో ఒకరి సహాయం లేకుండా బయటకు వెళ్లలేక పోయిన ఫ్లిన్ ఇప్పుడు ఎవరి సహాయం లేకుండానే చక్కగా పార్క్‌కు వెళ్లి వాకింగ్ చేస్తున్నానని చెబుతున్నారు. మరీ వీడియోలో రికార్డయినంత స్పష్టంగా దృశ్యాలను చూడలేమని, ఏ వస్తువునైనా పోల్చుకోగలమని, ఔట్లైన్స్ను బట్టి పేపర్ కూడా చదవొచ్చని ఆస్పత్రి ఆప్తల్మాలజిస్ట్ ప్రొఫెసర్ పావులో స్టాంగ్ తెలిపారు. కళ్లు మూసుకున్నా కంటి ముందు వస్తువులు కనిపించడం ఈ చూపులోవున్న విశిష్టతని ఆయన వివరించారు. ఎందుకంటే మూసుకున్నది కళ్లుగానీ వీడియో కెమెరా కన్ను కాదు కదా! పుట్టుకతో గుడ్డివాళ్లకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చూపు తెప్పించడం ఎలా అన్న అంశంపై తాము పరిశోధనలు కొనసాగిస్తున్నామని చెప్పారు.