మాజీ సీఎం మనవడి ఆత్మహత్య
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడు హర్‌కీరత్ సింగ్ (41) ఆత్మహత్య చేసుకున్నాడు. లైసెన్సుడు పిస్టల్‌తో తలలో కాల్చుకుని అతడు చనిపోయినట్లు తెలుస్తోంది. తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్నందువల్లే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. హర్‌కీరత్ సింగ్ తమ గ్రామానికి సర్పంచ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
ఆయన 1995 నుంచి డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నారని, గత సంవత్సరం ఒక ప్రమాదానికి గురై, రెండు నెలల క్రితమే కోమాలోంచి బయటకు వచ్చారని ఆయన సమీప బంధువు, లూధియానా ఎంపీ రవ్‌నీత్ బిట్టు తెలిపారు. హర్‌కీరత్ అన్న గుర్‌కీరత్ ఖానా నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆయన తండ్రి తేజ్‌ప్రకాష్ 1990లలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు.
హర్‌కీరత్ ఆత్మహత్య చేసుకునే సమయానికి ఆయన భార్య ఇంట్లోనే ఉన్నారు. వీళ్లు చండీగఢ్‌లోని ప్రభుత్వ క్వార్టర్‌లో నివసిస్తారు. 1995లో బియాంత్ సింగ్ హత్యకు గురికావడంతో ఆ తర్వాతి నుంచి చాలామందికి పోలీసు భద్రత ఉంది. ఎంపీ బిట్టుకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది.