
యాక్షన్‌కింగ్‌గా అభిమానులను అలరించిన హీరో అర్జున్.. ఆయన కూతురు నటి ఐశ్వర్య వివాహబంధంలో అడుగుపెట్టబోతుంది. సినీ దర్శకుడు, నటుడు తంబిరామయ్య కుమారుడు, నటుడు ఉమాపతితో ఆమె వివాహం జరగనుంది. ఈ వేడుక జూన్‌లో చెన్నైలో జరగనుంది. వీరి వివాహ నిశ్చితార్థం గత ఏడాది అక్టోబర్ 28వ తేదీన జరిగింది.

కాగా ఉమాపతి, ఐశ్వర్యల వివాహ వేడుకను ఘనంగా నిర్వహించడానికి అర్జున్, తంబిరామయ్య కుంటుంబాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. వివాహ వేడుకను జూన్ 10న చెన్నై, గిరకంబాక్కంలో నటుడు అర్జున్‌కు చెందిన తోటలో నిర్విహించ తలపెట్టినట్లు సమాచారం.

ఈ వివాహా వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించే పనిలో అర్జున్, తంబిరామయ్య కుటుంబ సభ్యులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా తాజాగా వీరి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆహ్వన పత్రికను అందించారు. పెద్ద పెట్టెలా ఉన్న ఈ ఆహ్వన పత్రిక అందరినీ ఆకర్షిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment