Asansol
-
Lok Sabha Election 2024: మట్టిమనిషి!
జహనారా ఖాన్. పశి్చమబెంగాల్‌లోని అసన్సోల్ లోక్‌సభ స్థానంలో సీపీఎం అభ్యర్థి. బొగ్గు గని కార్మికుని కూతురు. రాజకీయాల్లో స్వశక్తితో ఎదిగిన సాదాసీదా మహిళ. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మట్టి బిడ్డ. జమూరియా అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా, ఎస్ఎస్ అహ్లువాలియా వంటి దిగ్గజాలకు గట్టిపోటీ ఇస్తున్నారు... చిన్న స్థాయి నుంచి... జహనారా తండ్రి మైనింగ్ కార్మికుడు. సీపీఎం నాయకుడు. ఆమె జమూరియాలోని రాణిగంజ్ మహిళా కాలేజీలో చదువుకున్నారు. 1990లో డిగ్రీ పూర్తి చేశారు. ఇప్పటికీ ఈసీఎల్‌లో ఒక చిన్న పాత ఇంట్లో తోబుట్టువులతో కలసి ఉంటారామె. జహనారా వృత్తి రీత్యా టీచర్. వెనకబడిన కుటుంబాల్లోని చిన్నారులు, యువత జీవితాల్లో వెలుగు నింపేందుకు పాతికేళ్ల కిందే బాల్ బోధన్ శిక్షా నికేతన్ పేరిట హిందీ మీడియం స్కూలు ప్రారంభించారు. జమురియాలోని దక్షిణ పరాసియా మైనింగ్ ప్రాంతంలో ఉందీ స్కూలు. ఇందులో చదువుకున్న వాళ్లే ఇప్పుడు టీచర్లుగా స్వచ్ఛందంగా పని చేస్తుండటం విశేషం. అనంతరం తండ్రి రాజకీయ బాటలో నడిచి తొలుత సీపీఎం యువజన సంఘంలో పని చేశారు. జమూరియా మహిళా సంఘ నాయకురాలిగా ఎదిగారు. జమూరియా పంచాయతీ ప్రధాన్‌గా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2008లో జమురియా పంచాయతీ అధ్యక్షురాలయ్యారు. తృణమూల్ హవా సాగుతున్న 2011, 2016ల్లో వరుసగా రెండుసార్లు జమురియా నుంచి ఎమ్మెల్యేగా గెలవడం ఆమెకున్న ఆదరణకు నిదర్శనం. స్థానికంగానూ అత్యంత శక్తిమంతురాలైన నాయకురాలిగా ఎదిగారు. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో జమూరియా నుంచి విద్యార్థి నాయకురాలు అయిషీ ఘోష్‌కు సీపీఎం టికెటిచి్చంది. దాంతో జహనారా పార్టీ కార్యకలాపాలపై, పాఠశాలపై దృష్టి సారించారు. తొలిసారిగా ఇప్పుడు లోక్‌సభ బరిలో దిగుతున్నారామె. కారి్మకుల కుటుంబాలు అధికంగా ఉండే అసన్సోల్లో ఆమె గెలుపు తథ్యమని సీపీఎం భావిస్తోంది. పోరాడేవారే గెలుస్తారు... నటులు, గాయకులతో ప్రజల జీవన పరిస్థితుల్లో మార్పు రాదంటారు జహనారా. కారి్మకులు, ప్రజల పక్షాన పోరాడే సీపీఎం తప్పక విజయం సాధిస్తుందని ఆమె నమ్ముతున్నారు. ‘‘రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలుతోంది. మహిళలు సురక్షితంగా లేరు. 2011 పార్క్ స్ట్రీట్ సంఘటన నుంచి, నేటి సందేశ్‌ఖాలీ వరకూ మహిళలు శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవుతున్నారు. బెంగాల్ ఆడపిల్లలను తృణమూల్ ప్రభుత్వం సరుకులుగా మార్చింది. రాష్ట్రమంతటా మహిళలపై జరుగుతున్న అణచివేతపై నిరసన, ప్రతిఘటన అగి్నజ్వాలగా మారుతోంది. సమస్యల పరిష్కారంలో తృణమూల్, బీజేపీలు విఫలమయ్యాయి’’ అని విమర్శిస్తున్నారు. పదేళ్లుగా కోల్పోయిన అసన్సోల్ ప్రాభవాన్ని తిరిగి నిలబెట్టడం తన బాధ్యత అని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
ఆసన్సోల్. పశ్చిమ బెంగాల్లో కీలక లోక్‌సభ స్థానం. గత ఉప ఎన్నికలో బీజేపీని ఓడించిన తృణమూల్ కాంగ్రెస్ ఈసారి పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయడంపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ‘షాట్‌గన్’, ‘బిహారీ బాబు’గా ప్రసిద్ధుడైన బాలీవుడ్ దిగ్గజం, సిట్టింగ్ ఎంపీ శత్రుఘ్న సిన్హా టీఎంసీ నుంచి మళ్లీ బరిలో ఉన్నారు. సీనియర్ నేత సురేంద్రజీత్‌సింగ్ అహ్లువాలియాను బీజేపీ బరిలో నిలిపింది. ఈ హాట్ సీట్లో నాలుగో విడతలో భాగంగా మే 13న పోలింగ్ జరగనుంది... ఆసన్సోల్లో టీఎంసీ, బీజేపీ హోరాహోరీ హై ప్రొఫైల్ లోక్‌సభ స్థానమైన ఆసన్సోల్లో హిందీ మాట్లాడేవారు ఎక్కువ. జార్ఖండ్ సరిహద్దు కావడమే అందుకు కారణం. ఇక్కడ పరిశ్రమలు అధికం. రాణిగంజ్, పాండవేశ్వర్, జమురియాల్లో బొగ్గు గనులున్నాయి. దాంతో బిహార్, యూపీ వలస కారి్మకులు ఎక్కువ. తాగునీటి ఎద్దడి, అక్రమ మైనింగ్ ఇక్కడి ప్రధాన సమస్యలు. ఒకప్పుడు సీపీఎం కంచుకోట. 2014లో దానికి బీటలు వారాయి. బీజేపీ నుంచి బాబుల్ సుప్రియో బరాల్ గెలుపొందారు. 2019లోనూ ఆ పరంపరను కొనసాగించారు. 2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సుప్రియో తృణమూల్‌లో చేరడంతో ఉప ఎన్నిక జరిగింది. టీఎంసీ నుంచి శత్రుఘ్న సిన్హా గెలుపొందారు. అహ్లూవాలియాపైనే బీజేపీ ఆశలు... ఈసారి బీజేపీ తమ తొలి జాబితాలోనే భోజ్‌పురి గాయకుడు పవన్ సింగ్‌కు ఆసన్సోల్ టికెటిచ్చింది. తన పాటల్లో మహిళలను అగౌరవపరిచే వ్యక్తికి టికెటిచ్చారంటూ టీఎంసీ తదితర పక్షాలు విమర్శలు గుప్పించాయి. దాంతో పవన్ స్వచ్ఛందంగా తప్పుకున్నారు. అనంతరం ‘సర్దార్జీ’గా పిలుచుకునే ఎస్.ఎస్. అహ్లువాలియాకు బీజేపీ టికెట్ దక్కింది. ఆయన రాజ్యసభ మాజీ సభ్యుడు. 2014లో డార్జిలింగ్, 2019లో బర్ధమాన్–దుర్గాపూర్ లోక్‌సభ స్థానాల నుంచి గెలుపొందారు. ఆయన కచి్చతంగా నెగ్గుతారని బీజేపీ అంటోంది. ఎంపీగా పార్లమెంటు ముఖమే చూడని వ్యక్తి ప్రజా సమస్యలను ఏం పట్టించుకుంటారన్న టీఎంసీ విమర్శలను అహ్లూవాలియా తిప్పికొడుతున్నారు. ‘‘నేను సర్దార్‌ను. ఆసన్సోల్ బిడ్డను. ఇక్కడే పుట్టి పెరిగా. నా మూలాలిక్కడే ఉన్నాయి. నా ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్షే నన్నిక్కడికి నడిపించింది’’ అంటున్నారు.భారీ మెజారిటీపై శత్రుఘ్న కన్ను శత్రుఘ్న సిన్హా పూర్వాశ్రమంలో బీజేపీ నాయకుడే కావడం విశేషం! పట్నా సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు బీజేపీ టికెట్‌పై గెలుపొందారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. 2022లో టీఎంసీకి మారారు. అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తన బలమంటున్నారాయన. ‘‘ఎంపీగా రెండేళ్లలో చేసిన కృషే నా తరఫున మాట్లాడుతుంది. పైగా ఆసన్సోల్లో యూపీ, బిహార్ కారి్మకుల సంఖ్య చాలా ఎక్కువ. ఈసారి మరింత భారీ మెజారిటీతో గెలుస్తా’’ అని ధీమాగా చెబుతున్నారు. సీపీఎం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జహనారా ఖాన్ బరిలో ఉన్నారు. లోక్‌సభకు పోటీ చేయడం ఆమెకిదే తొలిసారి. 55 ఏళ్ల జహనారాది దిగువ మధ్యతరగతి నేపథ్యం. రెండుసార్లు జమురియా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ‘‘ఆసన్సోల్ పదేళ్లుగా ప్రాభవాన్ని కోల్పోయింది. ఈ సుప్రియోలు, సిన్హాలు నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదు. గ్రామీణ గిరిజనులు, మైనారిటీలు తాగునీటి కొరతతో అల్లాడుతున్నారు. పదేళ్లలో ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ కేబుల్స్ సహా ఎన్నో కర్మాగారాలు మూతపడ్డాయి’’ అంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బరిలోకి మరో ఇద్దరు భోజ్‌పురి సెన్సేషన్లు! బీజేపీ కసరత్తు
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ ప్రకటించిన అభ్యర్థి భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ పోటీ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఆ స్థానంలో గట్టి అభ్యర్థిని నిలిపేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రస్థాయి నేతలతోపాటు ఢిల్లీ స్థాయిలోనూ అభ్యర్థి ఎంపికకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అసన్సోల్ లోక్‌సభ స్థానానికి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను రాష్ట్ర యూనిట్ సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలోని పార్టీ వర్గాలు ఇద్దరు భోజ్‌పురి సంచలనాలను అన్వేషిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా వారిలో ఒకరు బెంగాలీ అయినప్పటికీ భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందారు. బెంగాల్ బీజేపీ సూచించింది వీరినే.. బెంగాల్ బీజేపీ సూచించిన పేర్లు అగ్నిమిత్ర పాల్, జితేంద్ర తివారీ, డాక్టర్ అజయ్ పొద్దార్. వీరిలో అగ్నిమిత్ర పాల్ వైద్యురాలు, విద్యావేత్తల కుటుంబంలో జన్మించారు. కానీ ఫ్యాషన్ డిజైనింగ్‌ని ప్రవృత్తిగా ఎంచుకున్నారు. శ్రీదేవి, మిథున్ చక్రవర్తి, కేకే మీనన్ వంటి బాలీవుడ్ తారలకు ఆమె కాస్టూమ్స్ రూపొందించారు. 2019లో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక మరో సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్ర తివారీ 2020లో బీజేపీలో చేరారు. హిందీలో అనర్గళంగా మాట్లాడగల ఆయన గణనీయమైన సంఖ్యలో హిందీ మాట్లాడే ఓటర్లను ప్రభావితం చేయగలడని పార్టీ భావిస్తోంది. ఆయన గతంలో అసన్సోల్ మేయర్‌గానూ పనిచేయడం మరింత కలిసొచ్చే అంశం. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కుల్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ అజయ్ పొద్దర్ను కూడా స్థానిక పార్టీ పరిశీలిస్తోంది. మరో ఇద్దరు భోజ్‌పురి సంచలనాలు పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ స్థానానికి ఢిల్లీలోని బీజేపీ నాయకత్వం ఇద్దరు భోజ్‌పురి సంచలనాలను అన్వేషిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భోజ్‌పురి చిత్రాల బెంగాలీ స్టార్ 'మోనాలిసా'పై కాషాయ పార్టీ ప్రత్యేక ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. ఆమె అసలు పేరు అంటారా బిస్వాస్. హిందీ టెలివిజన్‌లో పేరు సంపాదించడంతో పాటు భోజ్‌పురి సినీ పరిశ్రమలోనూ సంచలనంగా మారారు. ఆమెకు బెంగాలీ, హిందీ, భోజ్‌పురి భాషల్లో కూడా ప్రావీణ్యం ఉంది. అందుకే ఆమెను అసన్సోల్ నుంచి పోటీ చేయించే అంశాన్ని బీజేపీ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మోనాలిసా బిగ్ బాస్-10లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. దక్షిణ కోల్‌కతాలోని జూలియన్ డే స్కూల్లో చదువుకున్న ఆమె కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలయ్యారు. భోజ్‌పురి పరిశ్రమలో సెన్సేషన్ అయిన మోనాలిసా భోజ్‌పురి స్టార్‌నే వివాహం చేసుకున్నారు. ఇక పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరైన మరో భోజ్‌పురి సంచలనం అక్షరా సింగ్‌ను రంగంలోకి దించే అవకాశాలను కూడా బీజేపీ పరిశీలిస్తోందన్న ఊహాగానాలు ఉన్నాయి. 'మోనాలిసా' కంటే పెద్ద స్టార్ అయినప్పటికీ అక్షరా సింగ్ విషయంలో కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ఈమెకు బెంగాలీ నేపథ్యం లేకపోవడం, పవన్ సింగ్‌తో గత అనుబంధం. బీజేపీ అధిష్టానం ఈ ఐదుగురిలో ఒకరిని ఎంపిక చేస్తుందా లేక ఇంకెవరైనా కొత్తవారికి అవకాశం ఇస్తుందా అన్నది చూడాలి. -
టీఎంసీ నేతకు బెయిల్ ఇవ్వాలని జడ్జికి బెదిరింపులు..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఆసన్సోల్ సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జికి బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. గోవుల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన టీఎంసీ నాయకుడు అనుబ్రత మండల్‌కు బెయిల్ ఇవ్వాలని, లేకపోతే జడ్డి కుటుంబసభ్యులపై నార్కొటిక్ డ్రగ్స్ కేసు పెడతామని ఓ వ్యక్తి బెదిరించాడు. ఈ విషయంపై జడ్జి రాజేశ్ చక్రవర్తి జిల్లా జడ్డికి ఫిర్యాదు చేశారు. బెదిరింపు లేఖను కూడా జత చేశారు. అనుబ్రత మండల్‌కు బెయిల్ ఇవ్వకపోతే తన కుటుంబసభ్యులందరిపై నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్(NDPS) కింద కేసు పెడతామని బప్ప చటర్జీ అనే వ్యక్తిపేరుతో లేఖవచ్చిందని జడ్జి పేర్కొన్నారు. నిందితుడు పుర్వ వర్ధమాన్‌లోని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టులో హెడ్ క్లర్క్ అని, టీఎంసీ లీడర్నని లేఖలో పేర్కొన్నాడని తెలిపారు. ఈ విషయాన్ని కోల్‌కతా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ వ్యవహారంపై బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ తీవ్రంగా స్పందించారు. అనుబ్రత మండల్ అరెస్టయినప్పటికీ సీఎం మమతా బెనర్జీ ఇంకా అతడ్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చదవండి: మా నాయకుడికి బెయిల్ ఇవ్వు లేకపోతే.. సీబీఐ జడ్జికి బెదిరింపులు -
Shatrughan Sinha: బీహారీ బాబు.. చారిత్రక విజయం
అలనాటి బాలీవుడ్ నటుడు, రాజకీయ నేత శత్రుఘ్న సిన్హా .. భారీ విజయం అందుకున్నారు. పశ్చిమ బెంగాల్ అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా 2 లక్షలకు పైచిలుకు ఓట్లతో ఆయన ఘన విజయం సాధించినట్లు సమాచారం. విశేషం ఏంటంటే.. అసన్సోల్ లోక్‌సభ స్థానాన్ని టీఎంసీ దక్కించుకోవడం ఇదే తొలిసారి. ► పాట్నాలో పుట్టి, పెరిగి.. రాజకీయాల్లో బీహారీ బాబుగా పేరు ముద్రపడ్డ 76 ఏళ్ల సిన్హా.. రాజకీయ జీవితం కూడా సంచలనమే!. ► అలనాటి బాలీవుడ్ హీరో శత్రుఘ్న సిన్హా.. 80వ దశకంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ► వాజ్‌పేయి-అద్వానీల కాలంలో.. స్టార్ క్యాంపెయినర్‌గా బీజేపీకి ఆయన ప్రచారం చేశారు. ► ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. పాట్నా సాహిబ్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. వాజ్‌పేయి కేబినెట్లో శత్రుఘ్న సిన్హా కేంద్ర మంత్రిగానూ పని చేశారు. ► అయితే పార్టీతో విభేధాలతో ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. ► 2019 సార్వత్రిక ఎన్నికల్లో.. పాట్నా సాహిబ్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి.. రవి శంకర్ ప్రసాద్ చేతిలో ఓడిపోయారు. ► అభిమానులు ముద్దుగా షాట్‌గన్ అని పిలుచుకునే శతృఘ్నసిన్హాకు.. రాజకీయాల్లోనూ రెబల్ స్టార్‌గా గుర్తింపు ఉంది. బీజేపీ ఎంపీగా ఉన్న రోజుల్లోనే ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించిన సందర్భాలు ఎన్నో. ► ఎంపీగా ఉన్న.. బాబుల్ సుప్రియో బీజేపీని వీడి టీఎంసీలో చేరడంతో అసన్సోల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ► ఎన్నికల ప్రచారంలో బీజేపీ.. టీఎంసీ అభ్యర్థి శతృఘ్నసిన్హాను బయటి వ్యక్తిగా ప్రచారం చేసింది. అయితే బెంగాలీలకు ఏమాత్రం వ్యక్తిని తాను అని గట్టిగానే ప్రచారం చేసుకున్నారాయన. ► అసన్సోల్ బరిలో బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్‌ను చిత్తుగా ఓడించారు శతృఘ్నసిన్హా. ► శత్రుఘ్న సిన్హాపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. అలాగే తనదైన శైలిలో గాంభీర్యమైన ప్రసంగాలతో జనాలను ఆకట్టుకోగలిగారు శత్రుఘ్న సిన్హా. :::సాక్షి వెబ్‌డెస్క్ -
మమతా బెనర్జీ అనూహ్య నిర్ణయం..
సమకాలీన రాజకీయాల్లో నరేంద్ర మోదీకి దీటుగా దూసుకుపోతున్న నాయకురాలు మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్లో ఖాళీగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఎవరూ ఊహించని విధంగా అభ్యర్థులను ప్రకటించి మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నారు దీదీ. సినిమా రంగంలో అగ్రతార వెలుగొంది రాజకీయాల్లోకి వచ్చిన ‘రెబల్ స్టార్’ శత్రుఘ్న సిన్హాను అనూహ్యంగా మళ్లీ రాజకీయ తెర మీదకు తెచ్చారు. కొంత కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయనకు పిలిచి మరీ ఎంపీ సీటు ఇచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. బెంగాల్లో ఖాళీగా ఉన్న అసన్సోల్ లోక్‌సభ స్థానం, బాలేగంజ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఈ రెండు స్థానాలకు మమతా బెనర్జీ అభ్యర్థులను ప్రకటించారు. అసన్సోల్ నుంచి శత్రుఘ్న సిన్హా, బాలేగంజ్లో బాబుల్ సుప్రియోలు తమ పార్టీ తరపున పోటీ చేస్తారని ఆమె ప్రకటించారు. అయితే బాబుల్ సుప్రియో రాజీనామాతో ఖాళీ అయిన అసన్సోల్ లోక్‌సభ స్థానాన్ని శత్రుఘ్న సిన్హాకు కేటాయించడం విశేషం. సిన్హాకే ఎందుకు? బిహార్‌లోని పట్నా లోక్‌సభ నియోజక వర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా గెలిచిన శత్రుఘ్న సిన్హా కేంద్రంలోని వాజపేయి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అయితే తర్వాత కాలంలో మోదీ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తారు. దీంతో 2019 ఎన్నికల్లో ఆయనకు బీజేపీ టిక్కెట్ దక్కలేదు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు మద్దతుగా బెంగాల్లో ఆయన ప్రచారం చేశారు. ఈ కారణం వల్లే ఆయనకు అసన్సోల్ ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం దీదీ కల్పించినట్టు తెలుస్తోంది. అసన్సోల్ to బాలేగంజ్ గాయకుడు, నటుడైన బాబుల్ సుప్రియో.. అసన్సోల్ లోక్‌సభ స్థానం నుండి రెండుసార్లు బీజేపీ ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించి కేంద్ర కేబినెట్లోనూ స్థానం సంపాందించారు. 