‘‘నేను డబ్బు వెనక కాదు, ప్రేమ వెనక పరిగెడతాను’ అంటాడు ‘సింబా’ సినిమాలో రణ్‌వీర్ సింగ్. విశేషం ఏంటంటే బాలీవుడ్‌లో ప్రస్తుతం డబ్బంతా ఆయన సినిమాల చుట్టే తిరుగుతోంది. ఒక్క ఏడాదిలో రణ్‌వీర్ సింగ్ సినిమాలు చేసిన బిజినెసే అందుకు ఉదాహరణ. ఆయన నటించిన ‘పద్మావత్, గల్లీ బాయ్, సింబా’ సినిమాలు గత ఏడాది రిలీజయ్యాయి. ఈ మూడు సినిమాలు దాదాపు 800 కోట్లు బిజినెస్ చేయడం విశేషం. ‘‘సినిమా నిర్మాణం రిస్క్. దర్శకుడు, నటీనటులను నిర్మాతలు నమ్ముతారు. ఓ హీరోగా ఆ నమ్మకాన్ని నా సినిమాలు నిలబెట్టడం చాలా సంతోషం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నా సినిమాలు తమ వంతు సహాయపడటం సంతృప్తిగా ఉంది’’ అన్నారు రణ్‌వీర్. యంగ్ హీరోలు ఇలా వరుస సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించడం ఇండస్ట్రీకి మంచి పరిణామం. ఇప్పుడు బాలీవుడ్ పరిశీలకులు రణ్‌వీర్‌ను బాలీవుడ్ యుంగ్ బాద్‌షా అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment