మాజీ సీఎం హత్య కేసులో 'సూత్రధారి' అరెస్ట్ | Beant Singh's assassin Jagtar Singh 'Tara' arrested in Thailand | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం హత్య కేసులో 'సూత్రధారి' అరెస్ట్

Published Tue, Jan 6 2015 11:02 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

మాజీ సీఎం హత్య కేసులో 'సూత్రధారి' అరెస్ట్ - Sakshi

మాజీ సీఎం హత్య కేసులో 'సూత్రధారి' అరెస్ట్

థాయ్లాండ్: పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ హత్య కేసులో కీలక సూత్రధారి జాగ్తర్ సింగ్ (తారా)ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. థాయ్లాండ్లో మంగళవారం తారాను పోలీసులు అరెస్ట్ చేశారు. 1995, ఆగస్టు 31న పంజాబ్ సెక్రటేరియట్ వద్ద బియాంత్ సింగ్ దారుణ హత్యకు గురైయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయి వద్ద మానవ బాంబు ఆత్మహుతికి పాల్పడింది. ఈ ఘటనలో మరో 17 మంది మరణించారు. ఈ ఘాతుకం ఖలీస్థాన్ వేర్పాటువాదుల పనే అని భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.

దాంతో ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ జాగ్తర్ సింగ్ (తారా) ఈ ఘటనకు అసలు సూత్రధారి అని పోలీసుల దర్యాప్తులో తెలింది. దాంతో అతడితోపాటు మరో ముగ్గురు హవరా, బెహోరా, దేవ్ సింగ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని చంఢీఘడ్లోని బురైల్ జైలుకు తరలించారు. అయితే 2004లో వారు ఆ జైలు నుంచి బయటకు సొరంగం తొవ్వి  దీని ద్వారా  తప్పించుకున్నారు. అనంతరం వారు నేపాల్ పారిపోయారు. పోలీసులు హవరా, బెహెరాలను నేపాల్లో అరెస్ట్ చేశారు.

తారా, దేవి సింగ్లు మాత్రం పాక్లో ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. కాగా తారా పాక్ నుంచి థాయ్లాండ్ వెళ్లి నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దాంతో పోలీసులు థాయ్ లాండ్ పోలీసుల సాయం కోరారు. దాంతో అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దీంతో మంగళవారం తారా పోలీసులకు చిక్కాడు. అతడిని భారత్ కు తరలించేందుకు థాయ్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. మరో నిందితుడు దేవ్ సింగ్ ఇంకా పాక్లో ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అయితే తారాకు పాక్ ఐఎస్ఐ అండదండలు అందిస్తుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement