ఛండిఘర్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ధరలపై ప్రభుత్వం భారీ అదనపు తగ్గింపును ప్రకటించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.5 తగ్గిస్తున్నట్లు సీఎం చరణ్‌జిత్ చన్నీ ఆదివారం ప్రకటించారు. గత 70 ఏళ్లలో చమురు ధరలు ఇంతస్థాయిలో తగ్గించడం ఎప్పుడు జరగలేదని, ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు.
చదవండి: Money Laundering Case: ఈడీ కస్టడికీ అనిల్ దేశ్‌ముఖ్
ఢిల్లీతో పోల్చుకుంటే ప్రస్తుతం పంజాబ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.9 తక్కువగా లభిస్తుందని అన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా లీటర్ పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.5 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయంతో పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు చమురు ధరలపై వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment