తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా అయితే సంక్రాంతి హంగామా నడుస్తోంది. దాదాపు ప్రతిఒక్కరూ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదే టైంలో నాలుగు సినిమాలు కూడా రిలీజయ్యాయి. వీటిలో 'హను-మాన్'కు పూర్తిస్థాయిలో పాజిటివ్ టాక్ వచ్చింది. సరే దీని గురించి కాసేపు పక్కనబెడితే ఈ పండగ టైంలో వచ్చి సెన్సేషనల్ హిట్ సాధించిన మూవీ అంటే అందరికీ గుర్తొచ్చేది 'అరుంధతి'నే. ఇప్పుడు ఈ చిత్రం 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు లీడ్ యాక్టర్స్ రెమ్యునరేషన్ సంగతి కూడా చూసేద్దాం.
సంక్రాంతి పండక్కి సాధారణంగా ఫ్యామిలీ స్టోరీలతో తీసిన సినిమాల్నే రిలీజ్ చేస్తుంటారు. ఇవి కాదంటే యాక్షన్ ఎంటర్‌టైనర్, కామెడీ సినిమాల్ని థియేటర్లలోకి తీసుకొస్తుంటారు. అయితే ఈ పండగ హడావుడిలో చాలా అంటే చాలా అరుదుగా హారర్ మూవీస్ వస్తుంటాయి. అలా వచ్చిన చిత్రమే 'అరుంధతి'.
(ఇదీ చదవండి: Salaar OTT: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?)
తెలుగు సినిమాకు గ్రాఫిక్స్ మాయాజాలాన్ని పరిచయం చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన ఈ చిత్రం విడుదలై నేటికి 15 ఏళ్లు పూర్తయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు నందులు కైవసం చేసుకున్న 'అరుంధతి'.. టాలీవుడ్‌లోనే సరికొత్త రికార్డులు సృష్టించిందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు ఇటుగా రూ.13 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తీస్తే ఏకంగా రూ.70 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయట.
ప్రధాన పాత్రల్లో నటించిన అనుష్క, సోనూసూద్ రెమ్యునరేషన్ గురించి తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. సినిమా తీసే టైంలో అనుష్క కేవలం ఓ హీరోయిన్ అంతే. దీంతో ఈమెని రూ.కోటి లోపే పారితోషికం ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. మరోవైపు విలన్ పశుపతిగా చేసిన సోనూసూద్‌కి అయితే తొలుత రూ.18 లక్షలే అనుకున్నారు. కానీ ఎక్కువ రోజులు వర్క్ చేయడంతో రూ.45 లక్షలు ఇవ్వాల్సి వచ్చిందని టాక్. దీనిబట్టి చూస్తే మరీ రూ.కోటిన్నరలోపే ఇద్దరు లీడ్ యాక్టర్స్ పారితోషికం అంటే చాలా తక్కువనే చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: రూ.100 కోట్ల వసూళ్లు దాటేసిన 'హనుమాన్'.. ఆ విషయమైతే చాలా స్పెషల్)
One and only Lady Super Star of
— Manjula Reddy (@Manju_Anushka) January 15, 2024
South India cinema @MsAnushkaShetty ❤️🔥
Oka horror film tho max andhari hero la highest lepina legendary actress anushka !💥💥#15YearsForAnushkaArundhati
pic.twitter.com/3XI8TGfR9O
Comments
Please login to add a commentAdd a comment