కంగనా రనౌత్ నోటి దురుసు వ్యాఖ్యలు.. సొంత ఎంపీపై బీజేపీ ఆగ్రహం | Kangana Ranaut claims farmers protest in India could have led to a Bangladesh like situation | Sakshi
Sakshi News home page

కంగనా రనౌత్ నోటి దురుసు వ్యాఖ్యలు.. సొంత ఎంపీపై బీజేపీ ఆగ్రహం

Published Mon, Aug 26 2024 6:46 PM | Last Updated on Mon, Aug 26 2024 7:51 PM

Kangana Ranaut claims farmers protest in India could have led to a Bangladesh like situation

ధర్మశాల : రైతుల నిరసనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హిమాచల్‌ ప్రదేశ్‌ మండి నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగన రౌనత్‌పై సొంత పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది.

2020 మోదీ ప్ర‌భుత్వం మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను తీసుకొచ్చింది. రైతులు మాత్రం కేంద్రం తెచ్చిన చట్టాల్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కేంద్రం రైతు చట్టాల్ని వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ దేశంలో ఈ సాగు చట్టాలపై నిరసనలు కొనసాగేలా కుట్ర జరిగే అవకాశం ఉందని, రైతుల నిరసనలను మోదీ ప్రభుత్వం కట్టడి చేయాలని, లేదంటే భారత్‌ మరో బంగ్లాదేశ్‌ తరహా అశాంతి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పైగా అల్లర్లు సృష్టించే వారికి దేశం కుక్కలపాలైనా వారికేం పట్టదని విమర్శించారు.  

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని, లైంగిక దాడులు చోటుచేసుకున్నాయని ఎక్స్‌ వేదికగా షేర్‌ చేసిన వీడియోలో ఆరోపించారు. బాలీవుడ్‌ క్వీన్‌ వ్యాఖ్యలు సొంత పార్టీలోనే దుమారం రేపాయి.

కంగనా రౌనత్‌కు ఆ అధికారం లేదు
రైతుల నిరసన గురించి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ అధికారికంగా స్పందించింది. భవిష్యత్తులో అలాంటి ప్రకటనలు ఇవ్వకూడదని హెచ్చరించింది. రైతుల నిరసనపై కంగనా రౌనత్‌ వ్యాఖ్యల్ని మేం ఖండిస్తున్నాం.‘కంగనా రనౌత్‌కు పార్టీ తరపున విధానపరమైన విషయాలపై మాట్లాడే అధికారం లేదు. ఆమెకు అనుమతి కూడా ఇవ్వలేదు. భవిష్యత్తులో అలాంటి ప్రకటనలు  చేయొద్దని బీజేపీ ట్వీట్‌ చేసింది.  

తప్పు.. ఇలా మాట్లాడకూడదు
మరోవైపు కంగనా రనౌత్‌ వ్యాఖ్యలపై బీజేపీ పంజాబ్ యూనిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి ఉద్రేకపూరిత ప్రకటనలు చేయడం మానుకోవాలని సూచించింది. ‘రైతులపై మాట్లాడటం కంగనా వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదు. ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. ప్రధాని మోదీ, బీజేపీ రైతు పక్షపాతి. ఆమె సున్నిత, మతపరమైన వ్యాఖ్యలు చేయకూడదు’ అని పంజాబ్ బీజేపీ నేత నాయకుడు హర్జిత్ గరేవాల్ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement