మాజీ ప్రధాని ఇందిరా గాంధీని చంపిన హంతకుడి బంధువు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందిరా గాంధీని హత్య చేసిన ఇద్దరిలో ఒకరైన బీయాంత్ సింగ్ కొడుకు సరబ్‌జిత్ సింగ్ ఖల్సా.. పంజాబ్‌లోని ఫరీధ్‌కోట్ నుంచి స్వతంత్ర్య అభ్యర్ధిగా పోటీచేస్తున్నారు. 45 ఏళ్ల ఈయన 12 తరగతి చదువును మధ్యలోనే ఆపేశారు. గతంలోనూ పలు ఎన్నికల బరిలో నిలిచిన సరబ్‌జిత్.. ప్రతిసారి ఓటమినే చవిచూశారు.
2014, 2009లో, సరబ్‌జిత్ సింగ్ ఖల్సా వరుసగా ఫతేఘర్ సాహిబ్ (రిజర్వ్‌డ్) మరియు భటిండా స్థానాల నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విఫలమయ్యారు. అలాగే 2007లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భదౌర్ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2014లో ఎన్నికల అఫిడవిట్‌లో సరబ్‌జిత్ సింగ్ తన ఆస్తులను రూ. 3.5 కోట్లుగా ప్రకటించారు. 2019 ఎన్నికలలో,బహుజన్ సమాజ్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించాడు.
కాగా.. సరబ్‌జీత్ తల్లి బిమల్ కౌర్ ఖల్సా 1989 సార్వత్రిక ఎన్నికల్లో రోపర్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. అదే ఎన్నికల్లో ఆయన తాత సుచాసింగ్ బఠిండా నుంచి విజయం సాధించారు. ఇక 1984 అక్టోబరు 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె భద్రతా సిబ్బంది బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఫరీద్‌కోట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ నుంచి మహమ్మద్ సాదిఖ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచిఫున వాయవ్య దిల్లీ సిట్టింగ్ ఎంపీ, పంజాబీ జానపద, సినీ నేపథ్య గాయకుడు హన్స్‌రాజ్ హన్స్ పోటీ చేస్తున్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ తరపున ప్రముఖ కమెడియన్ కరంజీత్ అనుమోల్ బరిలో నిలిచారు. . శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు.
చదవండి: పాకిస్తాన్‌కు చేతకాకపోతే మేము సిద్ధంగా ఉన్నాం: రాజ్‌నాథ్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment