byelection results
-
కుటుంబ రాజకీయాలకు చెక్..!
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్టంలోని మూడు విధానసభ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించింది. బీజేపీ, జేడీఎస్ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి ఘోర పరాజయం ఎదురైంది. అయితే ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే కుటుంబ రాజకీయాలకు కన్నడిగులు చెక్ పెట్టినట్లు అర్థం అవుతోంది. చెన్నపట్టణ, శిగ్గావి నియోజకవర్గాల్లో కుటుంబ రాజకీయాల నుంచి వచ్చిన అభ్యర్థులను ఓటర్లు తిరస్కరించారు. ఒక్క సండూరులో మాత్రమే ఈ.తుకారాం సతీమణి అన్నపూర్ణకు గెలుపు వరించింది. బీజేపీ అభ్యర్థి బంగార హనుమంతప్పపై ఈమె గెలిచారు. చెన్నపట్టణలో కేంద్ర మంత్రి, జేడీ(ఎస్)చీఫ్ హెచ్డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి, శిగ్గావిలో మాజీ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కుమారుడు భరత్ బొమ్మై ఓటమి పాలయ్యారు. హెచ్డీ కుమారస్వామి, డీసీఎం డీకే శివకుమార్‌ల ప్రతిష్టాత్మక పోటీగా నిలిచిన చెన్నపట్టణ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన నిఖిల్ కుమారస్వామి ఓడిపోవడం ద్వారా ప్రత్యక్ష ఎన్నికల్లో హ్యాట్రిక్ ఓటమిని సాధించినట్లు అయింది. ఇక్కడ బీజేపీ నుంచి ఎన్నికల ముందు టికెట్ దక్కక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సీనియర్ నేత సీపీ యోగేశ్వర విజయం సాధించారు. జేడీఎస్ పార్టీ కంచుకోట అయిన రామనగర జిల్లా నాలుగు నియోజకవర్గాల్లో ఒకటైన చెన్నపట్టణను కోల్పోవడం ఎన్డీఏను తీవ్రంగా నిరాశ పరిచింది. 2023 విధానసభ ఎన్నికల్లోనూ రామనగర నుంచి పోటీ చేసిన నిఖిల్ ఓడిపోయారు. అలాగే 2019 లోకసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి, సీనియర్ నటి సుమలతా అంబరీశ్ చేతిలో కూడా నిఖిల్ పరాజయం పొందారు. తాజాగా చెన్నపట్టణలో కూడా ఓటమి పలకరించింది. హేమాహేమీలు ఇక్కడ నిఖిల్ తరపున ప్రచారం చేపట్టారు. అయినప్పటికీ సత్ఫలితాన్ని పొందలేకపోయారు.భరత్ బొమ్మైకు నిరాశేఅయితే శిగ్గావిలో తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకున్న మాజీ సీఎం బసవరాజు బొమ్మై కుమారుడు, బీజేపీ అభ్యర్థి భరత్ బొమ్మైకు నిరాశే ఎదురైంది. ఎన్నికల తొలినాళ్లలో తన కుమారుడికి టికెట్ వద్దని చెప్పిన బసవరాజు బొమ్మై ఆ తర్వాత చివరి నిమిషంలో మనసు మా ర్చుకుని టికెట్ ఇప్పించుకున్నారు. ఆలస్యంగా బరిలో దిగడం, ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో ఎక్కువమంది ఓటర్లను చేరుకోలేకపోయా రు. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం భరత్‌కు కష్టంగా మారింది. భరత్ ఓటమికి ఇది కూడా ఒక కారణమే. కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్‌ఖాన్ 13వేల ఓట్ల మెజారిటీతో భరత్‌పై గెలిచారు. -
నేడే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు
ముంబై/రాంచీ: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో హో రాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమరంలో విజేతలెవరో నేడు తేలిపోనుంది. రెండు రాష్ట్రాల్లో శనివారం ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. అలాగే 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగిన 46 అసెంబ్లీ స్థానా ల్లోనూ ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. సాక్షి.కామ్ ఈ ప్రజా తీర్పును.. ఎప్పటికప్పటి ఫలితాలను మీకు ప్రత్యేకంగా అందించబోతోంది.నాందేడ్ లోక్‌సభ స్థానంతోపాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్‌లో లోక్‌సభ స్థానానికి సైతం ఉప ఎన్నిక నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ పడిన రాహుల్ సోదరి ప్రియాంకాగాంధీ వాద్రా భవితవ్యం మరికొన్ని గంటల్లో తేటతెల్లం కానుంది. మహారాష్ట్ర, జార్ఖండ్‌తోపాటు ఉప ఎన్నికలు జరిగిన అసెంబ్లీ స్థానాలు, నాందేడ్, వయనాడ్ లోక్‌సభ స్థానాల్లో శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. మహారాష్ట్రలో మొత్తం 288 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలుండగా, 4,136 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మరోసారి మహాయుతి ప్రభుత్వమే ఏర్పాటయ్యే అవకాశం ఉందని సర్వేలు అంచనా వేసిన సంగతి తెలిసిందే. జార్ఖండ్‌లో 1,211 మంది పోటీ మొత్తం 81 శాసనసభ స్థానాలున్న జార్ఖండ్‌లో ఈసారి 1,211 మంది పోటీ చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మధ్య అసలైన పోటీ నెలకొంది. జార్ఖండ్‌లో మరోసారి అధికారంలోకి వస్తామని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేస్తుండగా, విజయం తమదేనని ఎన్డీయే నేతలు తేల్చిచెబుతున్నారు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్డీయేవైపే మొగ్గుచూపాయి. మహారాష్ట్రలో ఎంవీఏ ముందు జాగ్రత్త మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించిన తమ అభ్యర్థులందరినీ వెంటనే ముంబైలో శిబిరానికి తరలించాలని మహా వికాస్ అఘాడీ నిర్ణయించింది. తమ ఎమ్మెల్యేలపై బీజేపీ కూటమి వల విసిరే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా వారిని శిబిరానికి తరలించాలని నిర్ణయించినట్లు శివసేన(యూబీటీ) అగ్రనేత సంజయ్ రౌత్ శుక్రవారం వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి కనీసం 160 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. గెలిచే అవకాశం ఉన్న స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటికే తమకు మద్దతు ప్రకటించారని తెలిపారు. -
హిమాచల్‌లో సుఖు సర్కార్ సేఫ్!
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ అస్థిరతకు తాత్కాలికంగా తెరపడింది. ముఖ్యమంత్రి సుఖి్వందర్ సింగ్ సుఖు ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కే.ఎల్.ఠాకూర్, హోషియార్ సింగ్, ఆశిష్ శర్మలు మార్చి 22న రాజీనామా చేయగా, స్పీకర్ కుల్దీప్సింగ్ పథానియా సోమవారం వాటిని ఆమోదించారు. తొలుత కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన ఈ ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు.. ఫిబ్రవరిలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారు. బీజేపీ అభ్యర్థి హర్‡్ష మహజన్ గెలుపునకు దోహదపడ్డారు. మెజారిటీ ఉండి కూడా కాంగ్రెస్ తమ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్విని గెలిపించుకోలేకపోయింది. అప్పటి నుంచి బీజేపీ హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పావులు కదుపుతోంది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడగా.. వారు బీజేపీలో చేరి ఆ పార్టీ గుర్తుపై ఉప ఎన్నికల్లో పోటీచేశారు. మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. హిమాచల్ అసెంబ్లీ బలం 68 కాగా... తొమ్మిది మంది పోను ప్రస్తుతం 59గా ఉంది. కాంగ్రెస్‌కు 34 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి 25 మంది సభ్యులున్నారు. మంగళవారం వెలువడే ఉప ఎన్నికల ఫలితాల్లో ఆరింటికి ఆరు స్థానాలు బీజేపీ నెగ్గినా వారి బలం 31 మాత్రమే అవుతుంది. ఈ పరిస్థితుల్లో గనక ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల బలం కూడా తోడైతే బీజేపి 34కు చేరుకునే అవకాశాలుండేవి. అలా కాకుండా సరిగ్గా ఫలితాలకు ముందు రోజు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడంతో మళ్లీ ఉప ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేదాకా సుఖు ప్రభుత్వం కొంతకాలం ఊపిరిపీల్చుకున్నట్లే. అదీ మళ్లీ తాజాగా ఫిరాయింపులేవీ జరగకుండా ఉంటే! -
ఉప పోరులో మిశ్రమ ఫలితాలు
లక్నో/అగర్తలా: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5న జరిగిన ఉప ఎన్నికలో మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. అధికార బీజేపీ మూడు, ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు నాలుగు సీట్లు గెలుచుకున్నాయి. ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, త్రిపురలోని ధన్పూర్ సీట్లను బీజేపీ నిలబెట్టుకోవడంతోపాటు త్రిపురలోని బొక్సానగర్ స్థానాన్ని సీపీఐ నుంచి కైవసం చేసుకుంది. బెంగాల్‌లోని ధుప్‌గురిలో జరిగిన ముక్కోణపు పోటీలో టీఎంసీ అభ్యర్థి గెలిచారు. ఇక్కడ ఇండియా కూటమి అభ్యర్థి కూడా బరిలో ఉన్నప్పటికీ, బీజేపీ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చారు. ఇక కేరళలోని పుత్తుప్పల్లి సీటును ప్రతిపక్ష కాంగ్రెస్–యూడీఎఫ్ కూటమికి చెందిన చాందీ ఊమెన్ గెలిచారు. కాంగ్రెస్‌కు చెందిన దిగ్గజ నేత ఊమెన్ చాందీ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఊమెన్ చాందీ కొడుకే చాందీ ఊమెన్. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఇండియా కూటమిలోనివే అయినప్పటికీ ఇక్కడ పరస్పరం తలపడటం గమనార్హం. ఇండియా కూటమిలోని జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) జార్ఖండ్‌లోని దుమ్రి సీటును నిలబెట్టుకుంది. యూపీలోని ఘోసి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఇండియా కూటమి బలపరిచిన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి బీజేపీకి చెందిన సమీప ప్రత్యర్థిపై గెలిచారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ ఉమ్మడి పోరు బనశంకరి: వచ్చే లోక్‌సభ ఎన్నికలను బీజేపీ, జేడీఎస్ పారీ్టలు ఉమ్మడిగా ఎదుర్కోనున్నాయని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ప్రకటించారు. ఢిల్లీలో జేడీఎస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చలు జరిపారన్నారు. యడియూరప్ప శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. అయిదు వరకు ఎంపీ స్థానాలను జేడీఎస్‌కు కేటాయించడానికి అమిత్ షా సమ్మతించారని తెలిపారు. -
ఉప ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్‌కు ఊరట
న్యూఢిల్లీ: ఉప ఎన్నికల ఫలితాలు గురువారం కాంగ్రెస్‌కు కాస్త ఊరటనిచ్చాయి. మహారాష్ట్ర, బెంగాల్‌లలో అధికార బీజేపీ, టీఎంసీల సిట్టింగ్ స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్..తమిళనాడులో సిట్టింగ్ సీటును నిలబెట్టుకుంది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీలోని సాగర్దిఘి స్థానంలో అధికార టీఎంసీ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఇక్కడ వామపక్షాల మద్దతుతో బరిలో నిలిచిన కాంగ్రెస్‌కు చెందిన బేరన్ బిశ్వాసం సుమారు 23 వేల ఓట్ల మెజారిటీతో టీఎంసీ అభ్యర్థిపై గెలుపు సాధించారు. ఇక్కడ బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. ఈ గెలుపుతో కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎమ్మెల్యేతో బెంగాల్ అసెంబ్లీలోకి అడుగుపెట్టనుంది. మహారాష్ట్రలోని కస్బాపేత్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు చెందిన రవీంద్ర దంగేకర్ కాషాయ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. బీజేపీ గత 28 ఏళ్లుగా ఈ స్థానాన్ని గెలుచుకుంటూ వస్తోంది. అయితే, ఇదే రాష్ట్రంలోని చించ్‌వాడీ నియోజకవర్గాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. తమిళనాడులోని ఈరోడ్ వెస్ట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో డీఎంకే బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఎలంగోవన్ భారీ విజయం సాధించారు. జార్ఖండ్‌లోని రామగఢ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ మద్దతుతో బరిలో నిలిచిన ఏజేఎస్‌యూ అభ్యర్థి గెలిచారు. -
Mainpuri Bypoll Result: ములాయం కోడలు డింపుల్ యాదవ్ భారీ విజయం
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు దేశంలోని 5 రాష్ట్రాల్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా గురువారం వెలువడుతున్నాయి. ఇందులో ఉత్తర ప్రదేశ్‌లోని మెయిన్ పూరి లోక్‌సభ స్థానం కూడా ఒకటి. సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ అక్టోబర్‌లో మృతి చెందడంతో మెయిన్‌పూరి లోక్‌సభకు ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడి నుంచి ఎస్పీ తరపున ములాయం కోడలు, అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ బరిలో నిలిచారు. మెయిన్‌పూరి ఉపఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్ చరిత్రను తిరగరాస్తూ భారీ విజయాన్ని అందుకున్నారు. దాదాపు మూడు లక్షల బంపర్ మెజార్టీతో మెయిన్‌పూరిని కైవసం చేసుకున్నారు. తన సమీప బీజేపీ అభ్యర్థి రఘురాజ్ షాక్వాపై 2,88,461 ఓట్ల భారీ తేడాతో విజయ కేతనం ఎగరవేశారు. మొయిన్‌పూరి విజయంపై డింపుల్ యాదవ్ స్పందించారు.. తన గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనను నమ్మినందుకు మెయిన్‌పురి ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయం నేతాజీకి (దివంగత ములాయం సింగ్ యాదవ్) అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ములాయం సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్‌కు నమ్మకస్తుడైన రఘురాజ్ సింగ్ షాక్యాను బీజేపీ రంగంలోకి దింపినా ఓటర్లు మాత్రం డింపుల్‌వైపు మొగ్గుచూపారు. ఒకానొక దశలో ఆమె వెనుకంజలో ఉన్నట్లు కనిపించినా.. మళ్లీ పుంజుకొని మెజార్టీ సాధించారు. సమాజ్‌వాదీకి కంచుకోటగా పిలిచే మొయిన్‌పూరిలో సైకిల్ పరుగులు పెట్టడంతో పార్టీ శ్రేణులు ఆనందోత్సహంలో మునిగిపోయారు. చదవండి: గుజరాత్ ఎన్నికలతో చరిత్ర సృష్టించిన ఆప్.. దేశంలో తొమ్మిదో పార్టీగా రికార్డ్ కాగా మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి ములాయం ఐదుసార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ 94వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్‌పై విజయం సాధించారు. ఇప్పుడు డింపుల్ యాదవ్ రెండు లక్షలకుపైగా మెజార్టీతో గెలుపొందడం గమనార్హం. మహారాష్ట్రలో పుట్టిపెరిగిన డింపుల్ యాదవ్.. లక్నోలో చదువుకునే టైంలో అఖిలేష్‌కు పరిచయం అయ్యారు. ఇద్దరిదీ ప్రేమవివాహం. రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. 2009 ఎన్నికల్లో తొలిసారి ఫిరోజ్‌బాద్ నుంచి పోటీ చేసి రాజ్‌బబ్బర్ చేతిలో ఓటమి పాలయ్యారు డింపుల్. ఆపై 2012లో భర్త తన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కన్నౌజ్ ఉప ఎన్నికల్లో ఆమె గెలిచారు. ఆపై రెండేళ్లకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ అక్కడి నుంచే ఎంపీగా నెగ్గారు. 2019లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి.. పదివేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సుభ్రత్ పాథక్ చేతిలో ఓటమి పాలయ్యారు ఆమె. చదవండి: Himachal Election Results: కాంగ్రెస్ ఘన విజయం.. సీఎం రాజీనామా -
7 అసెంబ్లీ స్థానాల ఫలితాలు.. నాలుగు సీట్లలో బీజేపీ విజయం
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నాలుగు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మిగిలిన వాటిల్లో మహారాష్ట్రలో శివసేన, తెలంగాణలో టీఆర్ఎస్, బిహార్‌లో రెండింటిలో ఒక స్థానాన్ని ఆర్జేడీ దక్కించుకున్నాయి. ► మునుగోడు(తెలంగాణ).. టీఆర్ఎస్ ► అంధేరీ(మహారాష్ట్ర)... శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) ► మొకామా(బిహార్).. ఆర్జేడీ ► ధామ్‌నగర్(ఒరిశా).. బీజేపీ ► గోపాల్‌గంజ్(బిహార్)... బీజేపీ ► అదమ్‌పుర్(హరియాణా).. బీజేపీ ► గోలా గోక్రానాథ్(ఉత్తర్‌ప్రదేశ్).. బిజేపీ TIME: 3:45PM ► ఆరు రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఫలితాలు తెలిపోయాయి. ఇప్పటి వరకు బీజేపీ 3 స్థానాల్లో గెలుపొందింది. ఆర్జేడీ, శివసేన ఒక్కోస్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఒక స్థానంలో బీజేపీ ముందంజలో ఉండగా.. ఒక స్థానంలో టీఆర్ఎస్ లీడ్‌లో కొనసాగుతున్నాయి. బిహార్‌లోని గోపాల్‌గంజ్, హరియాణాలోని అదమ్‌పుర్, గోలా గోక్రానాథ్‌లో బీజేపీ విజయం సాధించింది. అంధేరీలో శివసేన అభ్యర్థి రుతుజా లాట్కే విజయం సాధించారు. TIME: 1:00PM ► అంధేరి తూర్పులో శివసేనకు చెందిన రుతుజా లట్కే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. పది రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత 37,469 ఓట్లతో లీడ్‌లో ఉన్నారు. రుతుజా లట్కే విజయం దాదాపు ఖరారు కావడంతో శివసేన కార్యకర్తలు సంబరాలు మొదలెట్టారు. ►బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. 22వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి 607 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►యూపీలోని గోల గోకరనాథ్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో 29 రౌండ్లు పూర్తయ్యాయి. బీజేపీ దాదాపు 33,000 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ► మునుగోడు కౌంటింగ్ ఆరో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆరో రౌండ్ ముగిసే సరికి 2,169 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. చౌటుప్పల్, సంస్థాన్ నారాయపురం ఓట్లు లెక్కింపు ముగిసింది. ►ఒడిశాలోని ధామ్‌నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీకి చెందిన సూర్యవంశీ సూరజ్ 4,392 ఓట్లతో ముందంజలో ఉన్నారు. 6వ రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 22,495 ఓట్లు పోలయ్యాయి. Odisha | Counting underway for Dhamnagar by-elections. BJP candidate Suryabanshi Suraj continues his lead on the assembly seat after five rounds of counting, with a total of 22,495 votes so far. pic.twitter.com/TNe4j2UtLC — ANI (@ANI) November 6, 2022 ► హర్యానాలోని ఆదంపూర్ అసెంబ్లీ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. 6 రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీకి చెందిన భవ్య బిష్ణోయ్ 13,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►మొకమలో 20 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి ఆర్జేడీ 16,000 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తుంది. TIME: 12:00PM ► అంధేరి తూర్పులో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ అభ్యర్థి రుతుజా తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ పూర్తయే సరికి 4,078 ఓట్లతో మెజార్టీ సాధించారు. ఇప్పటివరకు మొత్తం 29,033 ఓట్లు పోలయ్యాయి. ► ఒడిశాలోని ధమ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి సూర్యవంశీ సూరజ్ 18,181 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేడీ అభ్యర్థి అబంతి దాస్ 14,920 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ► మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. 5వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 1,631 ఓట్లతో ముందంజలో ఉంది. In Pics | Counting of votes in Andheri East bypoll elections underway Follow for live updates:https://t.co/069cEQIUP9 pic.twitter.com/XMyjNa7fu1 — Express Mumbai (@ie_mumbai) November 6, 2022 TIME: 11:00AM అంధేరి తూర్పులో ఐదో రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి రుతుజా లత్కే 2,630 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు ఆమెకు 17,278 ఓట్లు పోలయ్యాయి. ► బిహార్ మోకమలో తొమ్మిదో రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఆర్జేడీకి చెందిన నీలమ్ దేవి 35,036 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవి 24,299 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. TIME: 10:00AM బిహార్‌లోని రెండు( మోకమ, గోపాల్‌గంజ్) స్థానాల్లో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి ఆర్జేడీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►అంధేరి (తూర్పు)లో రెండు రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన రుతుజా లట్కే 7,817 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. Patna, Bihar | Counting underway for Mokama By-poll, visuals from counting center Counting started at 8 am & is happening peacefully. 3-tier security deployed. No complaint so far, patrolling is being done in nearby areas: Manavjeet Singh Dhillon, SSP pic.twitter.com/9WtVmW3qfh — ANI (@ANI) November 6, 2022 ► ఒడిశాలోని ధామ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీకి చెందిన సూర్యవంశీ సూరజ్ 4,749 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. బిజూ జనతాదళ్ పార్టీకి చెందిన అభ్యర్థి అబంతి దాస్‌కు 3,980 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. Haryana | Counting of #AdampurByElection underway. Outside visuals from counting center 3-layer security provided as EVMs have reached. CAPF & district police deployed. Law & order company with anti-riot equipment present in case of any eventuality. Checking is being done: SSP pic.twitter.com/KeJJYj7TNI — ANI (@ANI) November 6, 2022 ► యూపీలోని గోల గోకరానాథ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అమన్ గిరి నాలుగో రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి 15,866 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన వినయ్ తివారీ 10,853 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ►మునుగోడులో బీజేపీ ఆధిక్యంలో ఉంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ 1,100 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతుంది. సాక్షి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరుగుతోంది. మహారాష్ట్రలోని అంధేరి(తూర్పు), బిహార్‌లోని మొకామా, గోపాల్‌గంజ్, హరియాణాలోని ఆదంపూర్, యూపీలోని గోలా గోరఖ్‌నాథ్‌లో, ఒడిశాలోని ధామ్నగర్తోపాటు తెలంగాణలోని మునుగోడు ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ పోరులో ప్రధానంగా బీజేపీకి, ప్రాంతీయ పార్టీలకు మధ్యే పోటీ నడుస్తోంది. మధ్యాహ్నం వరకు ఫలితాలు తేలనున్నాయి. కాగా ఈ ఏడు నియోజవర్గాలకు ఈ నెల 3న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలు జరిగిన స్థానాలు (7) ►మహారాష్ట్ర-తూర్పు అంధేరి ►బిహార్-మోకమ ►బిహార్- గోపాల్‌గంజ్ ►హరియాణ-అదంపూర్ ►తెలంగాణ-మునుగోడు ►ఉత్తర్‌ప్రదేశ్- గోల గోకరన్నాథ్ ►ఒడిశా- ధామ్‌నగర్ హరియాణలో మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారడంతో ఆదంపూర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. శివసేన ఎమ్మెల్యే రమేష్ లత్కే అకాల మరణంతో అంధేరీ ఈస్ట్‌లో ఎన్నికలు వచ్చాయి. బిహార్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో మొకమ స్థానం ఖాళీ అయింది. బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో కూడా సిట్టింగ్ బిజెపి ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మరణం కారణంగా పోటీ అనివార్యమైంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆగస్టు 2న రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నిక జరిగింది. యూపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే అరవింద్ గిరి మృతి చెందడంతో లఖింపూర్ ఖేరీ జిల్లా గోల గోకరనాథ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మ్మెల్యే బిష్ణు చరణ్ దాస్ అకాల మరణంతో ధామ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. చదవండి: Munugode Bypoll 2022: మునుగోడు ఉపఎన్నిక రౌండ్ల వారీగా ఫలితాలు -
ఎస్పీ, ఆప్‌కు ఎదురుదెబ్బ! ఆజంఖాన్ అడ్డాలో వికసించిన కమలం..
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలు బద్ధలయ్యాయి. ఆజంఖాన్ అడ్డాలో కమలం వికసించింది. దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి షాక్ ఇచ్చింది. ఎస్పీ సిట్టింగ్ స్థానమైన రాంపూర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఘన్ శ్యామ్ లోధి జయకేతనం ఎగురవేశారు. 42 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ ఎమ్మెల్యేగా గెలుపొంది.. తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో రాంపూర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. రాంపూర్ లోక్‌సభ స్థానం ఇప్పటివరకు ఆజంఖాన్ కంచుకోటగా ఉంది. ఇక ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ రాజీనామాతో ఖాళీ అయిన ఆజంగఢ్ లోక్‌సభ స్థానంలోనూ కమలం వికసించింది. బీజేపీ అభ్యర్థి దినేశ్ లాల్ యాదవ్ 8,679 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆప్‌కు ఎదురుదెబ్బ పంజాబ్‌లో అధికార ఆప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సంగ్రూర్ లోక్‌సభ స్థానంలో శిరోమణి అకాలీదళ్ నేత సిమ్రన్ జీత్ మాన్ విజయం సాధించారు. భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని రాజిందర్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంది. ఆప్ నేత దినేశ్ పాఠక్ 55 శాతానికి పైగా ఓట్లు దక్కించుకుని విజయఢంకా మోగించారు. కాగా.. రాజ్యసభ ఎంపీగా గెలుపొందిన రాఘవ్ చద్దా.. రాజిందర్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉపఎన్నికలు జరిగాయి. చదవండి👉పంజాబ్‌లో ఆప్‌కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు! నాలుగింటిలో మూడు బీజేపీవే ఈశాన్య రాష్ట్రం త్రిపురలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో మూడు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. టౌన్ బార్డోవాలీ స్థానం నుంచి పోటీ చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానమైన అగర్తలాలో కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మాన్ గెలుపొందారు. ► ఝార్ఖండ్‌లోని మందార్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి శిల్పి నేహా టిర్కీ గెలుపొందారు. ► ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. చదవండి👉మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో కీలక మలుపు మోదీ, యోగి కృతజ్ఞతలు తాజా ఫలితాలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ.. బీజేపీకు ఓటేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆజంగఢ్, రాంపుర్ ఫలితాలు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. The by-poll wins in Azamgarh and Rampur are historic. It indicates wide-scale acceptance and support for the double engine Governments at the Centre and in UP. Grateful to the people for their support. I appreciate the efforts of our Party Karyakartas. @BJP4UP — Narendra Modi (@narendramodi) June 26, 2022 ఎస్పీకి కంచుకోటలైన రాంపూర్, ఆజంగఢ్‌లో కాషాయ జెండా రెపరెపలాడటంతో పార్టీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభినందనలు తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్‌పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఈ ఫలితాలు రుజువు చేశాయన్నారు. -
బై ఎలక్షన్లలో బీజేపీకి షాక్
కోల్‌కతా/కొల్హాపూర్: దేశవ్యాప్తంగా శనివారం వెల్లడైన ఒక లోక్‌సభ, 4 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాకిచ్చాయి. అన్ని చోట్లా పార్టీ ఓటమి చవిచూసింది. పశ్చిమబెంగాల్లో అసన్సోల్ లోక్‌సభ, బాలీగుంగే అసెంబ్లీ సీట్లను అధికార తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అసన్సోల్లో టీఎంసీ అభ్యర్థి, ప్రముఖ సినీనటుడు ‘షాట్‌గన్’ శత్రుఘ్న సిన్హా బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్‌పై ఏకంగా 3,03,209 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. బీజేపీ నుంచి ఇటీవలే తృణమూల్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో బాలీగుంగేలో 20,228 ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీజేపీ కేవలం 13,220 ఓట్లతో సరిపెట్టుకుంది.మహారాష్ట్రలో కొల్హాపూర్ నార్త్, చత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్ అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్, బిహార్‌లో బొచాహన్ అసెంబ్లీ స్థానాన్ని ఆర్జేడీ దక్కించుకున్నాయి. -
Shatrughan Sinha: బీహారీ బాబు.. చారిత్రక విజయం
అలనాటి బాలీవుడ్ నటుడు, రాజకీయ నేత శత్రుఘ్న సిన్హా .. భారీ విజయం అందుకున్నారు. పశ్చిమ బెంగాల్ అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా 2 లక్షలకు పైచిలుకు ఓట్లతో ఆయన ఘన విజయం సాధించినట్లు సమాచారం. విశేషం ఏంటంటే.. అసన్సోల్ లోక్‌సభ స్థానాన్ని టీఎంసీ దక్కించుకోవడం ఇదే తొలిసారి. ► పాట్నాలో పుట్టి, పెరిగి.. రాజకీయాల్లో బీహారీ బాబుగా పేరు ముద్రపడ్డ 76 ఏళ్ల సిన్హా.. రాజకీయ జీవితం కూడా సంచలనమే!. ► అలనాటి బాలీవుడ్ హీరో శత్రుఘ్న సిన్హా.. 80వ దశకంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ► వాజ్‌పేయి-అద్వానీల కాలంలో.. స్టార్ క్యాంపెయినర్‌గా బీజేపీకి ఆయన ప్రచారం చేశారు. ► ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. పాట్నా సాహిబ్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. వాజ్‌పేయి కేబినెట్లో శత్రుఘ్న సిన్హా కేంద్ర మంత్రిగానూ పని చేశారు. ► అయితే పార్టీతో విభేధాలతో ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. ► 2019 సార్వత్రిక ఎన్నికల్లో.. పాట్నా సాహిబ్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి.. రవి శంకర్ ప్రసాద్ చేతిలో ఓడిపోయారు. ► అభిమానులు ముద్దుగా షాట్‌గన్ అని పిలుచుకునే శతృఘ్నసిన్హాకు.. రాజకీయాల్లోనూ రెబల్ స్టార్‌గా గుర్తింపు ఉంది. బీజేపీ ఎంపీగా ఉన్న రోజుల్లోనే ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించిన సందర్భాలు ఎన్నో. ► ఎంపీగా ఉన్న.. బాబుల్ సుప్రియో బీజేపీని వీడి టీఎంసీలో చేరడంతో అసన్సోల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ► ఎన్నికల ప్రచారంలో బీజేపీ.. టీఎంసీ అభ్యర్థి శతృఘ్నసిన్హాను బయటి వ్యక్తిగా ప్రచారం చేసింది. అయితే బెంగాలీలకు ఏమాత్రం వ్యక్తిని తాను అని గట్టిగానే ప్రచారం చేసుకున్నారాయన. ► అసన్సోల్ బరిలో బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్‌ను చిత్తుగా ఓడించారు శతృఘ్నసిన్హా. ► శత్రుఘ్న సిన్హాపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. అలాగే తనదైన శైలిలో గాంభీర్యమైన ప్రసంగాలతో జనాలను ఆకట్టుకోగలిగారు శత్రుఘ్న సిన్హా. :::సాక్షి వెబ్‌డెస్క్ -
మ్యాగజైన్ స్టోరీ 02 november 2021
-
కేసీఆర్ కు హుజురాబాద్ ప్రజలు బుద్ధి చెప్పారు
-
మరో 30 ఏళ్ళు ఏపీకి సీఎంగా జగనే ఉంటారు
-
హుజూరా‘బాద్’షా ఈటలే...
-
Bypolls 2021 Results: జాతీయ స్థాయిలో కమలానికి షాక్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మూడు లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి భంగపాటుకు గురైంది. పేలవమైన ప్రదర్శనతో కేవలం ఏడు స్థానాలతో సరిపెట్టుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత, దివంగత వీరభద్రసింగ్ సింగ్ సతీమణి ప్రతిభాసింగ్ మండీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. మండీ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. గత ఎన్నికల్లో మండీలో దాదాపు 4,05,000 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రామ్ స్వరూప్ శర్మ విజయం సాధించారు. ప్రతిష్టాత్మకమైన ఈ స్థానాన్ని ఈసారి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ప్రతిభాసింగ్.. కార్గిల్ యుద్ధవీరుడు, బీజేపీ అభ్యర్థి, బ్రిగేడియర్ ఖుషాల్ ఠాకూర్‌ను ఓడించారు. 7,490 ఓట్ల మెజారిటీతో ప్రతిభాసింగ్ విజయం సాధించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సొంత జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గంలో గెలిచి కాంగ్రెస్ తన సత్తా చాటింది. దాద్రానగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతం, మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా లోక్‌సభ స్థానాలకూ ఉప ఎన్నికలు జరిగాయి. దాద్రానగర్ హవేలీలో బీజేపీ అభ్యర్థి మహేష్ గవిట్‌పై శివసేన మహిళా అభ్యర్థి కలాబెన్ దేల్కర్ విజయం సాధించారు. గతంలో గెలిచిన ఖండ్వా లోక్‌సభ స్థానాన్ని బీజేపీ కాపాడుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌నారాయణ్ సింగ్ పూర్ణీపై బీజేపీ అభ్యర్థి జ్ఞానేశ్వర్ పాటిల్ విజయం సాధించారు. ఈయన 82వేల మెజారిటీతో గెలిచారు. ఇక హిమాచల్‌లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. హిమాచల్‌లో ఉప ఎన్నికలు జరిగిన ఫతేపూర్, అర్కీల్లో గతంలోనూ కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. ఈసారీ కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. గతంలో బీజేపీ ఖాతాలో ఉన్న జబ్బల్–కోత్ఖాయ్ స్థానం కాంగ్రెస్ ఖాతాలో పడింది. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. బీజేపీ మహిళా అభ్యర్థి నీలం సెరాయిక్‌కు కేవలం 2,644 ఓట్లు పడ్డాయి. వచ్చే ఏడాది డిసెంబర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీకి తాజా ఫలితాలు శరాఘాతంలా తగిలాయి. పశ్చిమ బెంగాల్లో దీదీ హవా పశ్చిమ బెంగాల్లో దిన్హటా, గోసాబా, శాంతిపూర్, ఖర్దాహ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగింటినీ అధికార తృణమూల్ కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది. 294 స్థానాలున్న అసెంబ్లీలో తమ సీట్ల సంఖ్యను 215కు పెంచుకుంది. ఈ నాలుగు స్థానాల్లో కలిపి మొత్తంగా తృణమూల్‌కు 75.02 శాతం ఓట్లు పడగా బీజేపీకి కేవలం 14.48 శాతం ఓట్లు పడ్డాయి. ఈ ఏడాది మార్చి–ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 38.13 శాతం ఓట్లు సాధించిన బీజేపీ.. ఇప్పుడు 15 శాతంలోపునకు పడిపోవడం గమనార్హం. దిన్హటాలో బీజేపీ అభ్యర్థి అశోక్ మండల్‌పై టీఎంసీ అభ్యర్థి ఉదయన్ గుహ ఏకంగా 1,64,089 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గోసాబాలో టీఎంసీ అభ్యర్థి సుబ్రతా మొండల్ బీజేపీ అభ్యర్థిపై దాదాపు లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలిచారు. దిన్హటా, గోసాబా, ఖర్దాహ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. బీజేపీ విద్వేష రాజకీయాలను ప్రజలు ఉమ్మడిగా ఎలా ఓడిస్తారో ఈ ఫలితాలు చూస్తే తెలుస్తుందని రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో చెరొకటి కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో స్థానంలో గెలిచాయి. సిండ్గీ స్థానం నుంచి బరిలో నిల్చిన కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ మనగులిని బీజేపీ అభ్యర్థి రమేశ్ భూషనూర్ మట్టికరిపించారు. హంగల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శివరాజ్ సజ్జనార్ కంటే అధికంగా ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ మానె విజయం సాధించారు. ఈ రెండు స్థానాల్లో ముస్లిం అభ్యర్థులను జేడీ(ఎస్) బరిలో నిలిపినా వారు కనీసం డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. హింగల్లో ఓటమి.. రాష్ట్ర కొత్త సీఎం బొమ్మైకి కాస్త ఇబ్బందికరంగా మార్చింది. తన నియోజకవర్గం ఉన్న జిల్లాలోనే హంగల్ ఉంది. మధ్యప్రదేశ్‌లో రెండు ఇటు, ఒకటి అటు రాష్ట్రంలో 3 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో గతంలో కాంగ్రెస్ చేతిలో ఉన్న స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా, ఒక స్థానంలో బీజేపీ ఓడి కాంగ్రెస్‌కు అప్పజెప్పింది. ఈసారి జోబాట్(ఎస్సీ), పృథ్వీపూర్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. కాగా, గతంలో గెలిచిన రాయ్‌గావ్(ఎస్టీ)లో బీజేపీ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కల్పనా వర్మ గెలిచారు. అస్సాంలో అన్నీ బీజేపీ కూటమికే అస్సాంలో ఉప ఎన్నికలు జరిగిన మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాలను బీజేపీ కూటమి పార్టీలు తమ వశం చేసుకున్నాయి. భవానీపూర్, మరియానీ, తోరా స్థానాల్లో బీజేపీ గెలిచింది. గోసాయ్‌గావ్, తముల్పూర్లలో యూపీపీఎల్ విజయఢంకా మోగించింది. ఐదు స్థానాల్లో పోలైన మొత్తం ఓట్లలో 54 శాతం బీజేపీ, యూపీపీఎల్లకే పడ్డాయి. ► మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ నేతృత్వంలోని మేఘాలయ డెమొక్రటిక్ కూటమి మొత్తం మూడు సీట్లనూ కైవసం చేసుకుంది. రాజబాలా, మేరింగ్కెంగ్ లలో ఎన్పీపీ గెలవగా, మాఫ్లాంగ్ ఈ కూటమిలోని యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ ఖాతాలో పడింది. ► బిహార్‌లో రెండు చోట్లా జేడీ(యూ) అభ్యర్థులే విజయబావుటా ఎగరేశారు. కుషేశ్వర్ ఆస్తాన్(ఎస్సీ) స్థానం నుంచి అమన్ భూషణ్ హజారీ, తారాపూర్ నుంచి రాజీవ్ కుమార్ సింగ్‌లు గెలిచారు. ► రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్ ఒక స్థానాన్ని కాపాడుకోవడంతోపాటు మరో సీటు గెల్చుకుంది. ఈసారి ధరియావాద్, వల్లభ్నగర్ల్లో కాంగ్రెస్ గెలిచింది. ► మహారాష్ట్రలోని నాందేఢ్ జిల్లాలోని దెగ్లూ్లర్(ఎస్సీ) స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జితేశ్ రావ్‌సాహెబ్ గెలిచారు. ► హరియాణా రాష్ట్రంలోని ఎల్లెనాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిపై ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ అభ్యర్థి అభయ్ సింగ్ చౌతాలా విజయం సాధించారు. ► మిజోరంలో తురియల్ స్థానంలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) అభ్యర్థి లాల్దాంగ్లియానా గెలిచారు. ► ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు(ఎస్సీ) నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాసరి సుధ 90,533 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి పి.సురేశ్ ఓటమిని చవిచూశారు. ► తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 23,855 ఓట్ల మెజారిటీతో గెలిచారు. -
హుజురాబాద్ ఫలితాలు: ఈవీఎం మొరాయిస్తే వీవీప్యాటే కీలకం
సాక్షి, కరీంనగర్: ఓట్లు లెక్కించే సమయంలో ఈవీఎంల సమస్య ఉంటే వీవీప్యాట్లే కీలకం కానున్నాయి. ఎన్నికల సంఘం 2014 తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో వీవీప్యాట్లను అందుబాటులోకి తెచ్చింది. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడ అభ్యర్థుల ఫొటో, గుర్తులు ఉన్న ఈవీఎంను ఉపయోగించి ఓటు హక్కు వినియోగించుకుంటారు. గతంలో ఒకరికి ఓటు వేస్తే మరొకరికి నమోదవుతుందన్న అపోహ ఓటర్లతో పాటు నేతల్లో ఉండేది. ఓటర్ల సందేహాలకు తెరదించేందుకు ఎన్నికల సంఘం ఈవీఎంలతో వీవీప్యాట్లను అనుసంధానం చేసింది. వీవీప్యాట్లకు అమర్చి ఉన్న పెట్టెల్లో ఓటరు వేసిన ఓట్లకు సంబంధించిన చీటీలు పడే ఏర్పాటు చేశారు. ఏ గుర్తుకు ఓటు వేశారో వీవీప్యాట్ అద్దంపై 7 సెకన్ల పాటు కనిపించడంతో ఓటరు సంతృప్తి చెందుతాడు.ఈవీఎంల నుంచి ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో పాటు ఇతర సమస్యలు ఎదురైతే ఈ చీటీలను లెక్కించి ఫలితాన్ని ప్రకటించే వెసులుబాటు ఉంది. నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రాన్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేసుకొని ఈవీఎం ద్వారా లెక్కించిన తరువాత వీవీప్యాట్‌లోని చీటీలను కూడా లెక్కించి ఫలితాన్ని సరిచూసుకోవాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: అవును.. ఆ ఊళ్లో 95.11 శాతం పోలింగ్ ఈవీఎంలు మొరాయించినా.. ఒక్కో ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల వివరాలు సాధారణంగా లెక్కించేందుకు గరిష్టంగా రెండు నిమిషాల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఈవీఎంలు మొరాయిస్తే ఆగ్జిలరీ యూనిట్ ద్వారా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరెవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలుసుకునే అవకాశం ఉంది. ఈ విధానం కూడా సాధ్యం కాకపోతే వీవీప్యాట్ చీటీలను లెక్కించేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఎక్కడైనా మెజార్జీ స్వల్పంగా ఉన్నప్పుడు వీవీప్యాట్ చీటీలను లెక్కించాలని అభ్యర్థులు పట్టుపడితే ఈ విషయాన్ని స్థానిక అధికారులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితో తదుపరి చర్యలు తీసుకుంటారు. వీవీప్యాట్ల్లను అమర్చడం వల్ల పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపులో కూడా ఎలాంటి అనుమానాలకు తావుండదు. చదవండి: Huzurabad By Election Results 2021: హుజూరాబాద్ తీర్పు నేడే ఎలాంటి పొరపాట్లు తలెత్తకూడదు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో ఎలాంటి పొరపాట్లు తలెత్తకూడదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ సూచించారు. కౌంటింగ్ ప్రక్రియపై జిల్లా ఎన్నికల అధికారులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలను భద్రంగా కౌంటింగ్ టేబుల్స్ వద్దకు తీసుకురావాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిశాక రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేయాలని తెలిపారు. కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ.. కౌంటింగ్ ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. అదనపు కలెక్టర్లు జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. -
‘ఉప’ ఫలితాలు : వారందరికీ మంత్రివర్గంలో స్థానం
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఉప ఎన్నికల్లో యడియూరప్ప ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకుంది. తాజా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయ దుందుభిని మోగించింది. 15 అసెంబ్లీ స్థానాలకు గాను 6 చోట్ల విజయం సాధించి, మరో 6 స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతుంది. దీంతో కర్ణాటకలో స్థిరమైన బీజేపీ ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. కాగా, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు సీట్లతో సరిపెట్టుకుంది. ఇక జేడీఎస్ ఖాతా కూడా తెరవలేదు. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యం ప్రదర్శించిన బీజేపీ.. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. మిగత 6 స్థానాల్లో కూడా బీజేపీ గెలుపు దాదాపు ఖరారయినట్లే. ఎన్నికల్లో గెలిచిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని సీఎం యడియూరప్ప ప్రకటించారు. కాంగ్రెస్- జేడీఎస్ కూటమికి చెందిన 17మంది తిరుగుబాటు చేయడంతో కర్ణాకటలోని కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. తర్వాత అప్పటి స్పీకర్ 17మందిపై అనర్హత వేటు వేసింది. తర్వాత బలపరీక్షలో బీజేపీ నెగ్గి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేల అనర్హతతో కర్ణాటకలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఎమ్మెల్యేల అనర్హతతో 17 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, హైకోర్టు కేసు కారణంగా రెండు చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో డిసెంబర్ 5న 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు మొత్తం 15 స్థానాల్లో, జేడీఎస్ 12 చోట్ల బరిలోకి దిగాయి. ♦ ఎమ్మెల్యేలుగా గెలిచిన 12 మంది సభ్యులకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని కర్ణాటక మంత్రి అశోక్ అన్నారు. బీజేపీ కచ్చితంగా 12 స్థానాల్లో గెలుస్తుంది. వారందరికి సీఎం యడియురప్ప సముచిత స్థానం కల్పిస్తారా ఆశాభావం వ్యక్తం చేశారు. బోణీ కొట్టిన బీజేపీ ఉప ఎన్నికల్లో బీజేపీ బోణీ కొట్టింది. యల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హెబ్బర్ శివరామ్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. తొలి విజయంతో సాధించడం పట్ల శివరాం సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా శివరాం మద్దతుదారులు సంబరాలు జరుపుకుంటున్నారు. మరో 11 నియోజకవర్గాల్లో బీజేపీ లీడ్‌లో ఉంది. ఓటమిని అంగీకరించిన డీకే ఉప ఎన్నికల ఫలితాలను కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డీకే శివకుమార్ స్వాగతించారు. ప్రజా తీర్పును గౌరవించి ఓటమిని అంగీకరిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఫిరాయింపుదారులను అంగీరించారని, అందుకే వారిని గెలిపించారని తెలిపారు. ఈ ఫలితాలతో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. సంబరాలు చేసుకుంటున్న బీజేపీ నేతలు ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక తమ ప్రభుత్వానికి ఢోకా లేదంటూ పటాసులు పేల్చుతున్నారు. కాగా, ఇప్పటికే వరుస ఓటములతో ఢీలా పడ్డ కాంగ్రెస్‌కు ఉప ఎన్నికల ఫలితాలు మరింత నిరాశను మిగిల్చేలా ఉన్నాయి. ♦ బీజేపీ అత్యధిక స్థానాల్లో లీడ్‌లో ఉండటం పట్ల సీఎం యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర హర్షం వక్తం చేశారు. తన తండ్రి, సీఎం యడియూరప్ప దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం యడియూరప్ప కుమారుడికి మిఠాయి తినిపించారు. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి 105 మంది సభ్యుల మద్దతు ఉండగా.. ఉప ఎన్నికల్లో కనీసం ఆరు స్థానాల్లో గెలుపొందినా ఆ సంఖ్య 111కి చేరుతుంది. దీంతో ఉత్కంఠ భరిత స్థితిలో ముఖ్యమంత్రి పీఠం చేజిక్కించుకున్న బీఎస్ యడియురప్ప సీటుకు వచ్చిన ఢోకా ఏం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఊరటను కలిగిస్తున్నాయి. -
కర్ణాటక ‘ఉప’ ఫలితాలు నేడే
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. ఈ నెల 5న రాష్ట్రంలో 15 సీట్లకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మైనారిటీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న యడియూరప్ప తన ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు ఎక్కువ సీట్లు సాధించాల్సి ఉంది. కనీసం 8 సీట్లలో గెలిస్తేనే బీజేపీ ప్రభుత్వం ఒడ్డున పడుతుంది. మరోవైపు అధికార బీజేపీని నిలువరించి తిరిగి అధికారంలోకి రావాలని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నంలోగా పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు దగ్గర పడే కొద్దీ బీజేపీ తరఫున పోటీ చేసిన అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలతో పాటు వివిధ పార్టీల అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కీలకంగా వ్యవహరించిన అనర్హత ఎమ్మెల్యేల భవితవ్యం కూడా నేడు తేలనుంది. బీజేపీకి పట్టం కట్టిన ఎగ్జిట్‌పోల్స్.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకి పట్టం కట్టడంతో సీఎం యడియూరప్ప ధైర్యంగా కనిపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ శాస్త్రీయమైనవి కాదంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు మొత్తం 15 స్థానాల్లో, జేడీఎస్ 12 చోట్ల బరిలో ఉన్నాయి. -
రెండు స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు కైవసం చేసుకుంది. పంజాబ్‌లో ఓ స్థానాన్ని, కర్ణాటకలో మరో స్థానంలో విజయం సాధించింది. పంజాబ్ పాటియాల స్థానాన్ని కాంగ్రెస్ తన ఖాతాలో జమ చేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రణీత్ కౌర్ 23,836 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన ఏఏపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. మరోవైపు కర్ణాటకలోని బళ్లారిలో కూడా హస్తం గెలుపొందింది. బీజేపీ అభ్యర్థి ఓబులేశుపై కాంగ్రెస్ అభ్యర్థి గోపాలకృష్ణ 25వేల ఓట్లతో గెలుపొందారు. మిగతా స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు వెలువడనున్నాయి. -
4 రాష్ట్రాల్లో ఉప ఎన్నికల కౌంటింగ్
న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ సోమవారమిక్కడ ప్రారంభమైంది. 18 అసెంబ్లీ స్థానాలకు లెక్కింపు జరుగుతోంది. బీహార్‌లో 10, పంజాబ్‌లో 2, మధ్యప్రదేశ్‌లో 3, కర్ణాటకలో 3 స్థానాలకు గతవారం ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో విజయంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇక కర్ణాటకలోని శికారిపుర, బళ్లారి రూరల్, చిక్కొడి-సదలగ నియోజక వర్గాలకు ఈ నెల 21న ఉపఎన్నికలు జరిగిన వైనం విదితమే. శికారిపుర నియోజకవర్గం ఓట్ల లెక్కింపును శివమొగ్గలోని సహ్యాద్రి కళాశాలలో చేపట్టారు. చిక్కొడి - సదలన నియోజకవర్గం ఓట్ల లెక్కింపును చిక్కొడి లోని ఆర్.డి.కళాశాలలో, బళ్లారి గ్రామీణ నియోజకవర్గం ఓట్లను బళ్లారిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్నారు.