ఎప్పుడు అల్లరి చేస్తూ హూషారుగా కనిపించే రణ్‌వీర్ సింగ్‌కు అసలు టెంపర్ ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది అనుకుంటున్నారా? అయనకు వచ్చింది నిజమైన టెంపర్ కాదండోయ్. సినిమా పరంగా వచ్చిన టెంపర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘టెంపర్’ రీమేక్‌లో రణ్‌వీర్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు ‘సింబా’ అనే టైటిల్‌ని ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్‌ను గురువారం రిలీజ్ చేశారు. ఎప్పుడూ నిజాయితీ గల పోలీసు పాత్రలనే చూపించిన దర్శకుడు రోహిత్ శెట్టి ఈసారి టక్కరి పోలీస్ పాత్రను మనకు చూపించబోతున్నారు. ఇందులో హీరోయిన్‌గా కాజల్ పేరు పరిశీలనలో ఉంది. ఈ సినిమా కోసం తొలిసారి రోహిత్ శెట్టి, కరణ్ జోహార్ చేతులు కలుపబోతున్నారు. వీళ్ళిద్దరు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ 18న సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment