న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ సోమవారమిక్కడ ప్రారంభమైంది. 18 అసెంబ్లీ స్థానాలకు లెక్కింపు జరుగుతోంది. బీహార్లో 10, పంజాబ్లో 2, మధ్యప్రదేశ్లో 3, కర్ణాటకలో 3 స్థానాలకు గతవారం ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో విజయంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.
ఇక కర్ణాటకలోని శికారిపుర, బళ్లారి రూరల్, చిక్కొడి-సదలగ నియోజక వర్గాలకు ఈ నెల 21న ఉపఎన్నికలు జరిగిన వైనం విదితమే. శికారిపుర నియోజకవర్గం ఓట్ల లెక్కింపును శివమొగ్గలోని సహ్యాద్రి కళాశాలలో చేపట్టారు. చిక్కొడి - సదలన నియోజకవర్గం ఓట్ల లెక్కింపును చిక్కొడి లోని ఆర్.డి.కళాశాలలో, బళ్లారి గ్రామీణ నియోజకవర్గం ఓట్లను బళ్లారిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్నారు.
4 రాష్ట్రాల్లో ఉప ఎన్నికల కౌంటింగ్
Published Mon, Aug 25 2014 9:27 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM
Advertisement
Advertisement