2021, మార్చి-ఏప్రిల్‌లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆయనను టోలీగంజ్ నియోజకవర్గం నుంచి పోటీకి దించింది. అయితే ఆయన ఘోర పరాజయం పాలవడంతో పాటు కేంద్ర కేబినెట్లోనూ స్థానం కోల్పోయారు. తర్వాత పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో బీజేపీని వీడి గతేడాది సెప్టెంబర్‌లో టీఎంసీలో చేరారు. తర్వాత నెలలో లోక్‌సభ సభ్యత్వాన్ని అధికారికంగా వదులుకున్నారు. తాజాగా ఆయన బాలేగంజ్ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. (UP Election 2022: పార్టీల వారీగా సీట్లు, ఓట్ల శాతం..) ఇద్దరూ ఇద్దరే! శత్రుఘ్న సిన్హా, బాబుల్ సుప్రియోలకు చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరూ సినిమా రంగం నుంచి రాజకీయాలకు వచ్చి కేంద్ర మంత్రులుగా పనిచేశారు. బీజేపీని వ్యతిరేకించి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీలో నిలిచారు. ఉప ఎన్నికల్లో వీరు విజయం సాధిస్తారా.. మమతా బెనర్జీ వ్యూహం ఏమేరకు ఫలిస్తోందో వేచి చూడాలి. అసన్సోల్, బాలేగంజ్ స్థానాలకు ఏప్రిల్ 12న పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 16న ఫలితాలు వెలువడతాయి. (క్లిక్: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ) -
ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, బిహార్, మహారాష్ట్రలలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈమేరకు శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. లోక్‌సభ నియోజకవర్గంతో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. బెంగాల్‌లోని అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గం, బాలీగుంగె అసెంబ్లీ స్థానాలకు ఉప నిర్వహించనున్నారు. కైరాగఢ్(ఛత్తీస్‌గఢ్), బొచ్చహాన్(బిహార్), కొల్హాపూర్ నార్త్(మహారాష్ట్ర) శాసనసభా స్థానాలకూ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలకు ఏప్రిల్ 18లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజా షెడ్యూల్ ప్రకటించింది. (క్లిక్: ఆమె బీజేపీ ఏజెంట్.. మమ్మల్ని ఓడించారు) ► ఎన్నికల నోటిఫికేషన్ విడుదల: మార్చి 17 ► నామినేషన్లకు దాఖలుకు చివరి తేదీ: మార్చి 24 ► నామినేషన్ల పరిశీలన: మార్చి 25 ► నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 28 ► ఎన్నికల పోలింగ్ : ఏప్రిల్ 12 ► ఎన్నికల ఫలితాల వెల్లడి: ఏప్రిల్ 16 -
క్వారంటైన్ సెంటర్‌గా మార్చొద్దంటూ దాడి!
అసనసోల్(పశ్చిమబెంగాల్) : ప్రజల ప్రాణాలకోసం వైద్యసిబ్బంది, పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నా అవేమి పట్టని కొంతమంది వాళ్లపైనే తిరగబడి దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని పోచారులియా ప్రాంతంలో స్థానికుల దాడిలో ఐదుగురు పోలీసులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని క్వారంటైన్‌గా మార్చాలన్న సూచన మేరకు తనిఖీల కోసం ఆ ప్రాంతాన్ని వైద్యాధికారులు సందర్శించారు. అయితే ఆ ఆరోగ్య కేంద్రాన్ని క్వారంటైన్ సెంటర్‌గా మార్చొద్దంటూ కొన్ని అల్లరి మూకలు అడ్డుకున్నాయి. సదరు అధికారులపై దుర్భాషలాడుతూ దాడికి యత్నించడంతో పరిస్థితి అదుపు తప్పింది. దాంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడ చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే యత్నం చేశారు. కాగా, ఈ క్రమంలోనే ఆ నిరసన కారులు రాళ్ల దాడికి దిగడంతో పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. దీంతో పరిస్థితిని నియంత్రించేందుకు లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్‌ను ప్రయోగించాల్సి వచ్చిందని సీనియర్ అధికారి తెలిపారు. కొంతమంది స్థానికులకు కూడా స్వల్ప గాయాలు అయినట్లు చెప్పారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, దీని వెనుక ఉన్న కుట్రదారులను పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా బర్ధమాన్ జిల్లాలోని అసన్సోల్ ప్రాంతంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదుకావడంతో ఈ ప్రాంతాన్ని క్వారంటైన్ సెంటర్‌గా మర్చాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. -
అసన్సోల్ అమీతుమీ
పశ్చిమ బెంగాల్‌లోని 42లోక్‌సభ స్థానాల్లో కీలకమైన అసన్సోల్ నియోజకవర్గంలో గెలుపును ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఇక్కడ రెండో సారి గెలిచి పట్టు బిగించాలని బీజేపీ ప్రయత్నిస్తోంటే, ఎలాగైనా ఇక్కడ బోణీ కొట్టాలని తృణమూల్ కాంగ్రెస్ ఎత్తులు వేస్తోంది.బొగ్గు గనులు, ఫ్యాక్టరీల కార్మికులు, స్క్రాప్ డీలర్లతో పాటు కోల్ మాఫియా కూడా ఈ నియోజకవర్గంలో గెలుపోటములను నిర్ణయించే శక్తులు. రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన(కోల్‌కతా తర్వాత) అసన్సోల్లో 75 శాతం హిందువులు,21శాతం ముస్లింలు ఉన్నారు. జనాభాలో 50శాతం హిందీ మాట్లాడతారు. బిహార్, జార్ఖండ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గం కమ్యూనిస్టులకు ఆయువు పట్టుగా ఉండేది.1957 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో ఇక్కడ సీపీఎం 10 సార్లు, కాంగ్రెస్ ఐదు సార్లు, బీజేపీ ఒక సారి నెగ్గాయి.1989 నుంచి 2009 వరకు ఈ నియోజకవర్గం సీపీఎంకే దక్కుతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో మొదటి సారి బీజేపీ జయకేతనం ఎగుర వేసింది.ఏప్రిల్29 పోలింగ్ జరిగే ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బాబుల్ సుప్రియో, తృణమూల్ నుంచి సినీనటి మూన్‌మూన్‌సేన్, సీపీఎం తరఫున గౌరంగా చటర్జీ, కాంగ్రెస్ టికెట్‌పై బిశ్వరూప్ మండల్ పోటీ చేస్తున్నారు.అయితే, బీజేపీ, తృణ మూల్ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. తృణమూల్ జెండా ఎగురుతుందా రాష్ట్రంలో కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడి అధికారాన్ని దక్కించుకున్న తృణమూల్ ఈ ఎన్నికను సవాలుగా తీసుకుంది. రాష్ట్రంలో ఇంత వరకు తృణమూల్ జెండా ఎగరని ఎనిమిది లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ అసన్సోల్ ఒకటి.ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదు తృణమూల్ చేతిలో ఉన్నాయి. 2014లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థి డోలా సేన్ కేవలం 70వేల ఓట్ల తేడాతో బీజేపీ చేతిలో ఓడిపోయారు. అందుకే ఈ సారి ఎలాగైనా నెగ్గాలన్న పట్టుదలతో డోలా సేన్‌ను పక్కన పెట్టి మూన్‌మూన్ సేన్‌ను బరిలో దింపింది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో తృణమూల్ హవా నడిచినా బీజేపీ గెలుచుకున్న రెండు సీట్లలో అసన్సోల్ ఒకటి. ఈ సారి కూడా ఇక్కడ నెగ్గి మమతా బెనర్జీకి మోదీ దెబ్బ రుచి చూపించాలని కమలనాధులు ఆశిస్తున్నారు.హిందూ మెజారిటీ ఓటర్లు ఉండటం.సీపీఎంలో తటస్తుల ఓట్లు తమకు వస్తాయన్న ఆశ బీజేపీకి గెలుపుపై నమ్మకం కలిగిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీకి 37శాతం, సీపీఎంకు 22 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సారి సీపీఎం ఓట్లు సగం వచ్చినా గెలుపు తమదేనని బీజేపీ భావిస్తోంది. సిట్టింగ్ ఎంపీ సుప్రియోకు నియోజకవర్గం ప్రజలతో మంచి సంబంధాలే ఉన్నా యి. జనంలో కలిసిపోయి ఆయన చేసే ప్రచారం ఓటర్లను ఆకట్టుకుంటోంది.అయితే,2018లో నియోజకవర్గంలో జరిగిన మత కలహాలు కషాయం పరపతిని తగ్గించాయి. ఆ గొడవల్లో ఓటర్లు హిందూ–ముస్లింలుగా విడిపోయారు. కలహాల తదనంతరం ఆరెస్సెస్, వీహెచ్‌పీ వంటి బీజేపీ అనుబంధ సంస్థల కార్యకలాపాలు ముమ్మరం కావడంతో ముస్లింలు భద్రత కోసం తృణమూల్ వైపు మళ్లారు. ఈసారి తృణమూల్‌కే ఓటేస్తా మని ముస్లిం పెద్దలు కూడా చెబుతున్నారు. అదీగాక నిరుద్యోగ సమస్య పరిష్కారంలో, మూతపడ్డ పరిశ్రమలను తెరిపించడంలో, ముఖ్యంగా హిందూస్తాన్ కేబుల్స్‌ను తిరిగి తెరిపించడంలో సుప్రియో విఫలమయ్యారన్న ఆగ్రహం ఓటర్లలో బాగా ఉంది. నియోజకవర్గంలో రెండు పార్టీలూ కూడా గెలుపుపై నమ్మ కం పెట్టుకునే పరిస్థితులులేవని ఎన్నికల పరిశీలకుల భావన. -
ఐపీఎస్‌పై దాడి.. కేంద్రమంత్రిపై ఎఫ్ఐఆర్!
కోల్‌కతా: 144 సెక్షన్‌ను ఉల్లంఘించి.. ఐపీఎస్ అధికారిపై దాడి చేశారంటూ కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోపై పశ్చిమ బెంగాల్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. శ్రీరామనవమి సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగిన అసన్సోల్ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొనడంతో పోలీసులు 144 సెక్షన్ విధించి.. నిషేధాజ్ఞలు అమల్లోకి తెచ్చారు. అయితే, తన నియోజకవర్గం పరిధిలోని అసన్సోల్ పరిస్థితిని సమీక్షించేందుకు అక్కడ పర్యటించాలని కేంద్రమంత్రి బాబుల్ ప్రయత్నించారు. ఇందుకు భద్రతా సిబ్బంది అడ్డుపడటంతో మరో మార్గం ద్వారా కల్యాణ్‌పూర్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో ఆగ్రహానికి లోనైన బాబుల్ ఐపీఎస్ అధికారి రూపేశ్ కుమార్‌పై దాడిచేసినట్టు తెలుస్తోంది. దీంతో 144 సెక్షన్‌ను ఉల్లంఘించి.. విధినిర్వహణలో ఉన్న ఐపీఎస్‌పై దాడి చేశారని, అల్లర్లకు పాల్పడ్డారని పోలీసులు కేంద్రమంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అసన్సోల్లో పర్యటిస్తున్న సమయంలో పోలీసులే తనపై దాడి చేశారని, దీనిపై తాను కూడా ఎఫ్ఐఆర్ నమోదుచేస్తానని తెలిపారు. -
కేంద్రమంత్రిపై రాళ్లతో దాడి, గాయాలు
-
కేంద్రమంత్రిపై రాళ్లతో దాడి, గాయాలు
కోల్‌కతా: ప్రముఖ నటుడు, గాయకుడు, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కాన్వాయ్‌పై తృణమాల్ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో సుప్రియోతో పాటు ఆయన అనుచరులు ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఓ రాయి తన ఛాతీపై పడిందని, గాయమైందని మంత్రి చెప్పారు. బుధవారం పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పశ్చిమబెంగాల్ న్యాయశాఖ మంత్రి మలోయ్ ఘటక్ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డారని సుప్రియో ఆరోపించారు. ఆందోళనకారులు దాడి చేస్తున్నా పోలీసులు ఆపే ప్రయత్నం చేయలేదని చెప్పారు. నిరసనకారుల గుంపులోంచి ఓ పెద్ద రాయి విసిరారని సుప్రియో తెలిపారు. కొందరు ఈ ఘటనను వీడియో తీశారని పేర్కొన్నారు. ఆందోళనకారులు మంత్రి కారును ధ్వంసం చేశారు. అక్రమంగా కబేళాలను నడుపుతున్నారని, పరిశీలించేందుకు వెళ్లగా దాడిచేసినట్టు తెలిపారు. సుప్రియో అసన్సోల్ నియోజకవర్గం నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.