beant singh
-
Parliament Budget Session 2024: మాటల యుద్ధం
న్యూఢిల్లీ: అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదాలు, నినాదాలతో లోక్‌సభ గురువారం దద్దరిల్లింది. పలుమార్లు వాయిదా పడింది. కేంద్ర బడ్జెట్‌పై ప్రారంభమైన చర్చ పూర్తిగా పక్కదారి పట్టింది. తొలుత కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి రవనీత్‌సింగ్ బిట్టూ తాత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్ హత్య ఘటనను ప్రస్తావించారు. దీనిపై బిట్టూ అభ్యంతరం వ్యక్తం చేశారు. చన్నీ, బిట్టూ మధ్య మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ నేత సోనియా గాం«దీతోపాటు చన్నీపై బిట్టూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. దీంతో విపక్ష ఎంపీలు ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడ్డారు. బిట్టూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యుడు అమరీందర్‌సింగ్ రాజా వెల్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయతి్నంచారు. రాహుల్ గాంధీ ఆయనను ఆపేశారు. బిట్టూతోపాటు పలువురు బీజేపీ ఎంపీలు వెల్‌లోకి ప్రవేశించేందుకు ప్రయతి్నంచగా స్పీకర్ స్థానంలో ఉన్న సంధ్యా రే సభను వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. సభ సజావుగా జరిగేలా చూడాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. సభ్యులంతా సభ గౌరవాన్ని కాపాడాలని స్పీకర్ అన్నారు. నిబంధనలు అతిక్రమించకూడదని చెప్పారు. తర్వాత చన్నీ తన ప్రసంగం కొనసాగించారు. రైతులకు ఇచి్చన హామీలను మోదీ ప్రభుత్వం నిటబెట్టుకోలేదని విమర్శించారు. రైతులను ఖలిస్తానీలు చిత్రీకరించారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. సభను చన్నీ తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. చన్నీ మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ చన్నీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆయనపై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని అన్నారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య మళ్లీ వాగ్వాదం కొనసాగింది. తర్వాత సభ రెండుసార్లు వాయిదా పడింది. పార్లమెంట్ బయట బిట్టూ మీడియాతో మాట్లాడారు. చన్నీ జాతి వ్యతిరేక శక్తిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇండియా నుంచి పంజాబ్‌ను విడదీయాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ: చన్నీ దేశంలో నరేంద్ర మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని చరణ్‌జిత్ సింగ్ చన్నీ మండిపడ్డారు. 20 లక్షల మంది ప్రజలు ఎన్నుకున్న ఎంపీని(అమృత్‌పాల్ సింగ్) జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేసిన ప్రజల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించే అవకాశం ఆయనకు ఇవ్వడం లేదని, ఇది ఎమర్జెన్సీ కాక మరేమిటని ప్రశ్నించారు. చన్నీ లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. అయితే, అమృత్‌పాల్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్‌సాహిబ్ నియోజకవర్గం నుంచి వివాదాస్పద సిక్కు మత బోధకుడు, ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ స్వతంత్ర అభ్యరి్థగా 2 లక్షల మెజారీ్టతో గెలిచిన సంగతి తెలిసిందే. ఆంధ్రా–బిహార్ బడ్జెట్: సౌగతా రాయ్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ లోక్‌సభలో విమర్శలు గుప్పించారు. అది ఆంధ్రా–బిహార్ బడ్జెట్ అని ఆక్షేపించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శిక్షణ పొందిన ఆర్థికవేత్త కాదని అన్నారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా కేవలం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచి్చన సూచనల ఆధారంగా బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. గతంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, పి.చిదంబరం హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారని, నిర్మలా సీతారామన్ మాత్రం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకున్నారని సౌగతా రాయ్ వ్యాఖ్యానించారు. -
లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడు పోటీ
మాజీ ప్రధాని ఇందిరా గాంధీని చంపిన హంతకుడి బంధువు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందిరా గాంధీని హత్య చేసిన ఇద్దరిలో ఒకరైన బీయాంత్ సింగ్ కొడుకు సరబ్జిత్ సింగ్ ఖల్సా.. పంజాబ్‌లోని ఫరీధ్కోట్ నుంచి స్వతంత్ర్య అభ్యర్ధిగా పోటీచేస్తున్నారు. 45 ఏళ్ల ఈయన 12 తరగతి చదువును మధ్యలోనే ఆపేశారు. గతంలోనూ పలు ఎన్నికల బరిలో నిలిచిన సరబ్జిత్.. ప్రతిసారి ఓటమినే చవిచూశారు. 2014, 2009లో, సరబ్జిత్ సింగ్ ఖల్సా వరుసగా ఫతేఘర్ సాహిబ్ (రిజర్వ్డ్) మరియు భటిండా స్థానాల నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విఫలమయ్యారు. అలాగే 2007లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భదౌర్ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2014లో ఎన్నికల అఫిడవిట్లో సరబ్జిత్ సింగ్ తన ఆస్తులను రూ. 3.5 కోట్లుగా ప్రకటించారు. 2019 ఎన్నికలలో,బహుజన్ సమాజ్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించాడు. కాగా.. సరబ్జీత్ తల్లి బిమల్ కౌర్ ఖల్సా 1989 సార్వత్రిక ఎన్నికల్లో రోపర్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. అదే ఎన్నికల్లో ఆయన తాత సుచాసింగ్ బఠిండా నుంచి విజయం సాధించారు. ఇక 1984 అక్టోబరు 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె భద్రతా సిబ్బంది బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఫరీద్కోట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ నుంచి మహమ్మద్ సాదిఖ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచిఫున వాయవ్య దిల్లీ సిట్టింగ్ ఎంపీ, పంజాబీ జానపద, సినీ నేపథ్య గాయకుడు హన్స్‌రాజ్ హన్స్ పోటీ చేస్తున్నారు. ఆమ్ఆద్మీ పార్టీ తరపున ప్రముఖ కమెడియన్ కరంజీత్ అనుమోల్ బరిలో నిలిచారు. . శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. చదవండి: పాకిస్తాన్‌కు చేతకాకపోతే మేము సిద్ధంగా ఉన్నాం: రాజ్‌నాథ్ సింగ్ -
సీఎం హత్య కేసు: మరణశిక్షను రద్దు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న బల్వంత్ సింగ్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ.. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఢిల్లీలో సమావేశమయ్యారు. 1995, ఆగస్టు 31న పంజాబ్ సెక్రటేరియట్లో అప్పటి ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో బియాంత్‌సింగ్‌తో పాటు మరో 17 మంది మరణించారు. ఈ కేసులో బల్వంత్ సింగ్ దోషిగా తేల్చితూ 2007లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే ఆయనకు విధించిన శిక్షను రద్దుచేసి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని బాదల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే దీనిపై అమిత్ షా ఏవిధంగా స్పందించారనేది మాత్రం తెలియాల్సి ఉంది. -
సహచరుల విడుదల కోరుతూ ఆత్మహత్య..
పంజాబ్: వివిధ కేసుల్లో శిక్షలు పడి, జైలు జీవితం పూర్తి చేసుకున్నా తన సహచరులు విడుదల కాకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్న గురుభక్ష్ సింగ్ ఖల్సా ఆత్మహత్య చేసుకున్నాడు. విజ్ఞప్తులు, ఆందోళనలు చేసినప్పటికీ, ఖైదీల విడుదలకు స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఆయన మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కురుక్షేత్ర జిల్లా ఎస్పీ అభిషేక్ గార్గ్ మాట్లాడుతూ.. ‘పలువురు సిక్క్ రాడికల్స్ విడుదల కోసం గత కొంతకాలంగా గురుభక్ష్ ఆందోళన చేస్తున్నాడు. వారిని విడుదల చేయాలని ట్యాంక్ పైకెక్కి నినాదాలు చేస్తూ.. నీటిలోకి దూకాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని లోక్‌నారాయణ్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించార’ని తెలిపారు. 44 రోజుల నిరాహార దీక్ష.. 2013లో గురుభక్ష్ సింగ్...శిక్ష పూర్తయిన ఖైదీలను విడుదల చేయాలంటూ 44 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాడు. ప్రభుత్వ హామీతో దీక్ష విరమించాడు. కానీ, వారు విడుదల కాకపోవడం గమనార్హం. -
ఆ సీఎంను ఎలా హతమార్చామో తెలుసు కదా..!
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను చంపేస్తామంటూ కెనడాలో ఉన్న ఖలిస్తాన్ మద్దతుదారులు హెచ్చరికలు పంపుతున్నారు. ఈ మేరకు వరుసపెట్టి ఆడియో రికార్డింగులు ఆయనకు పంపినట్లు తెలుస్తోంది. ''కెప్టెన్, మీ పార్టీ నుంచే బియాంత్ అనే ఒక ముఖ్యమంత్రి ఉండేవారు.. అతడి అంత్యక్రియలు చేయడానికి మృతదేహం ముక్కలు ఏరుకోవాల్సి వచ్చింది'' అని గట్టిగా అరుస్తూ ఒక హెచ్చరికను రికార్డు చేశారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్‌ను ఖలిస్తాన్ ఉగ్రవాదులు కారుబాంబుతో చంపేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాగే చంపేస్తామంటూ కెప్టెన్ అమరీందర్నూ హెచ్చరిస్తున్నారు. అయితే, వాటిని తాను ఏమాత్రం పట్టించుకునేది లేదని కెప్టెన్ అంటున్నారు. వాళ్లు కెనడాలో తలలు పగిలేలా అరుచుకున్నా తాను మాత్రం కొంచెం కూడా పట్టించుకోనని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశం, పంజాబ్ కూడా సుస్థిరంగా, బలంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని, రాష్ట్రం సుస్థిరంగా ఉంటే తాను అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టగలనని అన్నారు. కెనడాలో ఉంటున్న కొందరు ఖలిస్తాన్ ఉగ్రవాదులు కేవలం పంజాబ్ ముఖ్యమంత్రినే కాక.. మాజీ డీజీపీ కేపీఎస్ గిల్‌ను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించివేశారంటూ గిల్‌కు అప్పట్లో చాలా మంచిపేరు వచ్చింది. కెనడాలో ఏదో నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ.. ఆ సందర్భంగానే ఈ ఆడియో మెసేజ్‌లు రికార్డు చేసినట్లుగా వెనకాల శబ్దాలను బట్టి తెలుస్తోంది. ఇటీవల భారతదేశంలో పర్యటించిన కెనడా రక్షణ మంత్రి హర్జీత్ సజ్జన్ పేరు కూడా ఆ ఆడియో సందేశాల్లో వినిపించింది. ఆయన ఖలిస్తానీ ఉద్యమానికి సానుభూతిపరుడన్న ఉద్దేశంతో సజ్జన్‌ను కలిసేందుకు అమరీందర్ నిరాకరించారు. అయితే.. ఆయనకు తగిన భద్రత మాత్రం కల్పించారు. ''నువ్వు మా రక్షణ మంత్రిని ఉగ్రవాది అన్నావు. నువ్వు సిక్కులను అవమానించావు. ఈ గడ్డ మీద నుంచి నిన్ను చాలెంజ్ చేస్తున్నాం. నీకు ఏ రేంజిలో స్వాగతం పలుకుతామంటే.. ఎప్పుడూ ఇక సిక్కులతో పెట్టుకోవు. నువ్వు సిక్కులందరినీ రెచ్చగొట్టావు. దమ్ముంటే కెనడా రమ్మని సవాలు చేస్తున్నాం'' అని మరో ఆడియో క్లిప్‌లో పేర్కొన్నారు. -
మాజీ సీఎం మనవడి ఆత్మహత్య
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడు హర్కీరత్ సింగ్ (41) ఆత్మహత్య చేసుకున్నాడు. లైసెన్సుడు పిస్టల్‌తో తలలో కాల్చుకుని అతడు చనిపోయినట్లు తెలుస్తోంది. తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్నందువల్లే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. హర్కీరత్ సింగ్ తమ గ్రామానికి సర్పంచ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన 1995 నుంచి డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నారని, గత సంవత్సరం ఒక ప్రమాదానికి గురై, రెండు నెలల క్రితమే కోమాలోంచి బయటకు వచ్చారని ఆయన సమీప బంధువు, లూధియానా ఎంపీ రవ్నీత్ బిట్టు తెలిపారు. హర్కీరత్ అన్న గుర్కీరత్ ఖానా నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆయన తండ్రి తేజ్‌ప్రకాష్ 1990లలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. హర్కీరత్ ఆత్మహత్య చేసుకునే సమయానికి ఆయన భార్య ఇంట్లోనే ఉన్నారు. వీళ్లు చండీగఢ్‌లోని ప్రభుత్వ క్వార్టర్లో నివసిస్తారు. 1995లో బియాంత్ సింగ్ హత్యకు గురికావడంతో ఆ తర్వాతి నుంచి చాలామందికి పోలీసు భద్రత ఉంది. ఎంపీ బిట్టుకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది. -
జైలుకు ఇంటర్వ్యూకు వెళితే దాడి చేశారు
చండీగఢ్: పంజాబ్ లో సీనియర్ జర్నలిస్టుపై దాడి జరిగింది. జైలులో ఓ ఇంటర్యూకోసం వెళ్లిన ఆయనపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపట్ల రాష్ట్ర ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తూ అసలు జైలులో ఇంటర్వ్యూకు ఎలా అనుమతిచ్చారంటూ ఓ జైలు అధికారిని సస్పెండ్ చేసింది. కన్వార్ సంధు అనే వ్యక్తి పంజాబ్ లో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి బీంత్ సింగ్ హత్య కేసులో ప్రధాన నేరస్తుడు బల్వంత్ సింగ్ రాజోనాను ఇంటర్వ్యూ చేసేందుకు పాటియాలా జైలుకు వెళ్లాడు. ఆ సమయంలోనే కొందరు వ్యక్తులు కన్వార్ పై దాడికి దిగారు. -
బియాంత్ హంతకుడు భారత్‌కు అప్పగింత
న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో నేరస్తుడు, సిక్కు తీవ్రవాది జగ్తార్ సింగ్ తారాను థాయ్‌లాండ్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించింది. 1995 ఆగస్టు 31న చండీగఢ్ సచివాలయ సముదాయంలో జరిగిన అత్మాహుతి దాడిలో బబ్బర్ ఖల్సా అంతర్జాతీయ తీవ్రవాద సంస్థకు చెందిన తారాకు జీవిత ఖైదు శిక్ష పడింది. 2004లో బురైల్ జైలు నుం తప్పించుకున్నాడు. మారుపేరుతో థాయ్‌లాండ్‌లో జీవిస్తున్న అతన్ని జనవరి 5న అక్కడి పోలీసులు అరెస్టు చేసి భారత్‌కు అప్పగించారు. -
మాజీ సీఎం హత్య కేసులో 'సూత్రధారి' అరెస్ట్
థాయ్‌లాండ్: పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ హత్య కేసులో కీలక సూత్రధారి జాగ్తర్ సింగ్ (తారా)ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. థాయ్‌లాండ్‌లో మంగళవారం తారాను పోలీసులు అరెస్ట్ చేశారు. 1995, ఆగస్టు 31న పంజాబ్ సెక్రటేరియట్ వద్ద బియాంత్ సింగ్ దారుణ హత్యకు గురైయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయి వద్ద మానవ బాంబు ఆత్మహుతికి పాల్పడింది. ఈ ఘటనలో మరో 17 మంది మరణించారు. ఈ ఘాతుకం ఖలీస్థాన్ వేర్పాటువాదుల పనే అని భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. దాంతో ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ జాగ్తర్ సింగ్ (తారా) ఈ ఘటనకు అసలు సూత్రధారి అని పోలీసుల దర్యాప్తులో తెలింది. దాంతో అతడితోపాటు మరో ముగ్గురు హవరా, బెహోరా, దేవ్ సింగ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని చంఢీఘడ్‌లోని బురైల్ జైలుకు తరలించారు. అయితే 2004లో వారు ఆ జైలు నుంచి బయటకు సొరంగం తొవ్వి దీని ద్వారా తప్పించుకున్నారు. అనంతరం వారు నేపాల్ పారిపోయారు. పోలీసులు హవరా, బెహెరాలను నేపాల్‌లో అరెస్ట్ చేశారు. తారా, దేవి సింగ్‌లు మాత్రం పాక్‌లో ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. కాగా తారా పాక్ నుంచి థాయ్‌లాండ్ వెళ్లి నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దాంతో పోలీసులు థాయ్ లాండ్ పోలీసుల సాయం కోరారు. దాంతో అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దీంతో మంగళవారం తారా పోలీసులకు చిక్కాడు. అతడిని భారత్ కు తరలించేందుకు థాయ్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. మరో నిందితుడు దేవ్ సింగ్ ఇంకా పాక్‌లో ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అయితే తారాకు పాక్ ఐఎస్ఐ అండదండలు అందిస్తుందని సమాచారం.