రెండు స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ | 4 states by-polls, congress win bellary, patiala | Sakshi
Sakshi News home page

రెండు స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్

Published Mon, Aug 25 2014 10:58 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

రెండు స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ - Sakshi

రెండు స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్

న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు కైవసం చేసుకుంది. పంజాబ్లో ఓ స్థానాన్ని, కర్ణాటకలో మరో స్థానంలో విజయం సాధించింది. పంజాబ్ పాటియాల స్థానాన్ని కాంగ్రెస్ తన ఖాతాలో జమ చేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రణీత్ కౌర్ 23,836 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన  ఏఏపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు.

మరోవైపు కర్ణాటకలోని బళ్లారిలో కూడా హస్తం గెలుపొందింది. బీజేపీ అభ్యర్థి ఓబులేశుపై కాంగ్రెస్ అభ్యర్థి గోపాలకృష్ణ 25వేల ఓట్లతో గెలుపొందారు. మిగతా స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement