ఛండీఘర్: పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాటాలను అణచివేస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పంజాబ్ ప్రభుత్వం నకిలీ హామీలపై నవజ్యోత్ సింగ్ ధైర్యంగా ఖండిస్తున్నారని అన్నారు. అయితే సోమవారం సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఇసుక మాఫీయాను రూపుమాపి ధరలు తగ్గించిందన్నారని పేర్కొన్నారు.
చదవండి: గతంలో నేనూ ఆటో డ్రైవర్‌నే.. పెండింగ్ చలాన్లు రద్దు చేస్తా: సీఎం
అయితే వెంటనే సీఎం చన్నీ వ్యాఖ్యలను సిద్ధూ ఖండించారని తెలిపారు. సీఎం చన్నీ చెప్పే విషయం సత్యం కాదని స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఇసుక మాఫీయా ఇంకా కొనసాగుతోందన్నారని తెలిపారు. అయితే ఇలా తమ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపినందుకు సిద్ధూకు సెల్యూట్ చేస్తున్నానని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. చన్నీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, మొత్తం కాంగ్రెస్ పార్టీ సిద్ధూ గొంతును అణచివేస్తోందని చెప్పారు. గతంలో అమరేందర్ సింగ్.. ప్రస్తుతం సీఎం చన్నీ సిద్ధూను అణచివేస్తున్నారని పేర్కొన్నారు. సిద్ధూ అవకాశవాది అని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధూ ఆప్‌లో చేరనున్నట్లు అమరేందర్ సింగ్ పలుమార్లు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
చదవండి: పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్..
అదే విధంగా ఆప్ పంజాబ్ సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఊహాగానాలకు సీఎం కేజ్రీవాల్ చెక్ పెట్టారు. పంజాబల్‌లో కాంగ్రెస్ తమ సీఎం అభ్యర్థి చన్నీనా? లేదా సిద్ధూనా? అని ప్రకటించలేదన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లో కూడా బీజేపీ తమ సీఎం అభ్యర్థి యోగినా? మరోకరా? అనే దానిపై స్పష్టత ఇవ్వడం లేదని పేర్కొన్నారు. అదే విధంగా గోవా, ఉత్తరఖండ్‌లో కూడా ఎవరు తమ సీఎం అభ్యర్థులను ప్రకటించలేదన్నారు. అందరి కంటే తామే ముందుగా పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment