సాక్షి, ఢిల్లీ : కరోనా వైరస్ పై పోరాటంలో సినీ తారలు తమవంతు సాయాన్ని ప్రకటిస్తూ మనవత్వాన్ని చాటుకుంటున్నారు. ముంబైలోని జుహూ నగరంలో ఉన్న తన ఖరీదైన హోటల్‌ను ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి కేటాయిస్తున్నట్లు తెలిపారు నటుడు సోనూసూద్. ఈ కష్ట సమయంలో నిరంతరం పనిచేస్తున్న హెల్త్‌కేర్ కార్మికుల వసతి కోసం తన హోటల్‌ను వినియోగిస్తున్నట్లు ప్రకటించాడు.
కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న వైద్యులకు, నర్సులకు, వైద్య బృందాలకు వసతి కోసం తన హోటల్‌ను వాడుకోవచ్చని తెలిపాడు. మనకోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వాళ్లే రియల్ హీరోలని, వారిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత అని, ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వారికి మద్దతిద్దాం అంటూ పేర్కొన్నారు. సోనూసూద్ నిర్ణయం పట్ల పలువుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక ఇప్పటికే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్..తన కార్యాలయాన్ని క్వారంటైన్ కేంద్రంగా వాడుకోవచ్చని ప్రభుత్వానికి సూచించాడు.
Comments
Please login to add a commentAdd a comment