న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ శుక్రవారం పంజాబ్, హరియాణా మినహా మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా విజయవంతమైంది. పంజాబ్, హరియాణాల్లో రోడ్డు, రైలు రవాణాను రైతులు అడ్డుకున్నారు. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో హైవేలను దిగ్బంధించారు. రైళ్లను అడ్డుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిర్వహిస్తున్న రైతు ఉద్యమానికి 4 నెలలు పూర్తయిన సందర్భంగా రైతు సంఘాల ఉమ్మడి వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ శుక్రవారం ఉదయం 6నుంచి సాయంత్రం 6 గంటల వరకు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బంద్ కారణంగా 4శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయని, 35 ప్యాసెంజర్ రైళ్లను, 40 గూడ్స్ రైళ్లను రైతులు అడ్డుకున్నారని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. యూపీలోని బల్లియాలో 20 మంది సీపీఐఎంఎల్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ ప్రభావం ఢిల్లీపై పెద్దగా లేదు.
Comments
Please login to add a commentAdd a comment