బాహుబలి సినిమా ఘనవిజయం సాధించటంతో ఇతర భాషల్లోనూ భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించేందుకు దర్మక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా జానపద పౌరాణిక చిత్రాలను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే బాటలో కన్నడ నాట తెరకెక్కిన భారీ పౌరాణిక గాథ కురుక్షేత్రం. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమాను వృషభాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై మునిరత్న నిర్మిస్తున్నారు. భారీ తారగణం, సెట్స్, గ్రాఫిక్స్ రూపొందుతున్న ఈ సినిమాకు నాగన్న దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. కురుక్షేత్ర సంగ్రామానికి భీజం వేసిన ఘటనల నేపథ్యంలో ఈ ట్రైలర్‌ను రూపొందించారు. దివంగత నటుడు అంభరీష్ భీష్ముడిగా నటించిన ఈ సినిమాలో దర‍్షన్ దుర్యోధనుడిగా కనిపించాడు. కర్ణుడిగా అర్జున్, ధర్మరాజుగా శశి కుమార్, ద్రౌపదిగా స్నేహా, అర్జునుడిగా సోనూసూద్, అభిమన్యుడిగా నిఖిల్, శకునిగా రవికుమార్, కృష్ణుడిగా రవిచంద్రన్‌లు నటించారు.
Comments
Please login to add a commentAdd a comment