Arundathi
-
టీమిండియాలోకి అరంగేట్రం చేసిన తెలుగు క్రికెటర్
హైదరాబాద్‌కు చెందిన మహిళా క్రికెటర్, తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి టీమిండియాలోకి అరంగేట్రం చేసింది. మహిళల ఐసీసీ వన్డే ఛాంపియన్‌షిప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (జూన్ 19) జరుగుతున్న మ్యాచ్‌తో అరుంధతి వన్డే ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చింది. టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన అరుంధతికి క్యాప్ అందించి టీమ్‌లోకి ఆహ్వానించింది. 2018లోనే టీ20 ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన 26 ఏళ్ల అరుంధతి.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి జాతీయ జట్టులో స్థానం దక్కించుకుంది. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్, రైట్ హాండ్ బ్యాటర్ అయిన అరుంధతి.. తన చివరి టీ20 మ్యాచ్‌ను 2021లో ఆడింది. టీ20ల్లో 26 మ్యాచ్‌ల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన అరుంధతి 18 వికెట్లు తీసి, 73 పరుగులు చేసింది. 𝒀𝒐𝒖 𝒂𝒍𝒘𝒂𝒚𝒔 𝒉𝒂𝒗𝒆 𝒂 𝒍𝒐𝒕 𝒎𝒐𝒓𝒆 𝒕𝒊𝒎𝒆 𝒕𝒉𝒂𝒏 𝒚𝒐𝒖 𝒕𝒉𝒊𝒏𝒌. Arundhati Reddy last played an international game in 2021. Now she is back 'stronger and calmer' for a 2.0 to gleam like first frost, an ODI debut for 🇮🇳. pic.twitter.com/7IWhw3GpfQ— The Bridge (@the_bridge_in) June 19, 2024కాగా, మూడు వన్డేలు, ఒక టెస్ట్, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లలో తొలుత వన్డే సిరీస్ ప్రారంభమైంది. వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 143 పరుగుల భారీ తేడాతో గెలిచింది.బెంగళూరు వేదికగా ఇవాళ జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 17 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. 20 పరుగులు చేసి షఫాలీ వర్మ ఔట్ కాగా.. స్మృతి మంధన (19), దయాలన్ హేమలత (7) క్రీజ్‌లో ఉన్నారు. షఫాలీ వర్మ వికెట్ మ్లాబాకు దక్కింది.తుది జట్లు..భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హేమలత, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రాధ యాదవ్, అశా శోభనదక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ (కెప్టెన్), తజ్మిన్, అన్నెకే, సునే లూస్, మరిజన్నే, నాడిన్ డిక్లెర్క్, షాంగసె, మెయికే డిరిడ్డర్, మసాబట క్లాస్, మ్లాబా, అయబొంగ. -
'ఆజాదీ'కి.. ఓ పర్యాయపదం..
నియంతలకు భయమెప్పుడూయుద్ధమంటేనో, బాంబులంటేనో కాదు..ప్రశ్నలంటే, ప్రశ్నించే శక్తులంటేనే!నాగులు కోరల్లో విషముంచుకుని బుసకొట్టేదిబలముందని కాదు..కాలి చెప్పుల అదుళ్లకు అదిరిన భయంతోనే...అబద్ధాలతో రొమ్మిరిచి నిలబడొచ్చనుకునే వాళ్ళు సత్యం ముందు కురుచనవుతున్నామని తెలిస్తే...కుట్రల చిట్టా పేరుస్తారు నిన్ను చిన్నగా చూపడానికి!సముద్రం తన గర్భాన రేగు అగ్నిపర్వతాల అలజడులను..అగుపడకుండా దాచగలదేమో కానీ బద్దలవకుండా ఆపలేదు!ఎగిసి పడే లావాను అడ్డుకోనూ లేదు!!అరుంధతీ...నీ గొంతెప్పుడూ ఏకాకి కాదు,వేల గొంతులు నినదిస్తాయి ఆజాదీ కోసం..నీ భుజమెప్పుడూ ఒంటరీ కాదు,మా భుజాలను నీ భుజంతో అంటుకడతాం ఆజాదీ కోసం..నీ అడుగులెప్పుడూ ఖాళీగా ఉండవులక్షలాదిగా నీ అడుగుల్లో అడుగులేస్తూ ప్రవహిస్తాం!మానవత్వపు పరిమళాలను పంచే ఆజాదీ కోసం..అరుంధతీ...నీ పేరిపుడు ‘ఆజాదీ’కి..ఓ పర్యాయపదం!– దిలీప్. వి, 8464030808 (హక్కుల గొంతుక అరుంధతీ రాయ్‌కి మద్దతుగా...) -
అరుంధతి @15 ఏళ్లు.. అనుష్క, సోనూసూద్ రెమ్యునరేషన్ అంత తక్కువా?
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా అయితే సంక్రాంతి హంగామా నడుస్తోంది. దాదాపు ప్రతిఒక్కరూ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదే టైంలో నాలుగు సినిమాలు కూడా రిలీజయ్యాయి. వీటిలో 'హను-మాన్'కు పూర్తిస్థాయిలో పాజిటివ్ టాక్ వచ్చింది. సరే దీని గురించి కాసేపు పక్కనబెడితే ఈ పండగ టైంలో వచ్చి సెన్సేషనల్ హిట్ సాధించిన మూవీ అంటే అందరికీ గుర్తొచ్చేది 'అరుంధతి'నే. ఇప్పుడు ఈ చిత్రం 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు లీడ్ యాక్టర్స్ రెమ్యునరేషన్ సంగతి కూడా చూసేద్దాం. సంక్రాంతి పండక్కి సాధారణంగా ఫ్యామిలీ స్టోరీలతో తీసిన సినిమాల్నే రిలీజ్ చేస్తుంటారు. ఇవి కాదంటే యాక్షన్ ఎంటర్టైనర్, కామెడీ సినిమాల్ని థియేటర్లలోకి తీసుకొస్తుంటారు. అయితే ఈ పండగ హడావుడిలో చాలా అంటే చాలా అరుదుగా హారర్ మూవీస్ వస్తుంటాయి. అలా వచ్చిన చిత్రమే 'అరుంధతి'. (ఇదీ చదవండి: Salaar OTT: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?) తెలుగు సినిమాకు గ్రాఫిక్స్ మాయాజాలాన్ని పరిచయం చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన ఈ చిత్రం విడుదలై నేటికి 15 ఏళ్లు పూర్తయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు నందులు కైవసం చేసుకున్న 'అరుంధతి'.. టాలీవుడ్లోనే సరికొత్త రికార్డులు సృష్టించిందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు ఇటుగా రూ.13 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తీస్తే ఏకంగా రూ.70 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయట. ప్రధాన పాత్రల్లో నటించిన అనుష్క, సోనూసూద్ రెమ్యునరేషన్ గురించి తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. సినిమా తీసే టైంలో అనుష్క కేవలం ఓ హీరోయిన్ అంతే. దీంతో ఈమెని రూ.కోటి లోపే పారితోషికం ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. మరోవైపు విలన్ పశుపతిగా చేసిన సోనూసూద్‌కి అయితే తొలుత రూ.18 లక్షలే అనుకున్నారు. కానీ ఎక్కువ రోజులు వర్క్ చేయడంతో రూ.45 లక్షలు ఇవ్వాల్సి వచ్చిందని టాక్. దీనిబట్టి చూస్తే మరీ రూ.కోటిన్నరలోపే ఇద్దరు లీడ్ యాక్టర్స్ పారితోషికం అంటే చాలా తక్కువనే చెప్పొచ్చు. (ఇదీ చదవండి: రూ.100 కోట్ల వసూళ్లు దాటేసిన 'హనుమాన్'.. ఆ విషయమైతే చాలా స్పెషల్) One and only Lady Super Star of South India cinema @MsAnushkaShetty ❤️🔥 Oka horror film tho max andhari hero la highest lepina legendary actress anushka !💥💥#15YearsForAnushkaArundhati pic.twitter.com/3XI8TGfR9O — Manjula Reddy (@Manju_Anushka) January 15, 2024 -
Birthday Special: సూపర్ హీరోయిన్ అనుష్క శెట్టి బర్త్‌డే స్పెషల్
-
కోడి రామకృష్ణ: ‘దిగులుతో మాకు కనపడకుండా ఏడ్చే వారు’
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో దర్శకునిగా తొలి అడుగు వేశారు. తరంగిణిలో రైలు చేత పాట పాడించారు. అమ్మోరులో గ్రాఫిక్స్‌ను పరిచయం చేశారు. అరుంధతిలో జేజమ్మను ప్రతిష్ఠించారు.. మానవ సంబంధాలు, దైవభక్తి, ఆధునిక గ్రాఫిక్స్... అన్నిటినీ తెలుగు వెండి తెర మీద ప్రదర్శించిన కోడి రామకృష్ణ... ఇంటి దగ్గర ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా స్నేహంగా ఉండేవారంటున్నారు కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య.. కోడి నరసింహమూర్తి, చిట్టెమ్మ దంపతులకు పెద్ద కొడుకుగా నాన్న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టారు. నాన్నకు ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. పాలకొల్లు కాలేజీలో బికామ్ డిగ్రీ చదువుకునే రోజుల్లోనే నాటకాలు వేసేవారు. జై ఆంధ్ర ఉద్యమం సమయంలో స్పీచ్‌లు రాసి ఇచ్చేవారట, పెయింటింగ్స్, మంచి మంచి స్కెచ్‌లు కూడా వేసేవారట. నాటకాలు వేయటానికి కావలసిన డబ్బుల కోసం ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా బయటి వాళ్లకు పెయింటింగ్స్ వేసిన సందర్భాలున్నాయని నాన్న చెబుతుండేవారు. పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం అమ్మ వాళ్లది తెనాలి. తాత (ఎ. సుభాష్) గారు సినిమాలు నిర్మించాలనే ఆసక్తితో మద్రాసు వచ్చి, ‘భారత్ బంద్’ చిత్రం నిర్మించారు. అమ్మ పేరు పద్మ. నాన్నగారి ‘రంగుల పులి’ చిత్రంలో ఇష్టం లేకుండానే అమ్మ నటించింది. నాన్నగారు అమ్మను ఇష్టపడ్డారు. ఇద్దరూ వివాహం చేసుకుందామనుకు న్నారు. సన్నిహితులతా కలిసి అమ్మవాళ్ల నాన్నను ఒప్పించారు. నానమ్మకు ఇచ్చిన మాట ప్రకారం, చెల్లెలికి, తమ్ముళ్లకి వివాహం చేసిన తరవాతే 1983లో అమ్మను వివాహం చేసుకున్నారు. తాతగారు పోయాక నాన్నే ఇంటి బాధ్యత తీసుకు న్నారు. నాన్నకు మేం ఇద్దరు ఆడపిల్లలం. చెల్లి పేరు ప్రవల్లిక. నేను బిబిఏ, చెల్లి ఎంబిఏ చేశాం. నేను యానిమేషన్ కూడా చేశాను. నన్ను ‘దీపమ్మా’ అని, చెల్లిని ‘చిన్నీ’ అని పిలిచేవారు. ఇద్దరూ ఆడపిల్లలేనా అని ఎవరైనా అంటే నాన్నకు నచ్చేది కాదు. స్నేహితునిలా ఉండేవారు.. సినిమాలలో పూర్తిగా బిజీగా ఉండటంతో, ఏ మాత్రం అవకాశం వచ్చినా నాన్న మమ్మల్ని బయటకు తీసుకువెళ్లేవారు. ఒక్కోసారి షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాక, మమ్మల్ని కార్లో బీచ్‌కి తీసుకువెళ్లి, ఐస్‌క్రీమ్ కొనిపెట్టేవారు. ఉదయాన్నే షూటింగ్‌కి వెళ్లిపోయేవారు. ఎక్కడ ఉన్నా ఫోన్ చేసేవారు. చాలా స్నేహంగా ఉండేవారు. ఒక్క రోజు కూడా కోప్పడలేదు. నేను నాన్న దగ్గర అసిస్టెంట్‌గా ఉండాలి అని నాన్నతో అన్నప్పుడు, అమ్మ నా పెళ్లి చేసేయమంది. అప్పుడు కూడా నాకు నచ్చినట్లే చేయమన్నారు. ‘తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు’ అని సలహా ఇచ్చేవారు. నాన్నకు ఏదీ షో చేయటం నచ్చదు. అలా ప్రదర్శించటం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయొద్దు అనేవారు. ఎవరో ఏదో అనుకుంటారనే ఆలోచనే ఉండేది కాదు. అమ్మ తన బంధువులకు ఎంతో సహాయం చేస్తుంటే, ఎన్నడూ అమ్మను ప్రశ్నించలేదు. కథ ఎలా ఉంది అని అడిగేవారు.. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకునేవారు. ఔట్‌డోర్ షూటింగ్స్‌కి ఇతర దేశాలకు మమ్మల్ని కూడా తీసుకువెళ్లేవారు. మేం సినిమా చూసి వచ్చాక మమ్మల్ని కథ ఎలా ఉందో చెప్పమనేవారు. ఇల్లు, షూటింగ్ అంతే. పుట్టినరోజుకి మాత్రమే పార్టీ చేసేవారు. ఇంటి భోజనమే ఇష్టపడేవారు. అది కూడా చాలా మితంగా తినేవారు. దాసరిగారితో అనుబంధం... నానమ్మ వాళ్లు నాన్న సినిమాలలోకి వెళ్తానంటే అభ్యంతరం చెప్పలేదు. మద్రాసులో దాసరి గారిని కలిస్తే, ఆయన డిగ్రీ పూర్తి చేసి రమ్మన్నారు. ఆ ప్రకారమే డిగ్రీ పూర్తి చేశాక, దాసరిగారు ఇచ్చిన టెలిగ్రామ్ చూసుకుని మద్రాసు వెళ్లారు. అలా నాన్న సినీ రంగ ప్రవేశం జరిగింది. దాసరిగారు కన్ను మూయటానికి నెల రోజుల ముందు నాన్నకు ఏమనిపించిందో కానీ, రోజూ ఆయన ఇంటికి వెళ్లేవారు. ఆయన పోయినప్పుడు తట్టుకోలేక పోయారు. ఎంత బాధలో ఉన్నా పని మాత్రం మానేసేవారు కాదు. నేను వచ్చేశాను... నా పెళ్లి కుదిరిన తరవాత, నేను అత్తవారింటికి వెళ్లిపోతానన్న దిగులుతో మాకు కనపడకుండా ఏడ్చే వారు. నాన్నను ఓదార్చవలసి వచ్చింది. మా పెళ్లయ్యాక కొంచెం ఆలస్యంగా పుట్టింది పాప. ‘ఆలస్యం చేసుకుంటున్నారెందుకు’ అని అమ్మ అంటున్నా కూడా నాన్న అననిచ్చేవారు కాదు. నాన్నకు బాగోలేదని తెలియగానే బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి వచ్చేశాం. నా డెలివరీ ముందు రోజు నేను వినాలని హనుమాన్ చాలీసా చదివారు. మరుసటి రోజు నాకు డెలివరీ అయ్యేవరకు మంచి నీళ్లు మాత్రమే తాగారట. పసిపాపను చూస్తూనే, మా అమ్మ నరసమ్మ మళ్లీ పుట్టింది అని పాపాయిని ‘చిట్టి నరసమ్మా!’ అని పిలిచారు. భక్తి ఎక్కువ.. నాన్నకు దేవుడి మీద విపరీతమైన భక్తి. దేవుడికి నాన్నకు మధ్య ఎవరు ఏం చెప్పినా వినరు. ఆరు గంటలకు షూటింగ్ అంటే మూడు గంటలకల్లా నిద్ర లేచి, పూజ చేసుకుని పావు గంట ముందే స్పాట్లో ఉండేవారు. ఆసుపత్రిలో ఉండి కూడా, స్నానం చేయించుకుని, పూజ చేసుకున్నాకే టిఫిన్ తినేవారు. వినాయక చవితి రోజున కథ చదువుతుండగా దగ్గు వస్తే, మళ్లీ మొదటి నుంచి చదివేవారు. పూజ అయ్యాక మాతోనే బ్రేక్‌ఫాస్ట్ చేసేవారు. దీపావళి రోజున అందరికీ శుభాకాంక్షలు చెప్పి, నా చేత 100 రూపాయలు ఇప్పించేవారు. ఎక్కడకు వెళ్తున్నా నన్ను ఎదురు రమ్మనేవారు. నా పెళ్లయ్యాక నాతో మాట్లాడటం కోసం మొబైల్ కొన్నారు. అప్పుడు కూడా నిర్మాత గురించే... వేళకు ఆహారం తీసుకోకపోవటం వల్ల నాన్న ఆరోగ్యం దెబ్బ తింది. 2012లో ఒక సినిమా ప్రారంభోత్సవం రోజే నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆపరేషన్ పూర్తయ్యి, స్పృహలోకి వచ్చిన వెంటనే, ‘నిర్మాత ఎలా ఉన్నారు’ అని అడిగారు. మాకు వింతగా అనిపించింది. 104 డిగ్రీల జ్వరంతో కూడా షూటింగ్ చేశారు. నాన్న అంత్యక్రియలు స్వయంగా నేనే చేశాను. కంటిన్యూ చేస్తున్నాను.. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సినిమా నిర్మాణం చేస్తున్నాను. ‘కోడి పిల్లలు’ అని వాట్సాప్ గ్రూప్ పెట్టాను. ఆ గ్రూపులో మేం నలుగురం, నాన్న దగ్గర అసిస్టెంట్స్‌గా పనిచేసినవారు, నాన్న అభిమానులు ఉన్నారు. -
క్రికెట్లో 'అరుంధతీ' నక్షత్రం
సిటీ అమ్మాయి క్రికెట్లో అద్భుతమైన ఘనత సాధించింది. గల్లీ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. విమెన్ టీ20 ప్రపంచకప్‌కు ఎంపికై శెభాష్ అన్పించుకుంది నేరేడ్మెట్ డిఫెన్స్ కాలనీకి చెందిన క్రికెటర్ అరుంధతీరెడ్డి. వచ్చే ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న విమెన్స్ మెగా ఈవెంట్ టీ20 ప్రపంచకప్ కోసం భారత్ జట్టుకు ఆమె ఎంపికైంది. ఈ సందర్భంగా తాను క్రికెటర్‌గా ఎదిగిన తీరు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తదితర అంశాలను ‘సాక్షి’కి వివరించారు. పదేళ్ల వయసులోనే సోదరుడు రోహిత్‌రెడ్డితో కలిసి గల్లీలో క్రికెట్ ఆడింది. ఆమె ఆట తీరు ఎంతో క్రీడాభిమానుల చేత ఔరా అనిపించింది. ప్రత్యేకంగా శిక్షణ ఇస్తే గొప్ప క్రికెటర్ అవుతుందని కుటుంబ సభ్యులు ఆమెను ప్రోత్సహించారు. వాలీబాల్ క్రీడాకారిణి అయిన ఆ యువతి తల్లి.. ఎన్ని ఇబ్బందులెదురైనా సరే కూతురును క్రికెటర్‌గా చూడాలనిగట్టిగా సంకల్పించింది. టీచర్‌గా పని చేస్తూ కూతురుకువెన్నుదన్నుగా నిలిచింది. క్రికెట్‌కు సంబంధించి అన్నీ సమకూర్చింది. ఆర్మీలో చేరాలనుకున్న ఆ యువతి క్రికెట్ ప్రస్థానం అలా మొదలైంది. నిరంతర సాధనతో అంచలంచెలుగాఎదిగింది. పదేళ్ల వయసులో బాల్, బ్యాట్ పట్టిన ఆ బాలిక సరిగా మరో పదేళ్లకే భారత జట్టుకు ఎంపికై అందరి దృష్టినీ ఆకర్షిచింది. తల్లి నమ్మకాన్ని నిలబెట్టింది. పొట్టి క్రికెట్లో ఫాస్ట్‌బౌలర్, ఆల్‌రౌండర్‌గా రాణిస్తోంది నేరేడ్మెట్ డిఫెన్స్ కాలనీకి చెందిన క్రికెటర్ అరుంధతీరెడ్డి. వచ్చే ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న విమెన్స్ మెగా ఈవెంట్ టీ20 ప్రపంచకప్ కోసం భారత్ జట్టుకు ఆమె ఎంపికైంది. ఈ సందర్భంగా తాను క్రికెటర్‌గా ఎదిగిన