ట్రైలర్‌: ‘టెంపర్‌’ చూపించిన రణ్‌వీర్‌ సింగ్‌ | Ranveer Singh Simmba Trailer Release | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 3 2018 4:42 PM | Last Updated on Mon, Dec 3 2018 4:57 PM

Ranveer Singh Simmba Trailer Release - Sakshi

తెలుగులో ఎన్టీఆర్ .. పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'టెంపర్' అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమాను తమిళంలోనూ .. హిందీలోను రీమేక్ చేస్తున్నారు. తమిళంలో విశాల్‌ హీరోగా ‘అయోగ్య’పేరుతో వస్తుండగా.. బాలీవుడ్‌లో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ‘సింబా’ టైటిల్‌తో రీమేక్‌ చేశారు. బాలీవుడ్‌లో రణ్‌వీర్‌ సరసన సైఫ్‌ అలీఖాన్‌ ముద్దుల కూతురు సారా అలీ ఖాన్‌ నటిస్తోంది. ఈ సినిమాను ‘చెన్నై ఎక్స్ ప్రెస్ ఫేమ్’ దర్శకుడు రోహిత్ శెట్టి హిందీలో రీమేక్ చేశాడు. ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. 

బాలీవుడ్‌ నేటివిటీకి తగ్గట్టుగా ‘సింబా’ మూవీని దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిచినట్టు కనిపిస్తోంది. ఈ మూవీ ట్రైలర్‌ అజయ్ దేవగన్‌ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైంది. అంతేకాకుండా అజయ్‌ దేవగన్‌ అతిథి పాత్రలో మెరవనున్నాడు. ఇక బాలీవుడ్‌లో మూర్తి క్యారెక్టర్‌లో అశుతోష్‌ రాణా నటిస్తుండగా, విలన్‌గా సోనూసూద్‌ ఒదిగిపోయాడు. ఈ చిత్ర ట్రైలర్‌ను చూస్తుంటే తెలుగు టెంపర్‌ క్లైమాక్స్‌ను మాత్రమే మార్చకుండా.. మిగతాదంతా బాలీవుడ్‌కు తగ్గట్టుగా చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని న్యూ ఇయర్‌ కానుకగా డిసెంబర్‌ 28న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక పెళ్లి తర్వాత వస్తున్న సినిమా కావడంతో రణ్‌వీర్‌, దీపికా పదుకొనేతో పాటు వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement