న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, బిహార్, మహారాష్ట్రలలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈమేరకు శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. లోక్‌సభ నియోజకవర్గంతో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి.
బెంగాల్‌లోని అసన్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గం, బాలీగుంగె అసెంబ్లీ స్థానాలకు ఉప నిర్వహించనున్నారు. కైరాగఢ్(ఛత్తీస్‌గఢ్), బొచ్చహాన్(బిహార్), కొల్హాపూర్ నార్త్(మహారాష్ట్ర) శాసనసభా స్థానాలకూ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలకు ఏప్రిల్ 18లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజా షెడ్యూల్ ప్రకటించింది. (క్లిక్: ఆమె బీజేపీ ఏజెంట్.. మమ్మల్ని ఓడించారు)
► ఎన్నికల నోటిఫికేషన్ విడుదల: మార్చి 17
► నామినేషన్లకు దాఖలుకు చివరి తేదీ: మార్చి 24
► నామినేషన్ల పరిశీలన: మార్చి 25
► నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 28
► ఎన్నికల పోలింగ్ : ఏప్రిల్ 12
► ఎన్నికల ఫలితాల వెల్లడి: ఏప్రిల్ 16
Comments
Please login to add a commentAdd a comment