తీరు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తదితర అంశాలను అరుంధతీరెడ్డి ఇలా చెప్పుకొచ్చింది. నేరేడ్మెట్: పాఠశాలలో చదువుకుంటున్నప్పటినుంచే ఆర్మీలో చేరాలనే కోరిక ఉండేది. అల్వాల్‌లో ఇంటి వద్ద అన్న రోహిత్‌రెడ్డి, స్నేహితులతో కలిసి గల్లీలో క్రికెట్ ఆడేందుకు వెళుతుంటే.. నేనూ వెంట వెళ్లేదాన్ని. అలా వారితో నేను పదేళ్ల వయసులో క్రికెట్ ఆడటం మొదలు పెట్టాను. అక్కడ అన్న స్నేహితులు నా ఆటను చూసి బాగా ఆడుతున్నావని అభినందించారు. ప్రత్యేక శిక్షణ తీసుకుంటే తప్పక క్రికెట్లో రాణిస్తుందని మా అన్నకు వారు సలహా ఇచ్చారు. ఈ విషయంలో ప్రైవేట్ టీచర్‌గా పని చేస్తున్న అమ్మ భాగ్యరెడ్డి నన్నెంతగానో ఎంకరేజ్ చేసింది. 5 గంటలకు నిద్రలేచి..బస్సులో వెళ్లేదాన్ని.. క్రికెట్‌పై ఆసక్తి పెరగటంతో పాటు శిక్షణ తీసుకుంటుండటంతో తెల్లవారుజాము 5గంటలకే నిద్రలేచి.. అల్వాల్ నుంచి బస్సులో సుమారు 9కి.మీ. దూరంలోని క్రికెట్ అకాడమీకి వెళ్లేదాన్ని. అక్కడ ఉదయం 8గంటలకు ప్రాక్టీస్ ముగించుకొని.. స్కూల్ (పికెట్‌లోని కేంద్రీయ విద్యాలయం)కు, తిరిగి సాయంత్రం 4.30 గంటలకు స్కూల్ నుంచి అకాడమీకి వెళ్లి 6.30 వరకు సాధన చేసేదాన్ని. ప్రాక్టీస్ కోసం ఒక్కదాన్నే బస్సుల్లో వెళ్లి వచ్చేదాన్ని. ఇలా శిక్షణ ప్రారంభించిన ఏడాదికి 2009 సంవత్సరంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అండర్– 19, సీనియర్ మహిళల క్రికెట్ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాను. 2008 క్రికెట్అకాడమీలో చేరాను.. నన్ను క్రికెటర్‌గా చేయాలని అమ్మ 2008 సంవత్సరంలో ప్యాట్నీలోని స్పోర్టివ్ క్రికెట్ అకాడమీలో చేర్పించింది. అకాడమీలో చేరి క్రికెట్లో గణేష్ కోచ్ వద్ద శిక్షణ తీసుకున్నాను. టీవీలో క్రికెట్ మ్యాచ్‌లు బాగా చూస్తూ, కోచ్ సలహాలను పాటిస్తూ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ వచ్చాను. పిల్లలనుఒత్తిడికి గురిచేయొద్దు.. క్రికెట్లో రాణించాలనే లక్ష్యంతో శిక్షణ తీసుకుంటున్న పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టొద్దు. వారికి కావాల్సిన స్వేచ్ఛ ఇవ్వాలి. అప్పుడే వారిలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సహజంగా ఆడటానికి ఆస్కారం కలుగుతుంది. అకాడమీలో కోచ్‌లకు అప్పగించి.. తల్లిదండ్రులు కేవలం పిల్లలకు మెంటార్‌గా వ్యవహరిస్తూ సలహాలు, సూచనలు చేయాలి తప్ప.. ఒక మ్యాచ్‌లో బాగా ఆడలేదని పిల్లలను ఇబ్బంది పెడితే వారికి క్రికెట్‌పై ఆసక్తి సన్నగిల్లుతుంది. ‘నేను పదేళ్లకు క్రికెట్ ఆడటం మొదలు పెడితే.. ఇండియా జట్టుకు ఎంపిక కావడానికి మరో పదేళ్లు పట్టింది. అవకాశాల కోసం ఓపికతో ఉండాలి. ప్రతిభ ఉన్నప్పుడు తప్పక అవకాశం వస్తుంది. 2018లో భారత జట్టుకు ఎంపిక.. హెచ్‌సీఏ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ వివిధ టోర్నీలలో ప్రతిభను కనబర్చడంతో 2018 సంవత్సరంలో టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. టీ20 కోసం ఎంపిక చేసిన విమెన్స్ క్రికెట్ జాతీయ జట్టులో చోటు దక్కింది. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వెస్డిండీస్ జట్లతో జరిగిన టీ20 మ్యాచ్‌లో జట్టుకు ప్రాతినిధ్యం వహించి నిలకడగా రాణించాను. వరల్డ్‌కప్ అందించాలన్నదే లక్ష్యం.. జాతీయ జట్టుకు ఎంపిక కావాలని.. అందులోనూ ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలో ఒక్కసారైనా ఆడాలని ప్రతి క్రికెటర్ కోరుకుంటాడు. వచ్చే నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మెగా ఈవెంట్లో జట్టు సభ్యులమంతా సమష్టిగా రాణించి ఇండియాకు వరల్డ్‌కప్ అందించాలన్నదే లక్ష్యం. వరల్డ్ కప్ కన్నా ముందు ఆస్ట్రేలియాలో మొదలవనున్న ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లాండ్ ముక్కోణపు సీరియస్‌కు సన్నద్ధమవుతున్నాను. ముక్కోణపు సిరీస్‌తో పాటు వరల్డ్ కప్ కోసం ప్రత్యేక సాధనపై దృష్టి సారించాను. వారే స్ఫూర్తి.. సీనియర్ విమెన్ క్రికెటర్లు మిథాలీరాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జులన్ గోపాలస్వామితో పాటు భారత జట్టు మాజీ సారథి రాహుల్ ద్రావిడ్ ఆట అంటే ఎంతో ఇష్టం. వికెట్ కీపర్ అవుతుందనుకున్నా క్రికెట్ అకాడమీలో అరుంధతిని చేర్పించినప్పుడు వికెట్ కీపర్ అవుతుందనుకున్నా. ఈ విషయమై అప్పట్లో కోచ్‌కు చెప్పాను. ఆయన నా అభిప్రాయంతో ఏకీభవించలేదు. ఆమె ఆట చూసి.. చెబుతానని కోచ్ చెప్పారు. అకాడమీలో చేరిన తొలిరోజే బౌలింగ్ వేయమని అరుంధతికి బాల్ ఇచ్చారు. తొలిబంతి లైన్ అండ్ లెంథ్‌లో వేయడంతో వికెట్ కీపర్‌గా వద్దు.. అరుంధతి మంచి ఫాస్ట్‌బౌలర్ అవుతుందని కోచ్ చెప్పారు. అలాగే ఫాస్ట్‌బౌలర్‌గా నిలకడగా రాణిస్తోంది. – భాగ్యారెడ్డి, అరుంధతీరెడ్డి తల్లి -
చిన్నప్పటి నుంచి అవే ఊహలే
తమిళసినిమా: అనుష్క అంటే ఒకప్పుడు అందాల నటి మాత్రమే. ఇప్పుడు అందం, అభినయం కలబోసిన జాణ. అలాంటి తార నేను ఊహల్లో జీవించానంటోంది. తన చిన్నతనంలోనే బాహుబలిలో యువరాణిగా ఊహల్లో జీవించేశానని చెప్పుకొచ్చింది. అనుష్క కెరీర్లో అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి వంటి చిత్రాలు మైలురాళ్లుగా నిలిచిపోతాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనుష్కను ఇప్పుడు సాదా సీదా కథా పాత్రల్లో ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. ఈ విషయాన్ని గ్రహించిన స్వీటీ ప్రస్తుతం పాత్రల ఎంపిక విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగానే కొత్త చిత్రాలు అంగీకరించలేదంటున్న అనుష్క తాజాగా ఒక భారీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతోందట. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనుందని సమాచారం. తన సినీ అనుభవం గురించి ఈ బ్యూటీ తెలుపుతూ హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి రాణించగలనని నిరూపించుకున్నానంది. తన విజయాల వెనుకున్నది దర్శకులేనని, మంచి కథాపాత్రల్లో వాళ్లు నటింపజేయడం వల్లే పేరు అని పేర్కొంది. చిన్నవయసులోనే తాను పురాణ, చరిత్ర పుస్తకాలను ఆసక్తిగా చదివేదాన్ననీ, అదే విధంగా కల్పిత కథలను ఎక్కువగా చదివేదానినని చెప్పింది. అలాంటి కథలోని ఒక పాత్రలో తనను ఊహించుకుని జీవించేదానిననీ అంది. అలాంటి ఊహల్లోంచి బయటకు రావడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదనీ, అదో తీయని అనుభవంగా ఉండేదని పేర్కొంది. రాజ్యాలు, కోటలు కూడా తన ఊహల్లో మెదిలేవనీ, అలా తాను మహారాణి ఊహించుకుని జీవించేదాన్నని చెప్పింది. ఆ ఊహలే బాహుబలి లాంటి చిత్రాల్లో నటించడానికి ధైర్యాన్నిచ్చాయని భావిస్తానంది. ఇంకా చెప్పాలంటే బాహుబలి చిత్రం తాను చిన్నవయసులో ఊహించిన విధంగానే అమరిందని చెప్పింది. విజయాల గురించి ఎదురు చూడననీ, బాధ్యతను నిర్వహించు ఫలితాన్ని ఎదురు చూడకు అన్నది తన ఫాలసీ అని పేర్కొంది. -
త్వరలో అనుష్కకు పెళ్లట...!?
అనుకున్న ది తడవుగా ప్రేమ కలగ దు.. కోరుకున్న వెంటనే పెళ్లి జరగదు. దేనికైనా సమయం రావాలి. ఆ శుభ ఘడియలు నటి అనుష్కకు వచ్చినట్టు తెలుస్తోం ది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలెక్కడానికి సిద్ధం అవుతున్నట్లు పరిశ్రమ వర్గాల టాక్. తొలుత టాలీవుడ్, ఆ తర్వాత కోలీవుడ్‌కు పరిచయమైన నటి అనుష్క తొలి రోజుల్లో స్కిన్ షోకు ప్రాధాన్యం ఇచ్చింది. ఆ తర్వాత అరుంధతి లాంటి చిత్రాల్లో అద్భుతమైన అభినయం చాటి నటిగా తానేమిటో నిరూపించుకుంది. ఆపై అభినయం, గ్లామర్ ఈ రెండు అంశాలను బ్యాలెన్స్ చేసుకుంటూ నటిగా ఎదిగింది. ప్రముఖ హీరోయిన్లలో తన స్థానం పదిలపరుచుకుంటోంది. తమిళంలో ఇరండామ్ ఉలగం, తెలుగులో రుద్రమదేవి, బాహుబలి వంటి చారి త్రక కథా చిత్రాల్లో నటిస్తోంది. ఈ బ్యూటీ నూతన చిత్రాలు అంగీకరించడం లేదట. కారణం కల్యాణ ఘడియలు దగ్గర పడడమేనట. అనుష్కకు 31 ఏళ్లు. దీంతో ఆమెకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ఈ బ్యూటీ పై పలు వదంతులు ప్రచారంలో ఉన్నాయి. టాలీవుడ్ నటుడు నాగార్జునతో సన్నిహితంగా ఉంటోందని, ఆర్యతో చెట్టాపట్టాలంటూ ప్రచారం అవుతున్నాయి. వీటికి పుల్‌స్టాప్ పెట్టేలా కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. ఈ కారణంగానే అనుష్క కమల్ సరసన ఉత్తమ విలన్ చిత్రంలో నటించే అవకాశాన్ని అంగీకరించలేదని సమాచారం.