anushka marriage
-
‘జేజమ్మ’ అనుష్క పెళ్లి కుదిరిందా?
టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నదట. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తను అనుష్క వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకునే అవకాశముందని వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అనుష్క ‘బాహుబలి: ద కన్‌క్లూజన్’, ‘భాగమతి’ వంటి ప్రతిష్టాత్మక సినిమాల్లో నటిస్తోంది. మంగళూరుకు చెందిన అనుష్క 36 ఏళ్ల వయస్సులో వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నదని ఈ కథనాలు ఉటంకిస్తున్నాయి. నిజానికి అనుష్క పెళ్లి గురించి గతంలో రకరకాల కథనాలు మీడియాలో షికారు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె ఓ టాలీవుడ్ నిర్మాతతో డేటింగ్ చేస్తున్నట్టు కూడా వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అనుష్క పెళ్లి గురించి తాజాగా చక్కర్లు కొడుతున్న కథనాలు ఎంతవరకు నిజమన్నది ధ్రువీకరించలేమని టాలీవుడ్ పరిశీలకులు అంటున్నారు. దక్షిణాదిలో కథానాయికగా ఒక వెలుగు వెలుగుతున్న అనుష్క పెళ్లి వార్తలు నిజమైతే.. వచ్చే ఏడాది సమంత-నాగా చైతన్య పెళ్లితోపాటు ఈ సెలబ్రిటీ వివాహం కూడా వార్తల్లో నిలిచే అవకాశముంది. పెళ్లి తర్వాత అనుష్క సినిమాల్లో నటిస్తోందో లేదోనని అప్పుడే ఆమె అభిమానులు బెంగ పెట్టుకున్నట్టు సోషల్ మీడియాలో కామెంట్లను బట్టి తెలుస్తోంది. -
త్వరలో అనుష్కకు పెళ్లట...!?
అనుకున్న ది తడవుగా ప్రేమ కలగ దు.. కోరుకున్న వెంటనే పెళ్లి జరగదు. దేనికైనా సమయం రావాలి. ఆ శుభ ఘడియలు నటి అనుష్కకు వచ్చినట్టు తెలుస్తోం ది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలెక్కడానికి సిద్ధం అవుతున్నట్లు పరిశ్రమ వర్గాల టాక్. తొలుత టాలీవుడ్, ఆ తర్వాత కోలీవుడ్‌కు పరిచయమైన నటి అనుష్క తొలి రోజుల్లో స్కిన్ షోకు ప్రాధాన్యం ఇచ్చింది. ఆ తర్వాత అరుంధతి లాంటి చిత్రాల్లో అద్భుతమైన అభినయం చాటి నటిగా తానేమిటో నిరూపించుకుంది. ఆపై అభినయం, గ్లామర్ ఈ రెండు అంశాలను బ్యాలెన్స్ చేసుకుంటూ నటిగా ఎదిగింది. ప్రముఖ హీరోయిన్లలో తన స్థానం పదిలపరుచుకుంటోంది. తమిళంలో ఇరండామ్ ఉలగం, తెలుగులో రుద్రమదేవి, బాహుబలి వంటి చారి త్రక కథా చిత్రాల్లో నటిస్తోంది. ఈ బ్యూటీ నూతన చిత్రాలు అంగీకరించడం లేదట. కారణం కల్యాణ ఘడియలు దగ్గర పడడమేనట. అనుష్కకు 31 ఏళ్లు. దీంతో ఆమెకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ఈ బ్యూటీ పై పలు వదంతులు ప్రచారంలో ఉన్నాయి. టాలీవుడ్ నటుడు నాగార్జునతో సన్నిహితంగా ఉంటోందని, ఆర్యతో చెట్టాపట్టాలంటూ ప్రచారం అవుతున్నాయి. వీటికి పుల్‌స్టాప్ పెట్టేలా కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. ఈ కారణంగానే అనుష్క కమల్ సరసన ఉత్తమ విలన్ చిత్రంలో నటించే అవకాశాన్ని అంగీకరించలేదని సమాచారం.