చండీగఢ్: పంజాబ్‌లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. పంజాబ్‌లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఒంటరవుతున్నట్లు తెలుస్తోంది. తాగాజా పంజాబ్ కాంగ్రెస్‌లో మళ్లీ సంక్షోభం తలెత్తింది. సీఎం అమరీందర్‌పై నమ్మకం పోయిందంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఎగరవేశారు. దీనిపై చర్చించడానికి నలుగురు మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు.
చదవండి: సోనియమ్మకు థాంక్స్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు బయల్దేరినట్లు సమాచారం. కాగా ఇటీవల పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన 62 మంది ఎమ్మెల్యేలు హాజరైన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి బలం తగ్గినట్టు అప్పట్లో గుసగుసలు వినిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment