![Sonu Sood Funny Reaction To A Netizen Who Asked Iphone To His Girl Friend - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/22/sonu.gif.webp?itok=FOGFqVLE)
కరోనా కష్టకాలంలో ఎంతో మందికి తన వంతు సాయమందిస్తూ రియల్ హీరో అయిపోయాడు నటుడు సోనూసూద్. ఎవరు ఏ సాయం కావాలని అడిగినా వెంటనే నేనున్నానంటూ వారికి భరోసా కల్పిస్తున్నాడు. నేటికీ ప్రతిరోజూ వేలమంది సోషల్ మీడియా వేదికగా ఆయన్ను సాయం కోసం ఆశ్రయిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ టైంపాస్ మెసేజ్‌లు చేస్తున్నారు. తాజాగా ఓ యూజర్..'భాయ్.. నా గర్ల్‌ఫ్రెండ్ ఐఫోన్ కొనివ్వమని అడుగుతుంది..మీరు ఏమైనా సహాయం చేస్తారా' అంటూ ట్వీట్ చేశారు.
దీనికి స్పందించిన సోనూసూద్...'అది అవుతుందో లేదో కానీ ఐఫోన్ కొనిస్తే నీ దగ్గర మాత్రం ఏదీ మిగలదు' అంటూ ఫన్నీగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి టైంపాస్ మెసేజ్‌లు ఎందుకు చేస్తారంటూ కొందరు నెటిజన్లు ఆతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, సోనూ భాయ్ భలే ఆన్సర్ ఇచ్చారంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.కాగా గతేడాది లాక్‌డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మిలకు సోనూసూద్ సొంత ఖర్చులతో ఇళ్లకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి ఏ కష్టమొచ్చిన సాయం అందిస్తూ పేదల పాలిట దేవుడిగా మారాడు.
उसका तो पता नहीं,
— sonu sood (@SonuSood) June 22, 2021
अगर iphone दिया तो पर तेरा कुछ नहीं रहेगा😂 https://t.co/t99rnT8z22
చదవండి : కొడుక్కి రూ.3 కోట్ల ఖరీదైన బహుమతి: సోనూసూద్ క్లారిటీ!
హృదయం ముక్కలైంది.. సోనూసూద్ ఎమోషనల్
Comments
Please login to add a commentAdd a comment