కేసీఆర్‌ దారిలో కేజ్రీవాల్‌?.. ఇది కాంగ్రెస్‌కు రిక్వెస్ట్‌ కాదు అల్టిమేటం! | Aap Targets Congress Just Before Opposition Meet, Is Arvind Kejriwal Going Kcr Way | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ దారిలో కేజ్రీవాల్‌?.. ఇది కాంగ్రెస్‌కు రిక్వెస్ట్‌ కాదు అల్టిమేటం!

Published Fri, Jun 23 2023 8:57 PM | Last Updated on Fri, Jun 23 2023 9:36 PM

Aap Targets Congress Just Before Opposition Meet, Is Arvind Kejriwal Going Kcr Way - Sakshi

న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఇందులో భాగంగా శుక్రవారం బీహార్‌ సీఎం, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ నివాసంలో కాంగ్రెస్‌తోపాటు వివిధ ప్రతిపక్షాలు హాజరు అయ్యారు. గతంలోనే ఈ భేటీలో ప్రధాని అభ్యర్థిపై ఎలాంటి చర్చ జరగదని ఈ పార్టీలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ తరుణంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతి పక్షాలకు సడన్‌గా షాక్‌ ఇచ్చారు.

కాంగ్రెస్‌కు కేజ్రీవాల్ అల్టిమేటం
శుక్రవారం విపక్షాల సమావేశం నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్‌కు అల్టిమేటం ఇచ్చారు. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించాలని, లేనిపక్షంలో తాను భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు సంబంధించిన అన్ని సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు తెలిపారు. ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ తన వైఖరిని వెల్లడించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఈ సమావేశానికి సీఎం కేజ్రీవాల్‌ కూడా హాజరయ్యారు.

భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతి పక్షాలన్నీ సమావేశమైన ఈ సమయంలో రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆప్‌ పార్టీ విషయంలో కాంగ్రెస్‌ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. కాగా ఇప్పటికే కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు అరవింద్ కేజ్రీవాల్ పలువురు ఆప్ నేతలను కలిశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీని కూడా కలిసేందుకు ప్రయత్నించాగా..  అది కుదరలేదు.

కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వకపోతే.. కేసీఆర్‌ దారిలో కేజ్రీవాల్‌?
ఒక వేళ ఆర్డినెన్స్‌ విషయంలో కాంగ్రెస్‌ ఆప్‌కు మద్దతు తెలపకపోతే.. కేజ్రీవాల్‌ కూడా సీఎం కేసీఆర్‌ దారిలో నడిచే అవకాశం ఉంది. ఇటీవల టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించిన కేసీఆర్‌.. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండింటిపై దాడి చేస్తూ వివిధ రాష్ట్రాల్లో తన సంస్థాగత బలాన్ని చాటుకుంటూ రానున్న ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నారన్న సంగతి తెలిసిందే.

చదవండి: 'భేటీకి హాజరైన ప్రతిపక్ష నాయకుల ట్రాక్‌ రికార్డ్ ఎలాంటిదో..?'

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement