శాండల్‌వుడ్‌లో కురుక్షేత్ర | Kollywood Big movie kurukshethra Opening | Sakshi
Sakshi News home page

శాండల్‌వుడ్‌లో కురుక్షేత్ర

Published Tue, Aug 8 2017 10:01 AM | Last Updated on Sun, Sep 17 2017 5:19 PM

శాండల్‌వుడ్‌లో కురుక్షేత్ర

శాండల్‌వుడ్‌లో కురుక్షేత్ర

మహాభారత యుద్ధంలో ముఖ్యఘట్టమైన కురుక్షేత్రం పేరుతో కన్నడ సిని మా రాబోతోంది. అది కూడా సాదాసీదా బడ్జెట్, మామూలు నటీనటులతో కాదు. కళ్లుచెదిరే వ్యయం, తారాగణంతో కురుక్షేత్రకు రంగం సిద్ధమైంది. ఆ సినిమా చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే అంటున్నారు నిర్మాత మునిరత్న.

తెలుగు సినిమా రంగంలో భారీ బడ్జెట్‌తో నిర్మించిన బాహుబలి, బాహుబలి–2 సినిమాలు సూపర్‌హిట్‌ కావడం తో.. ఇదే దారిలో కన్నడ సినిమా రంగంలో కూడా భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మాణానికి పునాది పడింది. బెంగళూరుకు చెందిన సినీ నిర్మాత మునిరత్న కురుక్షేత్ర పేరుతో రూ.60 కోట్ల బడ్జెట్‌తో ఈ కన్నడ సినిమా నిర్మిస్తున్నారు. ఆదివారం రాత్రి బెంగళూరు యశ్వంతపురలో ఉన్న ప్రభాకర్‌ కొరే సమావేశం హాల్లో ముహూర్తం షాట్‌ను సీఎం సిద్ధరామయ్య క్లాప్‌కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. ఎంపీ బీ.కే. హరిప్రసాద్‌ కెమెరా స్విచ్‌ ఆన్ చేశారు. ఈ వేడుకల్లో హీరోలు రవిచంద్రన్, దర్శన్తో పాటు రెబల్‌ స్టార్‌ అంబరీష్, నటి హరిప్రియ, ప్రముఖ నటులు అర్జున్ సర్జా, శశికుమార్, రవిశంకర్‌  పాల్గొన్నారు.

దుర్యోధనునిగా హీరో దర్శన్
ఛాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్ దుర్యోధనునిగా నటిస్తున్న ఈ సినిమా నిర్మాణం ఈ నెల 9వ తేదీ నుంచి షూటింగ్‌ ఆరంభమవుతుంది. షూటింగ్‌ మొత్తం హైదరాబాద్‌లోని ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. దీనికోసం 16 సెట్‌లను ఏర్పాటు చేసినట్లు నిర్మాత తెలిపారు. విరామం లేకుండా షూటింగ్‌ పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి ప్రజల ముందుకు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు. సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్‌ను రెడీ చేసినట్లు చెప్పారు. చిత్రం వ్యయం రూ.60 కోట్లుగా చెబుతున్నారు. హీరో దర్శన్కు ఇది 50వ సినిమా కావడం విశేషం. బహుబాష నటి స్నేహ ద్రౌపది పాత్రలో కనిపిస్తారు.

సినిమాలోని ముఖ్య పాత్రలను పోషిస్తున్న నటులు
భీష్ముడు : అంబరీష్‌
కృష్ణుడు : రవిచంద్రన్
కర్ణుడు : అర్జున్
ద్రోణాచార్యుడు : శ్రీనివాసమూర్తి
ధృతరాష్ట్రుడు : శ్రీనాథ్‌
కుంతీదేవి : లక్ష్మి
ధర్మరాజు : శశికుమార్‌
దుశ్శాసనుడు : రవిశంకర్‌
అభిమన్యుడు : నిఖిల్‌కుమార్‌
భీముడు : డ్యానిష్‌
నటి హరిప్రియ ఒక ప్రత్యేక నృత్యగీతంలో అలరించనుంది.
మరికొంతమంది ప్రముఖ నటులూ సినిమాలో నటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement