న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో నేరస్తుడు, సిక్కు తీవ్రవాది జగ్తార్ సింగ్ తారాను థాయ్‌లాండ్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించింది. 1995 ఆగస్టు 31న చండీగఢ్ సచివాలయ సముదాయంలో జరిగిన అత్మాహుతి దాడిలో బబ్బర్ ఖల్సా అంతర్జాతీయ తీవ్రవాద సంస్థకు చెందిన తారాకు జీవిత ఖైదు శిక్ష పడింది. 2004లో బురైల్ జైలు నుం తప్పించుకున్నాడు. మారుపేరుతో థాయ్‌లాండ్‌లో జీవిస్తున్న అతన్ని జనవరి 5న అక్కడి పోలీసులు అరెస్టు చేసి భారత్‌కు అప్పగించారు.