బ్యాంకు వ్యాన్‌ను నుంచి రూ.133 కోట్ల నగదును దొంగలు సినీఫక్కీలోదోచుకెళ్లారు.
పాటియాలా(పంజాబ్): పట్టపగలు అందరూ చూస్తుండగానే బ్యాంకు వ్యాన్‌ను నుంచి రూ.133 కోట్ల నగదును గుర్తు తెలయని వ్యక్తులు సినీఫక్కీలోదోచుకెళ్లారు. పంజాబ్ రాష్ట్రం పాటియాలా సమీపంలో ఈసంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చండీగఢ్ నగరంలోని ఓప్రైవేట్ బ్యాంకుకు చెందిన వ్యాన్ మంగళవారం ఉదయం బానూర్, రాజ్‌పురా పట్టణాల్లోని బ్యాంకు శాఖలకు నగదును అందజేయటానికి బయలుదేరింది. అయితే కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు స్కార్పియో వాహనంలో కొంత దూరం వెంబడించారు.
అనంతరం రాజ్‌పురా పట్టణంలోని విద్యాసంస్థలు ఉండే ప్రాంతం గుండా వెళ్తుండగా దానిని అటకాయించారు. వ్యాన్ డ్రైవర్‌పై కాల్పులు జరిపి అందులో ఉన్న దాదాపు రూ.1.33 కోట్ల నగదును ఎత్తుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ వాహనం కోసం గాలింపు చేపట్టారు. సీసీఫుటేజీలను సేకరించి నిందితుల కోసం పెద్ద ఎత్తున వెతుకులాట ప్రారంభించారు. తీవ్రంగా గాయపడిన వ్యాన్ డ్రైవర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. వ్యాన్లో మొత్తం ఏడుగురు ఉన్నట్లు తేలింది. దుండగులు రెండు వాహనాలను వాడినట్లు గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేశారు. వాహనాల తనిఖీలు చేపట్టారు.