పంజాబ్: అచ్చం ఓ సినిమా దృశ్యంలాంటి ఘటన. అబ్బురపరిచిన పోలీస్ చేజింగ్.. తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేసిన దొంగలు.. పోలీసుల సాహసంతో చివరికి లొంగుబాటు. ఇది పంజాబ్లో సోమవారం జరిగిన ఓ సినీ ఫక్కీలాంటి ఘటన. పంజాబ్లో కొందరు దొంగలు ముందుగా ఓ బైక్ను దొంగలించారు. ఆ వెంటనే అదే బైక్పై వేగంగా దూసుకెళ్తూ ఓ మహిళ మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లారు.
ఈ విషయం పోలీసులకు తెలిసి వెంబడించారు. దీంతో కాసేపు దొంగా పోలీసు ఆట నెలకొంది. చివరికి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సమీపంలోని ఓ నదిలో బైక్ను పడేసిన దొంగలు.. అనంతరం వారు కూడా దూకేశారు. కానీ, పోలీసులు, స్థానికులు కూడా ఆ నదిలోకి దూకి వారిని పట్టుకుని ఆట కట్టించారు. చేతికి సంకెళ్లు వేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పతన్ కోట్ పోలీసులు చేసిన ఈ సాహసం అందరినీ అబ్బుర పరిచింది.
నదిలో దూకి మరీ అరెస్టు
Published Mon, Aug 24 2015 8:04 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement