త్వరలో అనుష్కకు పెళ్లట...!? | Wedding bells ring in Anushka's house! | Sakshi
Sakshi News home page

త్వరలో అనుష్కకు పెళ్లట...!?

Published Fri, Oct 11 2013 9:10 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM

త్వరలో అనుష్కకు పెళ్లట...!?

త్వరలో అనుష్కకు పెళ్లట...!?

 అనుకున్న ది తడవుగా ప్రేమ కలగ దు.. కోరుకున్న వెంటనే పెళ్లి జరగదు. దేనికైనా సమయం రావాలి. ఆ శుభ ఘడియలు నటి అనుష్కకు వచ్చినట్టు తెలుస్తోం ది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలెక్కడానికి సిద్ధం అవుతున్నట్లు పరిశ్రమ వర్గాల టాక్. తొలుత టాలీవుడ్, ఆ తర్వాత కోలీవుడ్‌కు పరిచయమైన నటి అనుష్క తొలి రోజుల్లో స్కిన్ షోకు ప్రాధాన్యం ఇచ్చింది. ఆ తర్వాత అరుంధతి లాంటి చిత్రాల్లో అద్భుతమైన అభినయం చాటి నటిగా తానేమిటో నిరూపించుకుంది. ఆపై అభినయం, గ్లామర్ ఈ రెండు అంశాలను బ్యాలెన్స్ చేసుకుంటూ నటిగా ఎదిగింది. ప్రముఖ హీరోయిన్లలో తన స్థానం పదిలపరుచుకుంటోంది.

తమిళంలో ఇరండామ్ ఉలగం, తెలుగులో రుద్రమదేవి, బాహుబలి వంటి చారి త్రక కథా చిత్రాల్లో నటిస్తోంది. ఈ బ్యూటీ నూతన చిత్రాలు అంగీకరించడం లేదట. కారణం కల్యాణ ఘడియలు దగ్గర పడడమేనట. అనుష్కకు 31 ఏళ్లు. దీంతో ఆమెకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ఈ బ్యూటీ పై పలు వదంతులు ప్రచారంలో ఉన్నాయి. టాలీవుడ్ నటుడు నాగార్జునతో సన్నిహితంగా ఉంటోందని, ఆర్యతో చెట్టాపట్టాలంటూ ప్రచారం అవుతున్నాయి. వీటికి పుల్‌స్టాప్ పెట్టేలా కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. ఈ కారణంగానే అనుష్క కమల్ సరసన ఉత్తమ విలన్ చిత్రంలో నటించే అవకాశాన్ని అంగీకరించలేదని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement