
రణ్‌వీర్‌సింగ్
విలన్‌ని చూసి హీరో భయపడతాడా? సై అంటే సై అంటాడు. కానీ బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్ మాత్రం విలన్ సోనూ సూద్‌ని చూసి భయపడుతున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా రూపొందనున్న చిత్రం ‘సింబా’. ఇందులో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ కథానాయిక. ఈ సినిమాలో విలన్‌గా నటించనున్న సోనూ సూద్ జిమ్‌లో వర్కౌట్స్ స్టార్ట్ చేశారు. ‘‘సింబా’ కోసం వర్కౌట్స్ చేస్తున్నా’’ అని జిమ్‌లో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోను రణ్‌వీర్ ట్యాగ్ చేస్తూ.. ‘భయం వేస్తోంది బ్రదరూ’ అని కామెంట్ చేశారు. దీనికి సోనూ స్పందిస్తూ... ‘‘న్యూ ఫిట్‌నెస్ గోల్స్‌ను సెట్ చేస్తున్నా. ఇద్దరం కలిసి అందర్నీ భయపెడదాం’’ అన్నారు నవ్వుతూ. ఈ సినిమా కోసం రణ్‌వీర్‌కు లాయిడ్ స్టీవెన్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదా. అదేనండీ.. ఎన్టీఆర్‌కు ఇతనే ఫిజికల్ ట్రైనర్. ‘టెంపర్’కి రీమేక్‌గా రూపొందుతోన్న ‘సింబా’ను ఈ డిసెంబర్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.