కర్ణుడిగా అర్జునుడు! | Director Naganna Kurukshetra movie | Sakshi
Sakshi News home page

కర్ణుడిగా అర్జునుడు!

Published Sun, Feb 4 2018 1:15 AM | Last Updated on Sun, Feb 4 2018 1:15 AM

Director Naganna Kurukshetra movie - Sakshi

అర్జున్‌

వెండితెర కర్ణుడిగా ఎన్టీఆర్, జెమినీ గణేశన్‌... ఇలా ఎందరో గొప్ప నటులు నటించారు. రీసెంట్‌గా హీరో విక్రమ్‌ కూడా ఈ క్లబ్‌లో చేరారు. ఇప్పుడు యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ‘కురుక్షేత్ర’లో కర్ణుడి పాత్రలో కనిపించబోతున్నారు.

నాగన్న దర్శకత్వంలో దర్శన్, అంబరీష్, వి. రవిచంద్రన్, అర్జున్, నిఖిల్‌ కుమార్, హరిప్రియ ముఖ్య తారలుగా మహాభారతం బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. కన్నడ ప్రముఖ రచయిత రానా రాసిన ‘గదాయుధ’ బుక్‌ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా కౌరవరాజు దుర్యోధనుడి పాత్ర చుట్టూ సినిమా సాగుతుందని సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది  రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement