అర్జున్
యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన 150వ చిత్రం ‘కురుక్షేత్రం’. అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మీసాల ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. శ్రీనివాస్ మీసాల మాట్లాడుతూ– ‘‘అర్జున్ ఒక భిన్నమైన పోలీసాధికారిగా ఈ చిత్రంలో కనిపిస్తారు. ఊహించని మలుపులు, ఆసక్తికరమైన కథనంతో ప్రేక్షకుల ఆలోచనలకు అందని థ్రిల్లర్‌గా ఈ సినిమా అలరించనుంది. హీరో నాని రిలీజ్ చేసిన ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మోహన్‌లాల్ వంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసిన అరుణ్ వైద్యనాథన్ ‘కురుక్షేత్రం’ సినిమాని ఆసక్తిగా మలిచారు. ఇటీవలే సెన్సార్ పూర్తయింది. వినాయక చవితి సందర్భంగా సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: సాయికృష్ణ పెండ్యాల.
Comments
Please login to add a commentAdd a comment