‘అవకాశం కోసం.. ఆమె నా వెంటపడింది’ | Rohit Shetty Says Sara Alikhan Begged Him For Role In Simba | Sakshi
Sakshi News home page

‘అవకాశం కోసం.. సారా నా వెంటపడింది’

Published Mon, Dec 31 2018 2:58 PM | Last Updated on Mon, Dec 31 2018 3:46 PM

Rohit Shetty Says Sara Alikhan Begged Him For Role In Simba - Sakshi

రణ్‌వీర్‌ సింగ్‌, సారా అలీఖాన్‌ జంటగా తెరకెక్కిన బాలీవుడ్‌ మూవీ ‘సింబా’. తెలుగులో హిట్‌ సినిమాగా నిలిచిన ‘టెంపర్‌’ కు ఇది రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ హిట్‌ డైరెక్టర్‌ రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ శుక్రవారం విడుదలై మంచి వసూళ్లతో దూసుకుపోతోంది.

ఇక ‘సింబా’  ప్రమోషన్లలో భాగంగా రోహిత్‌ శెట్టి కపిల్‌ శర్మ కామెడీ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సారాను హీరోయిన్‌గా ఎంపిక చేయడానికి గల కారణాన్ని వెల్లడించాడు. ‘ సారా నా దగ్గరికి వచ్చి హీరోయిన్‌ పాత్ర పోషించే అవకాశం తనకే ఇవ్వాలంటూ నా వెంటపడింది. బాలీవుడ్‌ స్టార్లు సైఫ్‌ అలీఖాన్‌, అమృతా సింగ్‌ దంపతుల ముద్దుల తనయ నా దగ్గరికి వచ్చి అలా అడిగే సరికి నా కళ్లు చెమర్చాయి. సింబాలో సారాను తీసుకోవాలని సైఫ్‌ నన్ను ఒక్కసారి సంప్రదించలేదు. సారాపై నమ్మకంతో తనను హీరోయిన్‌గా ఫైనల్‌ చేశాను’ అంటూ రోహిత్‌ చెప్పుకొచ్చాడు.

కాగా సామాజిక సందేశం మిళితమైన ‘సింబా’  వంటి సినిమాలో భాగమయ్యేందుకు తానే డైరెక్టర్‌ రోహిత్‌ శెట్టిని బతిమిలాడానంటూ సారా ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే మొదట తన రిక్వెస్ట్‌ను రోహిత్‌ పట్టించుకోలేదని... కొన్ని రోజుల తర్వాత ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫైనల్‌ చేస్తున్నట్లు తనకు ఫోన్‌ చేశాడని సంతోషం వ్యక్తం చేశారు. ఇక ‘సింబా’ సారాకు రెండో సినిమా. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ హీరోగా తెరకెక్కిన కేదార్‌నాథ్‌ సినిమాతో సారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement