![Outsider TMC Shatrughan Sinha Wins Asansol With Record Margin - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/16/shatrughan-sinha.jpg.webp?itok=x5-48AfI)
అలనాటి బాలీవుడ్ నటుడు, రాజకీయ నేత శత్రుఘ్న సిన్హా .. భారీ విజయం అందుకున్నారు. పశ్చిమ బెంగాల్ అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా 2 లక్షలకు పైచిలుకు ఓట్లతో ఆయన ఘన విజయం సాధించినట్లు సమాచారం. విశేషం ఏంటంటే.. అసన్సోల్ లోక్‌సభ స్థానాన్ని టీఎంసీ దక్కించుకోవడం ఇదే తొలిసారి.
► పాట్నాలో పుట్టి, పెరిగి.. రాజకీయాల్లో బీహారీ బాబుగా పేరు ముద్రపడ్డ 76 ఏళ్ల సిన్హా.. రాజకీయ జీవితం కూడా సంచలనమే!.
► అలనాటి బాలీవుడ్ హీరో శత్రుఘ్న సిన్హా.. 80వ దశకంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
► వాజ్‌పేయి-అద్వానీల కాలంలో.. స్టార్ క్యాంపెయినర్‌గా బీజేపీకి ఆయన ప్రచారం చేశారు.
► ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. పాట్నా సాహిబ్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. వాజ్‌పేయి కేబినెట్‌లో శత్రుఘ్న సిన్హా కేంద్ర మంత్రిగానూ పని చేశారు.
► అయితే పార్టీతో విభేధాలతో ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా కొనసాగారు.
► 2019 సార్వత్రిక ఎన్నికల్లో.. పాట్నా సాహిబ్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి.. రవి శంకర్ ప్రసాద్ చేతిలో ఓడిపోయారు.
► అభిమానులు ముద్దుగా షాట్‌గన్ అని పిలుచుకునే శతృఘ్నసిన్హాకు.. రాజకీయాల్లోనూ రెబల్ స్టార్‌గా గుర్తింపు ఉంది. బీజేపీ ఎంపీగా ఉన్న రోజుల్లోనే ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించిన సందర్భాలు ఎన్నో.
► ఎంపీగా ఉన్న.. బాబుల్ సుప్రియో బీజేపీని వీడి టీఎంసీలో చేరడంతో అసన్సోల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది.
► ఎన్నికల ప్రచారంలో బీజేపీ.. టీఎంసీ అభ్యర్థి శతృఘ్నసిన్హాను బయటి వ్యక్తిగా ప్రచారం చేసింది. అయితే బెంగాలీలకు ఏమాత్రం వ్యక్తిని తాను అని గట్టిగానే ప్రచారం చేసుకున్నారాయన.
► అసన్సోల్ బరిలో బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్‌ను చిత్తుగా ఓడించారు శతృఘ్నసిన్హా.
► శత్రుఘ్న సిన్హాపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. అలాగే తనదైన శైలిలో గాంభీర్యమైన ప్రసంగాలతో జనాలను ఆకట్టుకోగలిగారు శత్రుఘ్న సిన్హా.
:::సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment