కన్ను కొట్టలేక... | Sara Ali Khan Sings Aankh Mare With Ranveer Singh | Sakshi
Sakshi News home page

కన్ను కొట్టలేక...

Published Fri, Dec 28 2018 2:25 AM | Last Updated on Fri, Dec 28 2018 2:25 AM

Sara Ali Khan Sings Aankh Mare With Ranveer Singh - Sakshi

సారా అలీఖాన్‌

‘సింబా’ సినిమా షూటింగ్‌ లొకేషన్‌ అది. కెమెరా లెన్స్‌ను అటూ ఇటూ మారుస్తున్నారు కెమెరామేన్‌. ఓ షాట్‌ కోసం టీమ్‌ అంతా కష్టపడుతున్నారు. ఎందుకంటే సారా అలీఖాన్‌ మాత్రం టేక్స్‌ మీద టేక్స్‌ తీసుకుంటున్నారు. ‘సింబా’ టీమ్‌ ఇంతలా ట్రై చేస్తున్న ఆ సీన్‌ ఏంటీ అనుకుంటున్నారా? ఏం లేదండీ బాబు. సారా అలీఖాన్‌ కన్ను కొట్టే సీన్‌. ఈ సినిమాలో ‘ఆంఖే మారే’ అనే సాంగ్‌ ఉంది. ఈ సాంగ్‌లో హీరోయిన్‌ కుడికన్ను కొట్టే ఓ సీన్‌ ఉందట. ఈ సీన్‌ కోసం సారా కష్టపడ్డారట. కానీ ఏం లాభం ఎడిట్‌లో అది పోయిందట. సారాకు కన్ను కొట్టడం రాదని ‘సింబా’ మూవీ దర్శకుడు రోహిత్‌ శెట్టి ఓ సందర్భంలో పేర్కొన్నారు. రణ్‌వీర్‌ సింగ్, సారా అలీఖాన్‌ జంటగా నటించిన ‘సింబా’ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. తెలుగు హిట్‌ ‘టెంపర్‌’ చిత్రానికి ఇది హిందీ రీమేక్‌ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement