
ముంబై: సోనూసూద్ ఇప్పుడు సాయానికి మారుపేరు లాగా మారిపోయాడు. ఎవరికి ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తూ వారికి సాయం చేస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులను వారి ఇంటికి పంపించి మానవత్వాన్ని చాటుకున్నాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక రైతుకు ట్రాక్టర్ కొనిచ్చాడు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సాయాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు సోనూసూద్ ఒక విజ్ఞప్తి చేశాడు. ఎవరైనా సాయం చేయగలిగిన వారు ఉంటే ఒక రోగిని దత్తత తీసుకోని వారి వైద్య భారాన్ని అంతా మొత్తం భరించాలని కోరారు. అలా చేస్తే పేదరికం సగం పోతుంది అని చెప్పారు. వీలైనంత మంది సాయం చేయాలని అని సోనూసూద్ కోరారు.
చదవండి: ‘సోనూ సూద్ పీఎస్4 కావాలి ప్లీజ్’
Comments
Please login to add a commentAdd a comment