Kurukshetram
-
ఈ కడుపుకోత ఇంకో తల్లికెందుకు!
కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. శిబిరాలు వేసి ఉన్నారు. ఉప పాండవులు యుద్ధభూమికి వెళ్ళలేదు. చిన్న పిల్లలు. గాఢనిద్రలో ఉన్నారు. అశ్వత్థామకు ఉన్మాదం కలిగింది. తొడలు విరిగిపోయి పడి ఉన్న దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి ‘నీ పగను నేను చల్లారుస్తా’ అన్నాడు. పాండవులమీదికి యుద్ధానికి వెళ్లడం ఎలా! రాత్రివేళ ఆలోచిస్తూ కూర్చున్నాడు. అకస్మాత్తుగా ఎక్కడినుంచో ఒక గుడ్లగూబ వచ్చి చెట్టుమీద ఉన్న ఒక పక్షి గూట్లో పెట్టిన పిల్లలను తన వాడి ముక్కుతో చీల్చి చెండాడేసింది. అది చూసిన అశ్వత్థామ పిచ్చెక్కిన వాడిలా అయిపోయాడు. శిబిరం మీద పడిపోయి నిద్రపోతున్న ధృష్టద్యుమ్నుడి కంఠాన్ని తుంచేసాడు. ఏనుగుల కుంభస్థలాలు బేధించాడు. గుర్రాల్ని చంపేసాడు. ఐదుగురు ఉపపాండవుల కుత్తుకలు కత్తిరించేసాడు. ఇన్నీ చేసాక అర్జునుడు గుర్తొచ్చాడు. ఐదుగురి కొడుకులను చంపానని తెలిస్తే నన్ను బతకనీయడనుకుని పారిపోయాడు. మరునాడు ద్రౌపదీ దేవి ఏడుస్తున్నది. పాండవులు తిరిగొచ్చారు. అంతకన్నా కష్టం లోకంలో మరొకటి ఉంటుందా ఏ స్త్రీకయినా! ముందు ఐదుగురి శవాలు పెట్టుకుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది.. ‘నీ కొడుకులను తెగటార్చిన వాడిని పట్టి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పారేస్తా, నీ ఇష్టమొచ్చినట్లు శిక్షించు’ అన్నాడు అర్జునుడు. అన్నట్లే అశ్వత్థామను పశువును కట్టినట్లు కట్టి తీసుకొచ్చి ద్రౌపది ముందు పడేసాడు. వీడే నీ పుత్రులను చంపినవాడు, నీ కాలుతో వీడి తల తన్ను– అన్నాడు. ద్రౌపదీదేవి అశ్వత్థామ దగ్గరకు వెళ్లి–అయ్యా! నా కొడుకులు యుద్ధభూమికి రాలేదు.కవచం కట్టుకోలేదు. ఏ అస్త్ర ప్రయోగం చేయలేదు. అటువంటి పిల్లలు నిద్రపోతున్న వేళ రాత్రికి రాత్రి కబళించేసావా? నీకు చేతులెలా ఆడాయి?’ అంది. ఐదుగురు భర్తలు నిలబడి ఉన్నారు. ఆవేశంతో ఊగిపోతున్నారు. ఊ.. అంటే చాలు భీమసేనుడు అశ్వత్థామ తలను వేయి వక్కలు చేసేస్తాడు. కానీ ఆ క్లిష్ట సమయంలో ఆవిడ ఏమన్నదో తెలుసా...‘కొడుకులు చచ్చిపోయి నేను ఏడుస్తున్నా. ద్రోణాచార్యుల వారితో కలిసి సహగమనం చేయకుండా ద్రోణుడి భార్య ఉన్న ఒక్క కొడుకు కోసమని ఇంటిదగ్గరుంది. ఆమె కొడుకు చచ్చిపోలేదు. నా ఐదుగురు బిడ్డల్ని చంపేసాడనే కోపంతో పాండవులు అశ్వత్థామను ఎక్కడ చిత్రవధ చేసేస్తారన్న భయంతో ఎంత ఏడుస్తోందో! గురుపత్ని ఏడుపు మన వృద్ధికి ప్రతిబంధకం కాకూడదు. వీడిని మనం చంపకూడదు. వీడు చేసిన తప్పు వీడినే కాల్చేస్తుంది. నేను పడుతున్న బాధ నాకు తెలుసు. వేరొక తల్లి ఎందుకు పడాలి. వదిలిపెట్టేయండి’’ అన్నది. అంత గొప్పగా మాట్లాడడం, ధర్మానికి కట్టుబడడం తెలిసిన మహాతల్లులు పుట్టిన జాతి ప్రపంచంలో ఎక్కడయినా ఉంటే–అది సనాతన ధర్మంలో మాత్రమే. -
ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం
‘‘మా ‘కురుక్షేత్రం’ చిత్రాన్ని కొందరు ‘దానవీరశూరకర్ణ’ చిత్రంతో పోలుస్తున్నారు. ఆ సినిమా ఒకేసారి పుట్టింది. ఇక రాదు. కానీ ‘బాహుబలి’ లాంటి సినిమాలు చేయొచ్చు’’ అన్నారు నిర్మాత మునిరత్న. మహాభారతాన్ని తొలిసారి ఇండియన్ స్క్రీన్ మీద త్రీడీలో ‘కురుక్షేత్రం’ పేరుతో తెరకెక్కించారు. ఇందులో దుర్యోధనుడిగా కన్నడ హీరో దర్శన్, కర్ణుడిగా అర్జున్, అర్జునుడిగా సోనూ సూద్, అభిమన్యుడిగా నిఖిల్ గౌడ, భీష్ముడిగా అంబరీష్ నటించారు. రాక్‌లైన్ వెంకటేశ్ సమర్పణలో కథను అందించడంతో పాటు మునిరత్న ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగన్న దర్శకుడు. ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం తెలుగు ట్రైలర్ రిలీజ్ వేడుకలో నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘భారతాన్ని త్రీడీలో తీయాలనుకున్నాను. ఈ సినిమా రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ప్రస్తుత తరానికి మహాభారతాన్ని తెలియజేయడానికి ఈ సినిమా చేశాం’’ అన్నారు మునిరత్న. ‘‘ఈ చిత్రాన్ని త్రీడీలో తెరకెక్కించినందుకు నిర్మాతలకు కృతజ్ఙతలు’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘దేశంలో మొట్టమొదటి త్రీడీ మైథాలజీ సినిమా ఇది. ‘కురుక్షేత్రం’ పండగలా ఉంటుంది’’ అన్నారు నాగన్న. ‘‘1970–2019 వరకూ ఉన్న గొప్ప యాక్టర్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారు. ఈ చిత్రం తప్పకుండా భారతంలోని పాత్రలన్నీ పరిచయం చేస్తుంది’’ అన్నారు దర్శన్. ‘‘చారిత్రాత్మక చిత్రంలో నటించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు అర్జున్. ‘‘ఇలాంటి సినిమాకు సమర్పకుడిగా ఉండటం సంతోషం. తెలుగులో రిలీజ్ చేయడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు రాక్‌లైన్ వెంకటేశ్. ‘‘ఈ సినిమాలో మాటలు, పాట లు రాసే అవకాశం కల్పించిన దర్శక–నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అన్నారు వెన్నెలకంటి. ‘‘నటుడిగా ఈ సినిమా ఓ మంచి అనుభూతి’’ అన్నారు సోనూ సూద్. -
తొలి పౌరాణిక 3డీ చిత్రం ‘కురుక్షేత్రం’
బాహుబలి సినిమా ఘనవిజయం సాధించటంతో ఇతర భాషల్లోనూ భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించేందుకు దర్మక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా జానపద పౌరాణిక చిత్రాలను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే బాటలో కన్నడ నాట తెరకెక్కిన భారీ పౌరాణిక గాథ కురుక్షేత్రం. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను వృషభాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై మునిరత్న నిర్మిస్తున్నారు. భారీ తారగణం, సెట్స్, గ్రాఫిక్స్ రూపొందుతున్న ఈ సినిమాకు నాగన్న దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. కురుక్షేత్ర సంగ్రామానికి భీజం వేసిన ఘటనల నేపథ్యంలో ఈ ట్రైలర్‌ను రూపొందించారు. దివంగత నటుడు అంభరీష్ భీష్ముడిగా నటించిన ఈ సినిమాలో దర్షన్ దుర్యోధనుడిగా కనిపించాడు. కర్ణుడిగా అర్జున్, ధర్మరాజుగా శశి కుమార్, ద్రౌపదిగా స్నేహా, అర్జునుడిగా సోనూసూద్, అభిమన్యుడిగా నిఖిల్, శకునిగా రవికుమార్, కృష్ణుడిగా రవిచంద్రన్‌లు నటించారు. -
కురుక్షేత్రం 10th May 2019
-
కురుక్షేత్రం 8th May 2019
-
కురుక్షేత్రం 4th May 2019
-
కురుక్షేత్రం 30th April 2019
-
కురుక్షేత్రం 17th April 2019
-
కురుక్షేత్రం 15th April 2019
-
కురుక్షేత్రం 12th April 2019
-
కురుక్షేత్రం 2nd April 2019
-
కురుక్షేత్రం 1st April 2019
-
కురుక్షేత్రం 13th March 2019
-
కురుక్షేత్రం 11th March 2019
-
కురుక్షేత్రం 6th March 2019
-
కురుక్షేత్రం 23rd February 2019
-
కురుక్షేత్రం 22nd February 2019
-
కురుక్షేత్రం 21st February 2019
-
కురుక్షేత్రం
-
నా టాప్ టెన్ మూవీస్‌లో ‘కురుక్షేత్రం’ ఒకటి
‘‘35 సంవత్సరాల సినీ కెరీర్లో ఎంతో మంది దర్శక–నిర్మాతలతో పనిచేశా. స్థిరంగా కష్టపడుతూ వస్తే దాని ఫలితం తప్పకుండా ఉంటుంది. ‘కురుక్షేత్రం’ నా 150వ సినిమా. నేను నటించిన టాప్ టెన్ మూవీస్‌లో ఇదొకటిగా నిలుస్తుంది. ఈ చిత్రంలో రియాలిటీకి దగ్గరగా ఉండే పోలీస్ పాత్ర చేశా. మంచి సినిమాలను ప్రోత్సహించే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని అర్జున్ అన్నారు. అర్జున్ హీరోగా అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కురుక్షేత్రం’. ప్యాషన్ స్టూడియోస్ సమర్పణలో శ్రీనివాస్ మీసాల ఈ చిత్రాన్ని ఈ నెల 13న విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో అరుణ్ వైద్యనాథన్ మాట్లాడుతూ– ‘‘తమిళంలో మంచి విజయం సాధించిన ‘నిబునన్’ చిత్రాన్ని సాయిక్రిష్ణ, మీసాల శ్రీనివాస్‌గారు తెలుగులో విడుదల చేస్తున్నందుకు నా కృతజ్ఞతలు. అర్జున్‌గారు డైరెక్టర్స్ యాక్టర్. 150 సినిమాలు చేసినా ఎక్కడా గర్వం లేకుండా డౌన్ టు ఎర్త్ పర్సన్‌లా ఉంటారు. ప్రసన్న, వరలక్ష్మి, చందన అద్భుతంగా నటించారు’’ అన్నారు. ‘‘అర్జున్‌గారి 150వ సినిమా ‘కురుక్షేత్రం’ను మా బ్యానర్లో విడుదల చేయడం గర్వంగా ఉంది’’ అన్నారు ప్యాషన్ స్టూడియోస్ అధినేత ఉమేష్ రెడ్డి. ‘‘దండుపాళ్యం 3’ సినిమా తర్వాత మేం తెలుగులో విడుదల చేస్తున్న చిత్రం ‘కురుక్షేత్రం’’ అన్నారు మీసాల శ్రీనివాస్. ‘‘అర్జున్ అంటే నాకు ఎంతో అభిమానం. మంచి మనిషి. మా అందరికీ ఎంతో స్ఫూర్తి. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు హీరో శ్రీకాంత్. నిర్మాతలు తమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయికృష్ణ పాల్గొన్నారు. -
‘కురుక్షేత్రం’ ప్రీ రిలీజ్ వేడుక
-
చవితికి కురుక్షేత్రం
యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన 150వ సినిమా ‘కురుక్షేత్రం’. అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ నిర్మించారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘నిబునన్’ చిత్రాన్నే శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్‌పై శ్రీనివాస్ మీసాల వినాయక చవితి సందర్భంగా ఈ నెల 13న ‘కురుక్షేత్రం’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. అరుణ్ వైద్యనాథన్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. నాకు తెలుగు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అందుకే.. తెలుగు రిలీజ్ కోసం ఆత్రుతగా ఉన్నా’’ అన్నారు. ‘‘దాదాపు 200కు పైగా థియేటర్స్‌లో మా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. అర్జున్ 150వ సినిమాని మా బ్యానర్లో రిలీజ్ చేయడం హ్యాపీ’’ అన్నారు మీసాల శ్రీనివాస్. ‘‘అర్జున్ సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించేవన్నీ ‘కురుక్షేత్రం’లో ఉంటాయి. ఈ చిత్రం తెలుగులో మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సహ నిర్మాత సాయికృష్ణ పెండ్యాల. -
ఊహించలేం!
యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన 150వ చిత్రం ‘కురుక్షేత్రం’. అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మీసాల ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. శ్రీనివాస్ మీసాల మాట్లాడుతూ– ‘‘అర్జున్ ఒక భిన్నమైన పోలీసాధికారిగా ఈ చిత్రంలో కనిపిస్తారు. ఊహించని మలుపులు, ఆసక్తికరమైన కథనంతో ప్రేక్షకుల ఆలోచనలకు అందని థ్రిల్లర్‌గా ఈ సినిమా అలరించనుంది. హీరో నాని రిలీజ్ చేసిన ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మోహన్‌లాల్ వంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసిన అరుణ్ వైద్యనాథన్ ‘కురుక్షేత్రం’ సినిమాని ఆసక్తిగా మలిచారు. ఇటీవలే సెన్సార్ పూర్తయింది. వినాయక చవితి సందర్భంగా సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: సాయికృష్ణ పెండ్యాల. -
‘కురుక్షేత్రం’ మూవీస్టిల్స్
-
నాని చేతుల మీదుగా ‘కురుక్షేత్రం’...
యాక్షన్ కింగ్ అర్జున్ 150వ చిత్రంగా తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ కురుక్షేత్రం. అర్జున్ సోలో హీరోగా సక్సెస్ చూసి చాలా కాలమైంది. ప్రస్తుతం ఎక్కువగా సహాయ పాత్రలు చేస్తున్న అర్జున్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విలన్‌గా బిజీగా ఉన్నారు. మళ్లీ సోలో హీరోగా ట్రై చేస్తోన్న చిత్రం కురుక్షేత్రం. ఇటీవల అభిమన్యుడు సినిమాలో నెగెటివ్ రోల్ చేసి ప్రశంసలు అందుకున్నారు అర్జున్. ఈ సినిమా సక్సెస్‌లో అర్జున్ నటన ముఖ్య పాత్ర పోషించింది. అర్జున్ హీరోగా నటిస్తోన్న కురుక్షేత్రం సినిమా ట్రైలర్‌ను రేపు (జూన్ 27) సాయంత్రం నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే విడుదలకానుంది.