ఉగ్రదాడి జరిగిందిలా.. | how punjab terratist attack happend | Sakshi
Sakshi News home page

ఉగ్రదాడి జరిగిందిలా..

Published Mon, Jul 27 2015 10:14 AM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM

ఉగ్రదాడి జరిగిందిలా..

ఉగ్రదాడి జరిగిందిలా..

గుర్దాస్పూర్: పాకిస్థాన్ సరిహద్దుకు అతి సమీపంలోని గుర్ దాస్ పూర్ జిల్లా దీనానగర్  పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు దాడిచేశారు. సైనిక దుస్తులు ధరించి, అత్యాధునిక ఆయుధాలతో.. సెంట్రీలను కాల్చేసి స్టేషన్ లోకి చొరబడ్డ ముష్కరులు అక్కడ భీభత్సం సృష్టించారు. ఆ తరువాత ఓ భవనంలోకి ప్రవేశించి లోపలి నుంచి కాల్పులు జరుపుతున్నారు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులతో పోరుకు బీఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనకు సంబంధించిన మరికొన్ని ముఖ్యాంశాలు.

  • పాకిస్థాన్లోని నరోవల్ నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్ ద్వారా భారత్ లోకి ప్రవేశించారు.
  • జమ్ములోని హరినగర్ నుంచి ఆదివారం అర్ధరాత్రి తరువాత పంజాబ్ కు చేరుకున్నారు.
  • సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో పఠాన్కోట్ మీదుగా గుర్దాస్పూర్- జమ్ము హైవేపై వద్దకు చేరుకుని ఓ మారుతీ కారును హైజాక్ చేశారు. అప్పటికే వారు సైనిక దుస్తులు ధరించారు.
  • అదే మార్గంలో జమ్ము వైపు వెళుతోన్న బస్సుపై  కాల్పులు జరపగా ఓ ప్రయాణికుడు మరణించాడు.
  • అక్కడి నుంచి హైజాక్ చేసిన కారులో నేరుగా దీనానగర్ పోలీస్ స్టేషన్ వైపునకు బయలుదేరారు.
  • దీనానగర్ లోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారు.
  • ఉదయం 5:45 గంటలకు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న ముష్కరులు సెంట్రీలపై కాల్చిచంపారు.
  • స్టేషన్ లో భీభత్సం సృష్టించిన తర్వాత పక్కనే ఉన్న ప్రభుత్వ హెల్త్ సెంటర్ లోకి ప్రవేశించారు.
  • లోపలి నుంచి ప్రతి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కాల్పులు జరిపారు.
  • సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ, ఎన్ఎస్జీ బలగాలు రంగంలోకి దిగి దీనానగర్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను  చూట్టుముట్టాయి.
  • ఈలోపే దీనానగర్- పఠాన్ కోట్ మధ్య రైల్వేట్రాక్ పై పేలడానికి సిద్ధంగా ఉన్న ఐదు బాంబులను పోలీసులు గుర్తించారు.
  • ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా దీనానగర్ లోని స్కూళ్లు, కాలేజీలు ఇతర కార్యాలయాలన్నీ మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీఅయ్యాయి.
  • దాదాపు 10 గంటల సమయంలో ఉగ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్ ప్రారంభం.
  • కౌంటర్ ఆపరేషన్ లో ఆర్మీ హెలికాప్టర్ ను కూడా ఉపయోగిస్తున్నారు.
  • ఉగ్రదాడిపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇటు పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ తోనూ ఫోన్ లో మాట్లాడుతున్నారు.
  • ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు, ముగ్గురు పౌరులు చనిపోయారు.
  • కౌంటర్ ఆపరేషన్ లో ఓ ఉగ్రవాది హతం.
  • దీంతో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. భద్రతా బలగాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి
  • ఈ కాల్పుల్లో గుర్ దాస్ పూర్ జిల్లా ఎస్సీ బల్జీత్ సింగ్ మరణించారు.
  • ఇప్పటివరకు  ఈ ఘటనలో 13 మంది చనిపోయారు.

 





Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement