faridkot
-
Lok Sabha Election 2024: ఫరీద్కోట్...బహుముఖ పోటీ
పంజాబ్‌లోని ఫరీద్కోట్ లోక్‌సభ స్థానంలో బహుముఖ పోటీ నెలకొంది. బీజేపీ నుంచి ప్రముఖ గాయకుడు హన్స్‌రాజ్ హన్స్, ఆప్ నుంచి నట గాయకుడు కరంజీత్ అన్మోల్ బరిలో ఉన్నారు. అకాలీదళ్, కాంగ్రెస్‌లకు తోడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకరైన బియాంత్‌సింగ్ కుమారుడు సరబ్జీత్ సింగ్ ఖల్సా స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దిగి గట్టి పోటీయే ఇస్తున్నారు. దాంతో శనివారం చివరిదైన ఏడో విడతలో పోలింగ్ జరిగే స్థానాల్లో ఫరీద్కోట్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.కాంగ్రెస్‌కు కష్టాలు.. ఫరీద్కోట్ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. పంజాబీ జానపద గాయకుడు మహ్మద్ సాదిక్ 2019లో గెలుపొందారు. ఈసారి ఆయన్ను కాదని అమర్జీత్ కౌర్ సాహోక్కు టికెటిచి్చంది. స్థానికురాలైన సాహోక్ దాన్నే ప్రధాన బలంగా మార్చుకుని ప్రచారం చేశారు. కానీ పారీ్టలోనే తీవ్రమైన వ్యతిరేకత ఉండటం ఆమెకు మైనస్‌గా మారింది. సీనియర్ నేతలు ప్రచారానికి పూర్తిగా దూరంగా ఉన్నారు. దాంతో సాహోక్కు మద్దతుగా కాంగ్రెస్ ఒక్క పెద్ద ర్యాలీ కూడా నిర్వహించలేకపోయింది! ఆప్ అభ్యర్థి అన్మోల్ సీఎం భగవంత్ మాన్కు సన్నిహితుడు. తన స్టార్డమ్, మాన్ ప్రభుత్వ పనితీరు తనను గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. పంజాబీ నటులు, గాయకులు అన్మోల్కు మద్దతుగా జోరుగా ప్రచారం చేశారు. ఇక 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయానికి కారణమైన సిక్కు సంస్థలు ఈసారి ఇండిపెండెంట్ సరబ్జీత్ సింగ్ ఖల్సాకు దన్నుగా నిలిచాయి.సూఫీల ఇలాకా... రాజ నగరంగా ప్రసిద్ధి చెందిన ఫరీద్కోట్ సూఫీ సాధువుల అడ్డా. బాబా ఫరీద్ నగరం అని కూడా అంటారు. ఈ లోక్‌సభ స్థానం 1977లో ఏర్పాటైంది. ఒకప్పుడు అకాలీదళ్‌కి కంచుకోట. 2014లో ఆప్, 2019 కాంగ్రెస్ గెలిచాయి. దీని పరిధిలోని తొమ్మిది అసెంబ్లీ సీట్లూ ఆప్ చేతిలోనే ఉండటం ఆ పారీ్టకి కాస్త కలిసొచ్చే అంశం. ఒక్క అభ్యర్థి కూడా నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడలేదన్నది స్థానికుల ఆరోపణ. డ్రగ్స్, అభివృద్ధి లేమి ఇక్కడి ప్రధాన సమస్యలు. దీనికి తోడు రైతు ఆందోళనల ప్రకంపనలు ఈసారి అందరు అభ్యర్థులనూ తాకాయి!బీజేపీకి చుక్కలు... గత ఎన్నికల్లో ఢిల్లీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన బీజేపీ అభ్యర్థి హన్స్‌రాజ్ హన్స్ ఫరీద్కోట్కు పూర్తిగా కొత్త. ప్రచారం పొడవునా రైతు సంఘాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొన్నారు. దానికి తోడు రైతులకు వ్యతిరేకంగా ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీని మరింత ఇరుకున పెట్టాయి. ప్రచారంలో పాటలు పాడుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అకాలీదళ్ కూడా ఈసారి ఎలాగైనా నెగ్గాలని పట్టుదలగా ఉంది. ఆ పార్టీ అభ్యర్థి రాజి్వందర్ సింగ్ మాజీ ఎమ్మెల్యే శీతల్ సింగ్ కుమారుడు, మాజీ మంత్రి గురుదేవ్ బాదల్ మనవడు. 2015లో ఆప్‌లో చేరిన ఆయన 2017 అసెంబ్లీ ఎన్నికల ముందు మళ్లీ అకాలీదళ్‌కు తిరిగొచ్చారు. తన కుటుంబ రాజకీయ వారసత్వాన్నే నమ్ముకున్నారు. ఫరీద్కోట్కు తన కుటుంబం ఎంతో సేవ చేసిందంటూ ప్రచారం చేశారు. దళిత ప్రాబల్యమున్న ఫరీద్‌కోట్‌లో బీఎస్పీ పోటీ ప్రధాన పారీ్టల అవకాశాలను దెబ్బ తీసేలా ఉంది.– సాక్షి, న్యూఢిల్లీ -
లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడు పోటీ
మాజీ ప్రధాని ఇందిరా గాంధీని చంపిన హంతకుడి బంధువు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందిరా గాంధీని హత్య చేసిన ఇద్దరిలో ఒకరైన బీయాంత్ సింగ్ కొడుకు సరబ్జిత్ సింగ్ ఖల్సా.. పంజాబ్‌లోని ఫరీధ్కోట్ నుంచి స్వతంత్ర్య అభ్యర్ధిగా పోటీచేస్తున్నారు. 45 ఏళ్ల ఈయన 12 తరగతి చదువును మధ్యలోనే ఆపేశారు. గతంలోనూ పలు ఎన్నికల బరిలో నిలిచిన సరబ్జిత్.. ప్రతిసారి ఓటమినే చవిచూశారు. 2014, 2009లో, సరబ్జిత్ సింగ్ ఖల్సా వరుసగా ఫతేఘర్ సాహిబ్ (రిజర్వ్డ్) మరియు భటిండా స్థానాల నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విఫలమయ్యారు. అలాగే 2007లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భదౌర్ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2014లో ఎన్నికల అఫిడవిట్లో సరబ్జిత్ సింగ్ తన ఆస్తులను రూ. 3.5 కోట్లుగా ప్రకటించారు. 2019 ఎన్నికలలో,బహుజన్ సమాజ్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించాడు. కాగా.. సరబ్జీత్ తల్లి బిమల్ కౌర్ ఖల్సా 1989 సార్వత్రిక ఎన్నికల్లో రోపర్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. అదే ఎన్నికల్లో ఆయన తాత సుచాసింగ్ బఠిండా నుంచి విజయం సాధించారు. ఇక 1984 అక్టోబరు 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె భద్రతా సిబ్బంది బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఫరీద్కోట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ నుంచి మహమ్మద్ సాదిఖ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచిఫున వాయవ్య దిల్లీ సిట్టింగ్ ఎంపీ, పంజాబీ జానపద, సినీ నేపథ్య గాయకుడు హన్స్‌రాజ్ హన్స్ పోటీ చేస్తున్నారు. ఆమ్ఆద్మీ పార్టీ తరపున ప్రముఖ కమెడియన్ కరంజీత్ అనుమోల్ బరిలో నిలిచారు. . శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. చదవండి: పాకిస్తాన్‌కు చేతకాకపోతే మేము సిద్ధంగా ఉన్నాం: రాజ్‌నాథ్ సింగ్ -
‘20వేల కోట్ల ఆస్తి.. ముగ్గురికి హక్కు ఉంది’
చండీగఢ్: దివంగత ఫరీద్కోట్ మహారాజాకు చెందిన దాదాపు రూ.20,000 కోట్ల విలువైన ఆస్తిని.. ఆయన కుమార్తెలకు వారసత్వంగా మంజూరు చేస్తు హర్యానా హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీనిలో మణిమజ్రా కోట, సిమ్లా మషోబ్రాలోని ఆస్తులు, బ్యాంక్ డిపాజిట్లు, ఆభరణాలు, పాతకాలపు కార్లు, ఢిల్లీ ఇండియా గేట్ సమీపంలోని కోపర్నికస్ మార్గ్ వద్ద ఉన్న ఫరీద్కోట్ హౌస్ ఉన్నాయి. కుమార్తెలు రాజ్‌కుమారి అమృత్ కౌర్, దీపిందర్ కౌర్ ఇద్దరికీ ఈ ఆస్తిలో 75 శాతం వాటా లభిస్తుందని కోర్టు తెలిపింది. మిగిలిన 25 శాతం వాటా వారి తల్లి మహారాణి మహీందర్ కౌర్‌కు చెందుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్ రాజ్‌మోహన్ సింగ్ తన 547 పేజీల తీర్పులో ఇద్దరు కుమార్తెల హక్కులను సమర్థించారు. మహారావల్ కేవాజీ ట్రస్ట్, దీపిందర్ కౌర్ చేసిన విజ్ఞప్తులను తోసిపుచ్చారు.అంతేకాక ఫరీద్కోట్ పాలకుడు రాజా హరీందర్ సింగ్ బ్రార్ మరణించినప్పుడు మహారాణి మహేంద్ర కౌర్ సజీవంగా ఉన్నారని.. ఆమెకు కూడా ఆస్తిలో వాటా ఉంటుందని కోర్టు తెలిపింది. అయితే ప్రస్తుతం మహారాణి మహీందర్ కౌర్, ఆమె కుమార్తె దీపిందర్ కౌర్ ఇద్దరూ మరణించారు. దాంతో ఈ ఇద్దరి వాటాలు వారి చట్టపరమైన వారసులకు వెళ్తాయని కోర్టు తెలిపింది. ఇప్పటివరకు ఆస్తులను నిర్వహిస్తున్న మహారావల్ ఖేవాజీ ట్రస్ట్ చట్టవిరుద్ధమని ప్రకటించిన దిగువ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. దిగువ కోర్టు 2013 జూలై 25న తన తీర్పులో.. దివంగత తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్న అమృత్ కౌర్‌కు వారసత్వాన్ని ఇచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని దీపిందర్ కౌర్ పై కోర్టులో సవాలు చేశారు. దీన్ని కోర్టు 2018లోనే కొట్టివేసింది. ఫరీద్కోట్ వివాదం... 1918 లో మూడేళ్ళ వయసులో పాలకుడిగా పట్టాభిషేకం పొందిన హరీందర్ ఫరీద్కోట్ ఎస్టేట్ చివరి పాలకుడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు... అమృత్ కౌర్, దీపిందర్ కౌర్ , మహిపీందర్ కౌర్ కాగా ఒక కుమారుడు హర్మహిందర్ సింగ్ ఉన్నారు. కొడుకు 1981 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఏడుగురు సిక్కు రాచరికపు మహారాజులలో ఒకరైన హరీందర్ 1989లో మరణించాడు. చనిపోయేనాటికి ఆయనకు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్,ఢిల్లీ, హర్యానా మరియు చంఢీగడ్‌లో ఎన్నో విలువైన ఆస్తులు ఉన్నాయి. అక్టోబర్ 1989 లో మహారాజా మరణించిన తర్వాత ఈ ఆస్తి వివాదం ప్రారంభమైంది. హరీందర్ కౌర్ మరణించిన తర్వాత ఓ విల్లు వెలుగులోకి వచ్చింది. ఈ విల్లును 1982లో రాసినట్లు దానిలో ఉంది. మహారాజా తన ఆస్తులను మహర్వాల్ ఖేవాజీ ట్రస్ట్‌కు ఇచ్చినట్లు విల్లు పేర్కొంది. అంతేకాక కుమార్తె దీపిందర్ కౌర్ అధ్వర్యంలో ఈ ట్రస్ట్ నడుస్తుంది. మూడవ కుమార్తె ఈ ట్రస్టుకు ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. రెండవ కుమార్తె అయిన అమృత్ కౌర్ 1952లో తండ్రికి ఇష్టం లేని వ్యక్తిని వివాహం చేసుకోవడంతో ఆమెకు ఈ ఆస్తిలో వాటాలేదని మహారాజా ప్రకటించారు. అయితే మహారాజు చనిపోయిన తర్వాత అమృత్ కౌర్ ఎస్టేట్ యాక్ట్, 1948 ఆధారంగా మొత్తం ఎస్టేట్ మీద దావా వేశారు. విల్లు నకిలీదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగానే మహారాజా మూడవ కుమార్తె మహిపీందర్ కౌర్ 2001లో కన్యగానే మరణించారు. మరో రెండు పిటిషన్లు.. అమృత్ కౌర్ మాదిరిగానే మహారాజా హరీందర్ సింగ్ సోదరుడు మంజిత్ ఇందర్ సింగ్ కుమారుడు భరతీందర్ సింగ్ జేష్ఠత్వ నియమాన్ని పేర్కొంటూ ఆస్తిపై తనకు హక్కు కల్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు. తండ్రి రాసిన విల్లు ఆధారంగా తనకు ఆస్తిలో వాటా దక్కాలని దీపిందర్ కౌర్ దావా వేశారు. అయితే ఈ వివాదం నడుస్తుండగానే దీపిందర్ కౌర్ మరణించారు. ఈ వివాదానికికి సంబంధించి 2018లోనే హర్యానా హై కోర్టు ట్రస్టు పాత్ర శూన్యమని ప్రకటించి కుమార్తెలకు ఆస్తిని ఇవ్వమని పేర్కొంది. నేడు జస్టిస్ రాజ్‌మోహన్ సింగ్ 30ఏళ్ల ఈ వివాదానికి తుది తీర్పు ఇచ్చారు. హిందూ వారసత్వ చట్టం ప్రకారం రాజా హరీందర్ సింగ్ ఆస్తిలో ఆయన ఇద్దరు కుమార్తెలు అమృత్ కౌర్, దీపిందర్ కౌర్‌లతో పాటు మహారాణికి వాటా ఉంటుందని కోర్టు తెలిపింది. ఆస్తిని స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో ట్రస్ట్ ధర్మకర్తలు కుట్ర పన్నారని.. నకిలీ విల్లును సృష్టించారని కోర్టు వెల్లడించింది. -
పంజాబ్‌లో టెన్షన్.. టెన్షన్
-
పంజాబ్‌లో టెన్షన్.. టెన్షన్
ఫరిద్కోట్: పంజాబ్‌లోని ఫరిద్ కోట్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు వ్యక్తులు తమ దైవాన్ని దూషించారటూ, దానికి వ్యతిరేకంగా కొందరు సిక్కులు నిర్వహించిన ర్యాలీ టెన్షన్ వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. వీరిని అడ్డుకుని, శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు భారీ సంఖ్యలో పోలీసులు అక్కడి చేరుకోగా ఘర్షణలు మరింత మించిపోయాయి. పరస్పర దాడులు జరగడంతో మొత్తం 17మందికిపైగా గాయాలపాలయ్యారు. వారిలో పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు లాఠీఛార్జి జరపి, భాష్పవాయుగోళాలను, జలఫిరంగులను ప్రయోగించి చివరకు రెండు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉన్నా అక్కడి వాతావరణం మాత్రం గంభీరంగా తయారైంది. ప్రజలంతా శాంతితో సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ విజ్ఞప్తి చేశారు.