బంగ్లా బాధితులు కన్నీరుమున్నీరు, అండగా సోనూసూద్‌, వీడియో వైరల్‌ | Bangladesh Sonu Sood urges government to bring back fellow Indians from | Sakshi
Sakshi News home page

బంగ్లా బాధితులు కన్నీరుమున్నీరు, అండగా సోనూసూద్‌, వీడియో వైరల్‌

Published Tue, Aug 6 2024 4:31 PM | Last Updated on Tue, Aug 6 2024 4:31 PM

Bangladesh Sonu Sood urges government to bring back fellow Indians from

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల  ఉద్యమం తీవ్రరూపం దాల్చి హింసాత్మకం మారిపోయింది. దీంతో   ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా  తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయేంత తీవ్రంగా తలెత్తాయి. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర గందరగోళ, రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది. మరోవైపు  పౌరులపై  జరుగుతున్న దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని  భారతీయుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.  వారిపై దాడులు సంచలనంగా మారాయి. దీనికి సంబంధించి ఒక మహిళ ఆవేదన ఎక్స్‌లో వైరల్‌గా మారింది. దీంతో తన వంతు సాయానికి ఎపుడూ ముందుండే  నటుడు సోనూ సూద్‌ స్పందించారు.  బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న హిందువులను భారత్‌కు తీసుకువచ్చేందుకు సాయం చేస్తానంటూ ఆమెకు మద్దతు   ప్రకటించారు.   దీంతో మరోసారి రియల్ హీరో అంటూ  సోనూసూద్‌ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

‘‘తమ ప్రాణాలు పోతాయని భయంగా ఉందని, ఎలాగైనా తమ ప్రాణాలను  కాపాడుకోవడానికి భారతదేశానికి చేరాలా చూడాలని’ తాజాగా బంగ్లాదేశ్ కు చెందిన మహిళ  ఆ వీడియోలో కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇది  సోషల్ మీడియాలో వైరల్‌గామారడంతో సోనూ సూద్ స్పందించారు. ”బంగ్లాదేశ్ నుంచి  భారతీయులందరినీ తిరిగి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు కచ్చితంగా చేస్తాం. ఇక మీరు ప్రశాంతమైన మంచి జీవితాన్ని పొందుతారు. అంతేకాదు ఇది కేవలం మన ప్రభుత్వ బాధ్యతే కాదు.. మనందరి బాధ్యత కూడా.. జై హింద్” అంటూ  ఆయన ట్వీట్‌ చేశారు.  బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన హిందూవులను కాపాడటానికి దేశంలో ప్రముఖలతో పాటు ప్రతిఒక్కరు స్పందించాలని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement