Temper remake
-
టెంపర్ రీమేక్ వాయిదా!
పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా టెంపర్. టాలీవుడ్లో సంచలనం సృష్టించిన ఈ సినిమాను ప్రస్తుతం కోలీవుడ్‌లో అయోగ్య పేరుతో రీమేక్ చేస్తున్నారు. విశాల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించిన చిత్రయూనిట్ ఈ సినిమాను ఏప్రిల్ 19న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం అయోగ్య రిలీజ్ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఇటీవల షూటింగ్లో విశాల్ గాయపడటం, తరువాత నిశ్చితార్థం పనుల్లో విశాల్ బిజీగా కావటంతో షూటింగ్ ఆలస్యమవుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ముందుగా అనుకున్నట్టుగా ఏప్రిల్ 19న కాకుండా మే 10న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేకపోయినా అయోగ్య వాయిదా పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. -
కన్ను కొట్టలేక...
‘సింబా’ సినిమా షూటింగ్ లొకేషన్ అది. కెమెరా లెన్స్‌ను అటూ ఇటూ మారుస్తున్నారు కెమెరామేన్. ఓ షాట్ కోసం టీమ్ అంతా కష్టపడుతున్నారు. ఎందుకంటే సారా అలీఖాన్ మాత్రం టేక్స్ మీద టేక్స్ తీసుకుంటున్నారు. ‘సింబా’ టీమ్ ఇంతలా ట్రై చేస్తున్న ఆ సీన్ ఏంటీ అనుకుంటున్నారా? ఏం లేదండీ బాబు. సారా అలీఖాన్ కన్ను కొట్టే సీన్. ఈ సినిమాలో ‘ఆంఖే మారే’ అనే సాంగ్ ఉంది. ఈ సాంగ్‌లో హీరోయిన్ కుడికన్ను కొట్టే ఓ సీన్ ఉందట. ఈ సీన్ కోసం సారా కష్టపడ్డారట. కానీ ఏం లాభం ఎడిట్‌లో అది పోయిందట. సారాకు కన్ను కొట్టడం రాదని ‘సింబా’ మూవీ దర్శకుడు రోహిత్ శెట్టి ఓ సందర్భంలో పేర్కొన్నారు. రణ్వీర్ సింగ్, సారా అలీఖాన్ జంటగా నటించిన ‘సింబా’ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. తెలుగు హిట్ ‘టెంపర్’ చిత్రానికి ఇది హిందీ రీమేక్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. -
విశాల్ చిత్ర షూటింగ్ రద్దు
చెన్నై, పెరంబూరు: నటుడు విశాల్ చిత్ర షూటింగ్ అనూహ్యంగా రద్దయ్యింది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం అయోగ్య. తెలుగు చిత్రం టెంపర్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటి రాశీఖన్నా కథానాయకిగా నటిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణలో ఉన్నా ఈ చిత్ర షూటింగ్‌ను గురువారం విళిపురం జిల్లా, మరకానం సమీపంలోని కూనిపాడులో నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసుకుంది. దీంతో చెన్నై నుంచి చిత్ర యూనిట్ కూనిపాడు చేరుకుంది. గురువారం ఉదయం ఆ ప్రాంతంలోని వినాయకుడి విగ్రహం ముందు పూజ చేసే సన్నివేశాన్ని చిత్రీకరించడానికి చిత్ర వర్గాలు సిద్ధం అయ్యారు. ఆ సమీపంలో మసీదు ఉంది. గురువారం బాబ్రీ మసీదు కూల్చివేసిన దినం కావడంతో ముస్లీంలు బ్లాక్ డేను పాటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రాంతానికి చెందిన ముస్లీంలు కొందరు విశాల్ చిత్ర షూటింగ్‌ను అడ్డుకున్నారు. బ్లాక్‌డేను పాటిస్తున్న రోజును తమ ప్రాంతంలో వినాయకుడికి పూజలు చేసేలా షూటింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మరకానం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ మైఖెల్హృదయరాజ్ పోలీసులతో కలిసి ఆ ప్రాంతానికి చేరుకుని అనుమతి లేకుండా షూటింగ్ చేయడం నేరం అని హెచ్చరించి బాబ్రీమసీదు కూల్చివేసిన రోజున మసీదు సమీపంలో షూటింగ్ చేయరాదని, వెంటనే నిలిపేయాలని చెప్పారు. దీంతో అయోగ్య చిత్ర వర్గాలు మరో దారి లేక షూటింగ్‌ను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని షూటింగ్ కోసం చెన్నై నుంచి బయలు దేరిన విశాల్‌కు తెలియజేయడంతో ఆయన మధ్యలోనే తిరిగి చెన్నైకి వచ్చేశారు. -
ట్రైలర్: ‘టెంపర్’ చూపించిన రణ్వీర్ సింగ్
తెలుగులో ఎన్టీఆర్ .. పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'టెంపర్' అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమాను తమిళంలోనూ .. హిందీలోను రీమేక్ చేస్తున్నారు. తమిళంలో విశాల్ హీరోగా ‘అయోగ్య’పేరుతో వస్తుండగా.. బాలీవుడ్లో రణ్వీర్ సింగ్ హీరోగా ‘సింబా’ టైటిల్‌తో రీమేక్ చేశారు. బాలీవుడ్లో రణ్వీర్ సరసన సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు సారా అలీ ఖాన్ నటిస్తోంది. ఈ సినిమాను ‘చెన్నై ఎక్స్ ప్రెస్ ఫేమ్’ దర్శకుడు రోహిత్ శెట్టి హిందీలో రీమేక్ చేశాడు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టుగా ‘సింబా’ మూవీని దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిచినట్టు కనిపిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ అజయ్ దేవగన్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైంది. అంతేకాకుండా అజయ్ దేవగన్ అతిథి పాత్రలో మెరవనున్నాడు. ఇక బాలీవుడ్లో మూర్తి క్యారెక్టర్లో అశుతోష్ రాణా నటిస్తుండగా, విలన్‌గా సోనూసూద్ ఒదిగిపోయాడు. ఈ చిత్ర ట్రైలర్‌ను చూస్తుంటే తెలుగు టెంపర్ క్లైమాక్స్‌ను మాత్రమే మార్చకుండా.. మిగతాదంతా బాలీవుడ్‌కు తగ్గట్టుగా చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక పెళ్లి తర్వాత వస్తున్న సినిమా కావడంతో రణ్వీర్, దీపికా పదుకొనేతో పాటు వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
సన్నీ స్టెప్పేస్తే!
సన్నీ లియోన్ స్పెషల్ సాంగ్‌కి డ్యాన్స్ వేస్తే సినిమాకో క్రేజ్ ఏర్పడుతుంది.. సన్నీ స్టెప్పేస్తే సిల్వర్ స్క్రీన్ షేక్ అవ్వడం ఖాయం. ఆల్రెడీ హిందీలో ‘పింక్ లిప్స్, లైలా మే లైలా’ వంటి స్పెషల్ సాంగ్స్‌తోపాటు రాజశేఖర్ ‘పీయస్వీ గరుడవేగ’ చిత్రంలో ‘డియో డియో..’ వంటి సాంగ్‌తో సన్నీ ఎంతటి సెన్సేషన్ సృష్టించారో తెలిసిందే. ఇప్పుడు అదే క్రేజ్ తమ సినిమాకి తోడవ్వాలనుకుంటున్నారు ‘అయోగ్య’ చిత్రబృందం. తెలుగు సూపర్‌హిట్ చిత్రం ‘టెంపర్’ను హీరో విశాల్ తమిళంలో ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాశీ ఖన్నా కథానాయిక. ఏఆర్ మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ దర్శకుడు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం చిత్రబృందం సన్నీ లియోన్ని సంప్రదించారట. ‘టెంపర్’లో ‘ఇట్టాగే రెచ్చిపోదాం పిల్లా’ అనే సాంగ్‌కు నోరా ఫతేహి స్టెప్స్ వేశారు. ఇప్పుడు ఈ ఐటమ్ సాంగ్‌కే తమిళంలో సన్నీ స్టెప్పులు వేయనున్నారట. ఈ చిత్రం ఫస్ట్ లుక్ సోమవారం రిలీజ్ కానుందని సమాచారం. ఈ చిత్రాన్మి ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
అయోగ్యుడవుతున్న విశాల్
తమిళసినిమా: నటుడు విశాల్ వ్యక్తిగతంగా చాలా మందికి సహాయం చేస్తుంటారు. ఆపదలో ఉన్న వారికి ఆర్థికసాయం చేసి ఆదుకుంటుంటారు. అలాంటిది సడన్‌గా అయోగ్యుడిగా మారిపోతున్నారు. ఏమిటీ నమ్మడం లేదా? మీరు నమ్మినా, నమ్మకపోయినా విశాల్ అయోగ్యుడిగా మారుతుండడం నిజం. కంగారు పడకండి విషయం ఏమిటంటే ఇరుంబుతిరై చిత్ర విజయంతో మంచి జోష్‌లో ఉన్న విశాల్ తదుపరి అయోగ్య అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం తమిళంలో రీమేక్ కానుందనే ప్రచారం చాలా కాలం నుంచే జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని మైఖెల్ రాయప్పన్ శింబు హీరోగా ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో నిర్యించనున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఆ చిత్రానికి విశాల్ హీరోగా మారుతున్నారు. అదే విధంగా ఏఆర్.మురుగదాస్ శిష్యుడు వెంకట్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారు. అయితే నిర్మాత మాత్రం మైఖెల్ రాయప్పనే. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం కోసం విశాల్ తన పారితోషికాన్ని తగ్గించుకున్నారట. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో విశాల్‌కు జంటగా నటి రాశీఖన్నా నాయకిగా నటించనున్నట్లు సమాచారం. -
రణ్‌వీర్‌కు టెంపర్ వచ్చింది
ఎప్పుడు అల్లరి చేస్తూ హూషారుగా కనిపించే రణ్వీర్ సింగ్‌కు అసలు టెంపర్ ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది అనుకుంటున్నారా? అయనకు వచ్చింది నిజమైన టెంపర్ కాదండోయ్. సినిమా పరంగా వచ్చిన టెంపర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘టెంపర్’ రీమేక్‌లో రణ్వీర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘సింబా’ అనే టైటిల్‌ని ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్‌ను గురువారం రిలీజ్ చేశారు. ఎప్పుడూ నిజాయితీ గల పోలీసు పాత్రలనే చూపించిన దర్శకుడు రోహిత్ శెట్టి ఈసారి టక్కరి పోలీస్ పాత్రను మనకు చూపించబోతున్నారు. ఇందులో హీరోయిన్గా కాజల్ పేరు పరిశీలనలో ఉంది. ఈ సినిమా కోసం తొలిసారి రోహిత్ శెట్టి, కరణ్ జోహార్ చేతులు కలుపబోతున్నారు. వీళ్ళిద్దరు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ 18న సినిమా విడుదల కానుంది. -
ఇప్పుడు నాకన్నీ తెలుసు!
ఎంత అనుభవజ్ఞులైనా నాకు తెలిసింది ఇసుమంతే నేర్చుకోవలసింది ఎంతో ఉంది అంటుంటారు విజ్ఞులు. అలాంటిది నటి కాజల్‌అగర్వాల్ మాత్రం నాకన్నీ తెలుసు అంటున్నారు. ఇది కాస్త అతి అనిపించినా ఈ బ్యూటీ భావనేమిటన్నది ఒక సారిచూస్తే పోలా.దక్షిణాది చిత్ర పరిశ్రమలో దాదాపు యువ హీరోలందరితోనూ జోడీ కట్టేసిన కాజల్‌అగర్వాల్ ఉత్తరాదిలోనూ తన స్థాయిని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం ఈమెకు కోలీవుడ్‌లోనే పరిస్థితి బెటర్‌గా ఉందని చెప్పవచ్చు. ద్విభాషా(తెలుగు,తమిళం)చిత్రం బ్రహ్మోత్సవంతోపాటు జీవాతో కవలైవేండామ్ అనే తమిళ చిత్రంలోనూ నటిస్తున్నారు. తాజాగా శింబుతో రొమాన్స్ చేసే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. తెలుగు చిత్రం టెంపర్ రీమేక్‌లో శింబు నటించనున్నారన్న విషయం తెలిసిందే.ఇందులో ఆయనకు జంటగా కాజల్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా కోలీవుడ్‌లో అవకాశాలు పెంచుకుంటున్న కాజల్‌అగర్వాల్ తన గురించి ఏమంటున్నారో చూద్దాం. నటీనటుల్లో ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొందరికి డాన్స్‌లో ప్రావీణ్యం ఉంటే, మరొకరికి ప్రేమ సన్నివేశాల్లో చక్కగా నటించే నేర్పరితనం ఉంటుంది. ఇంకొందరికి శోక సన్నివేశాల్లో జీవించే ప్రతిభ ఉంటుంది. అయితే నాకు మాత్రం అన్నీ తెలుసు. ఏ తరహా పాత్రనైనా అవలీలగా చేసేయగలను. నిజం చెప్పాలంటే తొలి రోజుల్లో నాకూ ఏమీ తెలియదు. ముఖ్యంగా ఏడవడం అస్సలు తెలియదు. చిన్నతనం నుంచీ నేను ఏడ్చిన సందర్భాలు లేవు.అందుకే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి చాలా కష్టపడేదాన్ని. కన్నీరు వచ్చేవి కానీ అందులో జీవం ఉండేదికాదు. ఇప్పుడు ఏడవడంతో పాటు అన్నీ నేర్చుకున్నాను. కెమెరా ముందుకు రాగానే దర్శకుడు యాక్షన్ అనగానే ముఖంలో శోకాన్ని నింపుకుని ఏడుపు సన్నివేశంలో జీవించేస్తాను. ఇప్పుడీ తరహా నటనను చూసి నా స్నేహితులు ఆశ్చర్యపోతున్నారు. కథ, పాత్రలను అవగాహన చేసుకుని అందులో లీనమై నటించే పరిణితిని సాధించాను. అందుకే నటిగా తానీ స్థాయికి చేరుకోగలిగాను. -
బాలీవుడ్లో టెంపర్ టెంపరేచర్